Ad Code

వాట్సాప్ లో మరికొన్ని కొత్త ఫీచర్లు ?


ఈ సంవత్సరంలో చాలా ఫీచర్లను తన యాప్ లో వాట్సాప్ జత జతచేయనున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీ మరియు యూజర్ల అనుభవాన్ని మరింత ఉన్నతంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తున్న వాట్సాప్, ఇప్పుడు కూడా అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరికొన్ని కొత్త ఫీచర్లను యాప్ లో జతచేయబోతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ తీసుకొచ్చిన whatsapp avatar ఫీచర్ తో పాటుగా మరిన్ని ఫీచర్లు ఇందులో వుండనున్నాయి. వాటప్ లో కొత్తగా పరిచయం చైయబోతున్న ఫీచర్లలో Search messages by date, వీడియో కాల్స్ కోసం PiP మరియు వాట్సాప్ డెస్క్ టాప్ పైన Call tab వంటి మరిన్ని ఫీచర్లను తీసుకురావడానికి చూస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, డిసప్పియరింగ్ మెసేజీల పైన బుక్ మార్క్ ను గుప్పించే ఫీచర్ ను కూడా జత చేయాలనీ వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్లు కనుక వాట్సాప్ లో యాడ్ అయితే, వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్ అందుతుంది. అవసరమైన మెసేజ్ ను చూడవలసి వచ్చినప్పుడు కేవలం డేట్ ను ఎంచుకోవడం ద్వారా చాలా ఈజీగా మెసేజీలను పొందేందుకు ఈ సెర్చ్ మెసేజెస్ బై డేట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే, ఇప్పటి వరకూ డెస్క్ టాప్ మోడ్ పైన లేని 'Calling Tab' ను కూడా అందిస్తుంది. వీడియో కాల్స్ కోసం PiP మోడ్ ను తీసుకు వచ్చే పనిలో ఉన్నా ఇది iPhone యూజర్ల కోసం ముందుగా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్ధం మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా యాప్ లో జత చెయ్యాలని చూస్తునట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu