Ad Code

స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఒక కుక్కనైనా కోల్పోయిందా?

Kharge Dog Remark: 'బీజేపీ కక్కను కూడా..' అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్  చీఫ్ ఖర్గే.. దద్దరిల్లిన పెద్దల సభ - 10TV Telugu

భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్ ‭లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ ''బయటికేమో సింహంలాంటి మాటలు మాట్లాడతారు. కానీ చిట్టెలుకలా ప్రవర్తిస్తున్నారు. సరిహద్దుల వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీనిపై పార్లమెంట్‭లో చర్చ కూడా చేయడం లేదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. మరి బీజేపీ ఏం చేసింది? స్వాతంత్ర్యం కోసం బీజేపీ ఒక కుక్కనైనా కోల్పోయిందా? మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. ఇంతకీ దేశానికి వాళ్లు చేసింది ఏంటి?'' అని ఖర్గే మండిపడ్డారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీపై శునక వ్యాఖ్యలు సరికాదని, ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మగాంధీ అన్నారని రాజ్యసభలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, ఖర్గే క్షమాపణ చెప్పకపోతే రాజ్యసభలో ఉండే అర్హత ఉండదని అన్నారు. అయితే పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై ఎందుకంత మిడిసిపాటని, వాటిని సభలో చర్చించాల్సిన అవసరం లేదని ఖర్గే సమాధానం ఇచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా? అంటూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu