Ad Code

రీ చార్జబుల్ హ్యాండ్‌ వార్మర్‌ !



చలి కాలంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిని తట్టుకోవడం కోసం గ్లౌజ్‌లు మొదలు, మఫ్లర్‌లు, జర్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రతీసారి చేతులకు గ్లౌజులు వేసుకోవడం వీలుకాకపోతుండొచ్చు. ముఖ్యంగా ఆఫీసుల్లో కంప్యూటర్‌ల ముందు పనిచేసే వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. చలి వాతావరణానికి తోడు ఆఫీసులో ఉండే ఏసీలతో చేతులు చలితో గడ్డకట్టుకు పోతుంటాయి. ఇలాంటి సమయంలో కాసేపు చేతులను వెచ్చబరుచుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే అమెరికాకు చెందిన ఓ కంపెనీ సరికొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. ‘ఒకూపా’ పేరుతో పరిచయం చేసిన ఈ పరికరంతో చేతులను ఇట్టే వేడి చేసుకోవచ్చు. కాసేపు ఈ రీచార్జబుల్‌ హ్యాండ్‌ వార్మర్‌ను చేతులతో పట్టుకుంటే చాలు వెంటనే వేడిగా మారిపోతాయి. యూఎస్‌బీతో ఈ పరికరం పని చేస్తుంది. ఇది రీచార్జబుల్‌ హ్యాండ్‌ వార్మర్‌. ఈ వార్మర్‌ను ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే ఆరుగంటలు పని చేస్తుంది. ఈ పరికరాన్ని హైటెక్‌ గ్రేడ్‌ అల్యూమినియం, ఏబీఎస్‌ మెటిరియల్‌తో తయారు చేశారు. చేతుల్లో నుంచి సులభంగా జారిపోకుండా దీనిని డిజైన్‌ చేశారు. ఆన్‌చేసిన కేవలం 3 సెకండ్లలోనే గ్యాడ్జెట్ వేడెక్కుతుంది. ఇది కేవలం హ్యాండ్‌ వార్మర్‌గానే కాకుండా పవర్‌ బ్యాంక్‌లా కూడా ఉపయోగపడుతుంది. ధర విషయానికొస్తే మోడల్‌ను బట్టి ఇండియన్‌ కరెన్సీలో రూ. 2,389 నుంచి రూ. 3,543 వరకు ఉంది. అమెజాన్‌తో పాటు పలు ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu