Ad Code

ఇస్రో ఆదిత్య స్పేస్ మిషన్ !


ఆదిత్య - L1 అనేది భారతదేశం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో  పంపబోతున్న తొలి స్పేస్ మిషన్. ఈ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ నింగిలోకి మోసుకెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కరోనా అని పిలుస్తారు. అక్కడ దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంత వేడి ఉంటుంది కాబట్టే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి కూడా సూర్యుడి వేడి బాగానే తగులుతూ ఉంటుంది. ఈ వేడిపై పరిశోధన చేసేందుకు ఆదిత్య - L1ను 2023 జూన్ లేదా జులైలో ఇస్రో ప్రయోగించనుంది.  ఆదిత్య - L1 చాలా దూరం వెళ్లాలి కదా.. అందువల్ల దానికి 7 పేలోడ్స్ ఉంటాయి. అవి VELC (కనిపించే ఉద్గార రేఖ కరోనాగ్రాఫ్), SUIT (సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్), SoLEXS (సోలార్ తక్కువ శక్తి ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్), HEL1OS (హై ఎనర్జీ L1 కక్ష్యలో ఉన్న ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్), ASPEX (ఆదిత్య సౌర పవన కణ ప్రయోగం), PAPA (ఆదిత్య కోసం ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ), అధునాతన ట్రై-యాక్సియల్ హై-రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్లు. ఈ పేలోడ్లలో అతి పెద్దదైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC)ని.. జనవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA)... ఇస్రోకి అందించింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కూడా... సూర్యుడిపై ప్రయోగాల్లో నాసా సరసన చేరుతుంది. దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకేసేందుకు శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu