Header Ads Widget

మైక్రోసాఫ్ట్ మోడర్న్ వెకేషన్ పాలసీ !


అమెరికాలోని సిబ్బందికి మైక్రోసాఫ్ట్ మోడర్న్ వెకేషన్ పాలసీ తెచ్చింది. వాడుకోని వెకేషన్ సెలవులకు వేతనాలివ్వనుంది. ఏడాదికోసారి వెకేషన్ (సెలవు)లో వెళ్లాలనుకుంటే.. మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లాలంటే మీ లగేజీ బ్యాగ్‌లు సర్దుకోవడానికి సరిపడా సెలవుల కోసం వేచి చూడాల్సి వస్తుంది.  అమెరికాలో పని చేస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తన వెకేషన్ పాలసీ మోడర్నైజ్ చేసింది. మోడర్నైజ్ చేసిన వెకేషన్ పాలసీలో ఇతర సెలవులతోపాటు అపరిమితమైన సెలవులు కల్పిస్తున్నది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఇక ఫిక్స్‌డ్ వెకేషన్ తేదీలు ఉండవు. అలాగే అపరిమితమైన సెలవులు కూడా ఉంటాయి. ఈ విషయమై ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ క్యాథ్‌లీన్ హోగాన్ మెయిల్ చేశారు. ఈ వెకేషన్ పాలసీకి `డిస్క్రిషనరీ టైం అప్‌` అనే పేరు పెట్టారు. అంటే ఉద్యోగులకు మరింత ఫ్లెక్సిబుల్ మోడల్‌లో వెకేషన్ పాలసీని మైక్రోసాఫ్ట్ మోడర్నైజ్ చేసిందన్నమాట. అపరిమితమైన వెకేషన్ సెలవులతోపాటు ఉద్యోగులు 10 కార్పొరేట్ సెలవులు పొందుతారు. లీవ్స్ ఆఫ్ అబ్సెన్స్‌, సిక్‌గా ఉన్నా, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, జ్యూరీ డ్యూటీలో ఉండి వెకేషన్ సెలవులు వాడుకోలేకపోవచ్చు. అలా వాడుకోని వెకేషన్ సెలవులకు వచ్చే ఏప్రిల్ నెలలో మైక్రోసాఫ్ట్ వేతనం చెల్లించనున్నది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ఈ మోడర్నైజ్ వెకేషన్ పాలసీతో సంస్థ ఉద్యోగులందరికీ బెనిఫిట్ కాదు. కేవలం అమెరికాలో పని చేస్తున్న వేతన ఉద్యోగులకు మాత్రమే. అమెరికాలో ఉన్నా గంటల ప్రాతిపదికన (పార్ట్‌టైం) పని చేసే వారికి గానీ, ఇతర దేశాల్లోని వారికి గానీ ఈ బెనిఫిట్లు లభించవు. అమెరికాలోని ఫెడరల్‌, రాష్ట్రాల చట్టాల వల్ల గంటల ప్రాతిపదికన పని చేసే వారికి అమలు చేస్తే సమస్యలు తలెత్తుతాయని మైక్రోసాఫ్ట్ చెబుతున్నది. వివిధ దేశాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ పాలసీ అమలు చేయట్లేదని వివరణ ఇచ్చింది.

Post a Comment

0 Comments