Ad Code

టెస్లా నుంచి ఎలక్ట్రిక్ ట్రక్ !


టెస్లా మొదటి ఎలక్ట్రిక్ హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ సెమీ ట్రక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కేవలం 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది.  ఈ వెహికల్ ధర 1,50,000 డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2017లోనే ఈ ట్రక్‌ను ఆవిష్కరించిన టెస్లా కంపెనీ 2019లో ట్రక్‌ల తయారీని ప్రారంభించింది. మూడు ట్రక్‌లను పెప్సికోకు అందజేసింది. మొత్తం మూడు రంగులతో ఈ ట్రక్కులను రూపొందించారు. ఒకటి తెల్ల రంగులో, మరొకటి పెప్సికో లోగోతో, మరోదాన్ని ఫ్రిటో-లే రంగుతో అందించారు. 2024 నాటికి 50 వేల ట్రక్కులను సిద్ధం చేయాలని టెస్లా భావిస్తోంది. వాల్ మార్ట్, ఫెడెక్స్ సహా మరికొన్ని కంపెనీలు కూడా వీటికోసం టెస్లాను సంప్రదించినట్లు తెలుస్తోంది. నవంబర్ 15న ఫ్రీమాంట్ నుంచి శాన్ డియో మధ్య 500 మైళ్లు సెమీ ట్రక్కును విజయవంతంగా పరీక్షించినట్టు ఎలాన్ మస్క్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu