Ad Code

అందుబాటులోకి ఎస్ఎంఎస్ షెడ్యూల్ చేసే ఫీచర్ !


ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్యాప్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా వుంటుంది.  కొందరు ఈ యాప్ వాడకుండా థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి వాడుతుంటారు. కానీ గూగుల్ మెసేజెస్ యాప్ వాడేవారే ఎక్కువ. గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎస్ఎంఎస్ షెడ్యూల్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఎవరికైనా భవిష్యత్తులో ఏదైనా మెసేజ్ పంపాలనుకుంటే ముందే టైప్ చేసి, టైమ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఎవరికైనా భవిష్యత్తులో బర్త్ డే మెసేజ్ యాప్ పంపాల్సి ఉంటే మెసేజ్ టైప్ చేసి, ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. సరిగ్గా ఆ టైమ్‌కి ఎస్ఎంఎస్ డెలివరీ అవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మెసేజెస్ షెడ్యూల్ చేసేందుకు ఇన్నాళ్లూ థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించేవారు. ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ వాడాల్సిన అసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా లభించే గూగుల్ మెసేజెస్ యాప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేసి ఎవరికి మెసెజ్ పంపాలనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేయండి. మెసేజ్ టైప్ చేయండి. ఆ తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేయొద్దు. సెండ్ బటన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి. Schedule Send ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత Select date and time పైన క్లిక్ చేయండి. క్యాలెండర్‌లో డేట్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత టైమ్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత Save పైన క్లిక్ చేస్తే చాలు. మెసేజ్ షెడ్యూల్ అవుతుంది. మీరు ఒకసారి షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను మాడిఫై చేయొచ్చు లేదా డిలిట్ చేయొచ్చు. షెడ్యూల్ చేసినా వెంటనే పంపాలనుకుంటే మెసేజ్ పంపొచ్చు. వేర్వేరు దేశాల్లో నివసించేవారికి మెసేజెస్ పంపడానికి, బిజీగా ఉండేవారికి ఎస్ఎంఎస్ చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu