Ad Code

ఇన్ఫోసిస్ ఆదాయం 20 శాతం వృద్ధి !


ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం ఆదాయంలో 20.2 శాతం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది రూ.31,867 కోట్ల నుంచి రూ.38,318 కోట్లకు పెరిగింది. స్థిర కరెన్సీలో రెవెన్యూ గ్రోత్ 13.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. నిరంతర ఆదాయంలో గతేడాదితో పోలిస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో 13.4 శాతం వృద్ధితో రూ.6,586 కోట్ల నికర లాభం గడించినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫోసిస్ నిర్వహణ లాభాల్లో 21.5 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్ 16-16.5 శాతం మధ్య, ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 21-22 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే డిసెంబర్ త్రైమాసికంలో సిబ్బంది అట్రిక్షన్  24.35 శాతం నమోదయ్యాయని వివరించింది. గతేడాది మూడో త్రైమాసికంలో అత్యధికంగా 25.5 శాతం అట్రిక్షన్లు రికార్డయ్యాయని వెల్లడించింది. `సెప్టెంబర్ – డిసెంబర్ కోర్ సర్వీసులతోపాటు డిజిటల్ బిజినెస్‌లోనూ వృద్ధి నమోదు కావడంతో ఆదాయం గ్రోత్ బలంగా ఉంది. ఇండస్ట్రీ లీడింగ్ డిజిటల్‌, క్లౌడ్‌, ఆటోమేషన్ సామర్థ్యాలతోపాటు క్లయింట్ల అనుబంధం, సిబ్బంది అంకిత భావానికి మా రెవెన్యూ గ్రోత్ ప్రతిబింబిస్తున్నది` అని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. త్రైమాసికం వారీగా రెవెన్యూ గ్రోత్ 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 9.4 శాతం వృద్ధితో రూ.6,021 కోట్ల లాభాలను ఇన్ఫోసిస్ సొంతం చేసుకున్నది. గత తొమ్మిది నెలల్లో సంస్థ నికర లాభం 9.4 శాతం వృద్ధి చెంది రూ.17,967 కోట్లకు చేరుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సర తొలి తొమ్మిది నెలల్లో సంస్థ నికర లాభం రూ.16,425 కోట్లుగా రికార్డయింది. ఇక రెవెన్యూ రూపేణా 22.3 శాతం గ్రోత్‌తో రూ.1,09,326 కోట్లకు చేరుకున్నది.

Post a Comment

0 Comments

Close Menu