Ad Code

ఇన్‌స్టాగ్రామ్ లో 'క్వైట్ మోడ్' !


ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్‌ పాపులర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ మీడియా షేరింగ్‌ ప్లాట్‌ఫారం యూజర్లకు బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్‌లను అందిస్తుంటుంది. ఇప్పుడు తాజాగా 'క్వైట్‌ మోడ్‌' పేరిట కొత్త ఫీచర్‌ని అందజేసింది. ఈ రోజుల్లో చాలా మంది సోషల్‌ మీడియాకు బానిసలు అవుతున్నారు. రోజులో ఎక్కువ గంటలు సోషల్‌ మీడియాకే కేటాయిస్తున్నారు. వీడియోలు చూడటం, మీమ్స్‌ షేర్‌ చేయడం, రీల్స్‌ను స్క్రోల్‌ చేస్తూ రోజు గడిపేస్తున్నారు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఏదైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలో ఏదైనా పోస్ట్‌ చేస్తే.. ఎన్ని లైక్స్‌ వచ్చాయి? ఏ కామెంట్స్‌ చేశారు? వంటి ఆలోచనలతో తరచూ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తూనే ఉంటారు. ఇలా తరచూ స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూస్తున్నప్పుడు, ఇతర పనులపై శ్రద్ధ తగ్గుతోందని భావించినప్పుడు సోషల్‌ మీడియా నుంచి విరామం తీసుకోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి వారిఇక ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా తీసుకొచ్చిన 'క్వైట్‌ మోడ్‌' ఉపయోగపడుతుంది. ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ద్వారా యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలని అనుకున్నప్పుడు నోటిఫికేషన్‌లను పాజ్‌ చేయవచ్చు. ప్రజలు తమ పనులపై దృష్టి కేంద్రీకరించేలా చేయడానికి, స్నేహితులు, ఫాలోవర్స్‌కు హద్దులను సెట్ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. యాప్‌కు దూరంగా సమయం గడిపేలా, యూజర్లలో ఆందోళన తగ్గించేలా చేయడమే ఈ ఫీచర్‌ లక్ష్యం. ఇన్‌కమింగ్ అలర్ట్స్‌ ఆపేయడం, ఎవరైనా ఫాలోవర్లు చేసే డైరెక్ట్ మెసేజ్‌లకు (DMలు) ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వడం వంటివి చేస్తుంది. అకౌంట్ స్టేటస్‌ను 'క్వైట్‌ మోడ్‌'లో సెట్‌ చేయడం ద్వారా ఫాలోవర్స్‌కు యూజర్‌ ప్రస్తుతం యాప్‌లో యాక్టివ్‌గా లేరని తెలుపుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో..'కొత్త మోడ్ ఎనేబుల్‌ చేసిన తర్వాత, యూజర్లకు ఎటువంటి నోటిఫికేషన్‌లను రావు. ఇతరులకు తెలియజేసేలా ప్రొఫైల్ యాక్టివిటీ స్టేటస్‌ కూడా మారుతుంది. ఎవరైనా క్వైట్ మోడ్‌ని ఉపయోగించవచ్చు. కానీ టీనేజ్ యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధరాత్రి ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, క్వైట్‌ మోడ్‌ ఆన్‌ చేయమని సూచిస్తాం' అని తెలిపింది. యూజర్లు తమ షెడ్యూల్‌కు సరిపోయేలా క్వైట్‌ మోడ్‌ అవర్స్‌ను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా క్వైట్‌ మోడ్‌ ఆన్‌లో ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్లను మిస్‌ కాకుండా.. ఫీచర్‌ను డిసేబుల్‌ చేసిన వెంటనే క్విక్‌ సమ్మరీ చూపిస్తుంది. ఏదైనా ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్‌ కాకుండా చూస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన కొత్త మోడ్ US, UK, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో అన్ని దేశాలలోని యూజర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.


Post a Comment

0 Comments

Close Menu