Ad Code

వచ్చే ఏడాది కొత్తగా 1.50 లక్షల మందికి టీసీఎస్‌లో కొలువులు


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చే ఏడాది 1.50 లక్షల కొలువులు ఇవ్వనున్నట్లు  ప్రకటించింది. అమెజాన్‌, ఎంటర్‌ప్రైజ్‌-సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ 25 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 18 నుంచి 18 వేల మందిని అమెజాన్ సాగనంపనున్నట్లు తెలిపాయి. కరోనా వేళ భారీగా ఉద్యోగులను నియమించుకున్న సేల్స్‌ఫోర్స్ పది శాతం మందిని తొలగించింది. ఉద్వాసనలు, లే-ఆఫ్ వార్తల మధ్య టెక్ జెయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) టెక్కీలకు గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో 1.25 లక్షల నుంచి 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వార్తలొచ్చిన నేపథ్యంలో కొత్త వారిని నియమించుకుంటామని టీసీఎస్ వెల్లడించడం గమనార్హం. డిసెంబర్ త్రైమాసికం నాటికి తగ్గిన వర్క్ ఫోర్స్ నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నియామకాలు చేపట్టేందుకు టీసీఎస్ కసరత్తు చేస్తున్నది. గత 18 నెలల్లో భారీగా నియామకాలు చేపట్టినా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో లే-ఆఫ్స్ ఊసెత్తడం లేదు. `ఓవరాల్‌గా నియామకాల ట్రెండ్ యథాతథంగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1.25-1.50 లక్షల మందిని నియమించుకుంటాం. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కోణంలో సంస్థ విశ్వాసాన్ని బలోపేతం చేసుకునేందుకు నియామకాలు కొనసాగుతాయి` అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ మీడియాకు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో సుమారు 2000 మంది వైదొలిగినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 55 వేల మందికి పైగా నియమించుకున్న టీసీఎస్‌.. మొత్తం 1.03 లక్షల మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 42 వేల మందిని నియమించుకుంటామని తెలిపింది. మూడో త్రైమాసికంలో 7,000 మందిని, ఈ ఏడాది తొలి అర్థభాగంలో 35 వేల మందికి పైగా అపాయింట్ చేసుకున్నది. టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ స్పందిస్తూ.. వచ్చే ఏడాది సుమారు 40 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటుందన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu