Ad Code

ఒప్పో నుంచి కొత్త టాబ్లెట్ పాడ్ 2 ?


ఒప్పో పాడ్ 2 పేరుతొ కొత్త టాబ్లెట్ మోడల్‌లను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన మొదటి  ఒప్పో టాబ్లెట్ మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. కాబట్టి ఇప్పుడు  ఒప్పో సంస్థ ఒప్పో పాడ్ 2 మోడల్‌ను పరిచయం చేయడానికి  ఒప్పో ప్యాడ్ 2 మోడల్ 11-అంగుళాల డిస్‌ప్లే తో ఉంది. ఈ Oppo Pad 2 మోడల్‌లో 2800 x 2000 పిక్సెల్‌లు, 144 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10 ప్లస్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. Oppo Pad 2 మోడల్‌లో MediaTek Dimensity 9000 చిప్‌సెట్ ఉన్నట్లు రిపోర్ట్ లు తెలియచేస్తున్నాయి. అలాగే, ఈ టాబ్లెట్ యొక్క గేమింగ్ ప్రయోజనాల ను ఒక్కసారి గమనిస్తే, ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కావడం ప్రధాన విషయంగా చెప్పుకోవచ్చు.  RAM మరియు స్టోరేజీ వివరాలు గమనిస్తే, Oppo Pad 2 మోడల్‌లో 12GB RAM ఉంది. తరువాత, కొత్త టాబ్లెట్ 128GB లేదా 256GB నిల్వ మద్దతుతో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. Oppo కంపెనీ ఈ టాబ్లెట్ మోడల్ లో బ్యాటరీ సామర్థ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు లీక్ అయిన వివరాలు తెలియచేస్తున్నాయి. అంటే Oppo Pad 2 మోడల్ 9500 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి ఈ oppo టాబ్లెట్ గొప్ప బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. ఇంకా, ఈ Oppo Pad 2 మోడల్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుందని రిపోర్టులు తెలియచేస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu