Ad Code

ఆల్ఫాబెట్ 12 వేల ఉద్యోగాల ఊస్ట్ !


ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ స్టాక్ మెమోలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఈ లేఆఫ్ తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. ముందుగా అమెరికాలోని ఉద్యోగులను తొలగించనున్నారు. రెండు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కూడా 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల టెక్నాలజీ రంగంలోని పెద్ద కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపులో నిమగ్నమై ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. బడా కంపెనీల్లో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయపడుతున్నారు. ఆల్ఫాబెట్‌లోని రిక్రూట్‌మెంట్‌ విభాగం, కార్పొరేట్ ఫంక్షన్‌తో పాటు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్‌తో సహా అన్ని టీమ్‌లలో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తొలగింపు జరుగుతోందని.. దీని ప్రభావం అమెరికాలో వెంటనే కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. ఆర్థిక అనిశ్చితే గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు సాంకేతికత స్థాయిలో కంపెనీలు భారీ ప్రాజెక్టులను అనౌన్స్‌ చేస్తున్న సమయంలో ఇలా ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెడుతున్నాయి. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అమెరికా ముందు చాలా పెద్ద అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నాని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో తమ పెట్టుబడులు పెరగబోతున్నాయన్నారు. తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12 వేల మందిని తగ్గించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. కష్టపడి పనిచేసిన, పని చేయడానికి ఇష్టపడే అద్భుతమైన ప్రతిభావంతులను తాము కోల్పోతున్నామని.. అందుకు తాను ప్రగాఢంగా చింతిస్తున్నానని అన్నారు. ఈ మార్పులు గూగ్లర్‌ల జీవితాలపై ప్రభావం చూపుతాయనే వాస్తవం తనకు భారంగా ఉందన్నారు. గత రెండేళ్లలో తాము ఎంతో వృద్ధిని చూశామన్నారు. అమెరికాలోని ఉద్యోగులు పూర్తి నోటిస్ పిరీయడ్ (కనీసం 60 రోజులు) శాలరీని పొందుతారు. గూగుల్లో ప్రతి అదనపు సంవత్సరానికి 16 వారాల జీతంతో పాటు రెండు వారాలతో సెవెరెన్స్ ప్యాకేజీని అందిస్తారు. అంతేకాకుండా కంపెనీ 2022 బోనస్‌లు, మిగిలిన వెకేషన్ టైమ్‌తో పాటు 6 నెలల హెల్త్‌కేర్, జాబ్ ప్లేస్‌మెంట్ సేవలు, ఇమ్మిగ్రేషన్ సపోర్టును చెల్లించాలని గూగుల్ ప్రకటించింది. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులు స్థానిక పద్ధతులకు అనుగుణంగా సపోర్ట్ పొందుతారు. 

Post a Comment

0 Comments

Close Menu