Header Ads Widget

హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ కేంద్రం ఏర్పాటు !


స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 16న ప్రారంభమైన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. సీ4ఐఆర్‌ ఒప్పందంపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సెన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ సంతకాలు చేశారు. జీవశాస్త్రాలు (లైఫ్‌ సైన్సెస్‌), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్‌ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్‌ సీ4ఐఆర్‌ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ బోర్జ్‌ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం హెల్త్‌ కేర్‌ హెడ్‌ డాక్టర్‌ శ్యామ్‌ బిషెన్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0 Comments