Header Ads Widget

ఈ యాప్ లో ఎవరికైనా కాల్ చేస్తే మీ నెంబర్ కనిపించదు !


ఎవరైన కాల్ చేస్తే అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ కనపడుతుంది. మళ్లీ మనం కాల్ బ్యాక్ చేసినప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇతరులకు కాల్ చేసినప్పుడు వాళ్లకు మన ఫోన్ నంబర్ కనిపించదు. ఇందుకోసం ముందుగా  ఆండ్రాయిడ్ ఫోన్‌లో టెక్స్ట్ మీ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకే సిమ్ ఫోన్ లేదా ఒకే సిమ్ ఉన్నట్లయితే ఈ యాప్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత  సైన్ అప్ చేయాలి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత,  నంబర్ ఇతరులకు కనిపించాలనుకునే నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి. అంటే.. మీరు మీకు నచ్చిన సంఖ్యను నమోదు చేయవచ్చు. అయితే, దీని కోసం మీరు చందా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే.. యాప్‌ను డౌన్‌లోడ్ చేసినందుకు మీరు కొన్ని క్రెడిట్‌లను పొందుతారు. ఈ క్రెడిట్‌లను ఉపయోగించి మీరు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. ఇది లిమిట్ గా మాత్రమే ఉంటుంది. కాల్ చేసుకోవడానికి ఆ యాప్ కింద మీకు డయలర్ ప్యాడ్ ఇవ్వబడుతుంది. దానిపై నొక్కి.. ఆపై ఏదైనా నంబర్‌ని డయల్ చేయండి. ఇలా చేసిన తర్వాత.. మీ కాల్ అవతలి వ్యక్తికి వెళ్లినప్పుడు అందులో నంబర్ భిన్నంగా ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ నంబర్లను ఉపయోగించాలనుకుంటే దాని కోసం డబ్బులను చెల్లించాలి. ఇది పూర్తిగా ఉచిత యాప్ కాదు. ఈ యాప్ ద్వారా మీరు మీ నంబర్ ఇవ్వకుండా ఎవరితోనైనా చాట్ కూడా చేసుకోవచ్చు. అవతలి వ్యక్తి మీ నంబర్ కు కాల్ చేసినా ఇన్ వ్యాలిడ్ అని వస్తుంది. 

Post a Comment

0 Comments