23 కోట్ల ఈమెయిల్ ఐడి తస్కరణ !


నెటిజన్ల వ్యక్తిగత సమాచార గోప్యతలో ఇప్పుడు ట్విట్టర్ సురక్షితం కాదని స్పష్టం అయింది. కొంతకాలం క్రితం హ్యాకింగ్‌కు గురయిన 23 కోట్ల 50 లక్షల ట్విట్టర్ ఖాతాదార్ల వ్యక్తి గత సమాచారం అంతా తస్కరణకు గురి అవుతోంది. ఇది హాకర్ల బారిన పడుతుంది, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటర్నెట్ భద్రతా నిపుణులు అలన్ గాల్ తెలిపారు. కోట్లాది మంది ఇ మొయిల్స్ వాటిలోని సమాచారం గోప్యత లేకుండా పోతుందని హెచ్చరించారు. ట్విట్టర్ లీక్‌ల తరువాత కూడా ఎవరైనా ఏ విధమైన స్పందనలకు దిగినా , రహస్యంగా ప్రభుత్వాల దమననీతిని ఖండించే భావవ్యక్తీకరణలకు దిగినా అటువంటి వారి ఉనికి వెలుగులోకి వస్తుంది. వారు ఎవ్వరు వారి పూర్వాపరాలు ఏమిటనేది తెలుసుకునేందుకు వీలేర్పడుతుందని ఈ నిపుణులు తెలిపారు. ట్విట్టర్ లీక్‌కు గురి కావడంతో ఇక ట్విట్టర్ అకౌంట్స్ మరింతగా దెబ్బతింటాయి. ఇ మొయిళ్లు దాదాపుగా ఛేదనకు గురి కావడంతో దీనిని వాడుకుని హ్యాకర్లు కొందరిని ఎంచుకుని వారి తప్పుడు ట్వీట్లకు దిగడం, మరింతగా వారి సమాచారం రాబట్టుకోవడం జరుగుతుందని సైబర్‌సెక్యూరిటీ సహ వ్యవస్థాపకులు , చీఫ్ టెక్నాలజీ ఆఫీసరు అయిన గాల్ తెలిపారు. అకౌంట్ పాస్‌వర్డ్‌లు ఇప్పటికీ లీక్ కానందున హ్యాకర్లు ఇ మొయిల్ ఐడిలను వాడుకుని పాస్‌వర్డ్‌లు మార్చే వీలుంటుంది. ఎలన్ మస్క్ యాజమాన్య బాధ్యతలకు ముందే ట్విట్టర్ హ్యాక్ పరిణామం చోటుచేసుకుంది. అయితే ఆయన హయాం ఆరంభం కాగానే వెలుగులోకి వచ్చిన ఈ హ్యాక్ అంశం ఆయనకు మరింత తలపోటుగా మారింది. మస్క్ బాధ్యతల తరువాత ట్విట్టర్‌కు పలు రకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి ఫెడరల్ ట్రెడ్ కమిషన్ నుంచి జరిమానాలు ఇతరత్రా చర్యలు తప్పని స్థితి ఉంది. తీవ్రస్థాయి గోప్యతా లోపాలు ఏర్పడితే తగు విధంగా మూల్యం చెల్లించుకుంటామని 2011లో ఈ సంస్థతో ట్విట్టర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో మస్క్ పగ్గాలు చేపట్టడానికి ముందు ఈ సంస్థతో ఒప్పందం ఉల్లంఘన అభియోగాల క్రమంలో ట్విట్టర్ 150 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించుకోవల్సి వచ్చింది.

Post a Comment

0 Comments