Ad Code

సూర్యుడి వయసు ఎంత ?


అమెరికాకు చెందిన నాసా అంతరిక్ష సంస్థ సూర్యుడిని అంత్యంత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా అది తీసిన చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. నాసా తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై పోస్ట్ చేసిన తొమ్మిది గంటల వ్యవధిలోనే తొమ్మిది లక్షల లైక్ లు వచ్చాయి. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ తన ఇన్ స్టా గ్రామ్ పాఠకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తాము సూర్యునికి 93 మిలియన్ మైళ్ల (150 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉన్నామని, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ కొత్త కక్ష్యలోకి చేరుకున్నామని వివరించింది. ఆ సమయంలో తీసిన చిత్రాన్ని పోస్ట్ కూడా పోస్ట్ చేసింది. నాసా తీసిన సూర్యుడి చిత్రం ఆకట్టుకుంటోంది. భగభగ మండే అగ్ని గోళం వంటి ఆకారంలో అగ్ని కీలలను వెదజల్లుతున్నాడు. సౌర వ్యవస్థలో జరిగే విస్పోటనాలు, శక్తివంతమైన పేలుళ్లను చూపించగలిగింది. అయితే ఈ అత్యంత శక్తి కలిగినవి కావడంతో రేడియో కమ్యూనికేషన్, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్, నావిగేషన్ సిగ్నళ్లను ప్రభావితం చేస్తాయి. అంతేకాక అంతరిక్ష నౌకలు, వ్యోమగాములకు కూడా ప్రమాదాన్ని కలిగించగలవని నాసా వర్ణించింది. అంతేకాక సౌర వ్యవస్థలో మధ్యలో ఉన్న సూర్యుడు 865,000 మైళ్ల వెడల్పు (1.4 మిలియన్ కిమీ) 27 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (15 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు చేరుకునే కోర్‌తో ఉన్నాడని పంచుకుంది. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే గ్రహాలు, ఇతర నక్షత్రాలు అన్ని తమతమ కక్ష్యాల్లో ఉంటున్నాయని నాసా పేర్కొంది. సూర్యుని వయసుని నాసా అంచనా వేసింది. సూర్యుని చుట్టూ నిరంతరం మారుతున్న పరిస్థితుల కారణంగా, ఆ వ్యవస్థలోని అత్యంత పురాతన వస్తువులను చూడటం ద్వారా సూర్యుడి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు ఉండొచ్చని ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu