Header Ads Widget

ఉద్యోగుల సమయాన్ని ఫ్రీ అప్ చేయడానికి సమావేశాల రద్దు !


ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఉద్యోగ జీవితం సక్రమంగా ఉండేలా వివిధ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటేనే ప్రొడక్టివిటీ బావుంటుందని భావిస్తున్నాయి. ఉద్యోగులకు ఫ్రీ టైమ్ కల్పించడానికి అప్పుడప్పుడు సమావేశాలను రద్దు చేసుకుంటాయి. తాజాగా కెనడియన్ ఇ-కామర్స్ సంస్థ Shopify ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించింది. ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలను రద్దు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా బుధవారాల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదనే నిబంధనను కూడా తీసుకురానుంది. Shopify తాజా మార్గదర్శకాల ప్రకారం 50 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో నిర్వహించే పెద్ద సమావేశాలను గురువారాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. ఆ సమావేశాలు కూడా కేవలం ఆరు గంటల వ్యవధిలో ముగించనున్నారు.  ఉద్యోగుల సమయాన్ని ఫ్రీ అప్ చేయడానికి సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2023 సంవత్సరాన్ని మేం కొత్తగా ప్రారంభిస్తున్నామని, ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో జరిగే అన్ని రకాల Shopify సమావేశాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు వారి టైమ్‌ను తిరిగి ఇద్దామని, కంపెనీలు బిల్డర్ల కోసం మేనేజర్ల కోసం కాదని Shopify COO కాజ్ నెజాటియన్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో వర్చువల్ సమావేశాలు భారీగా పెరిగాయి. రిమోట్‌గా పనిచేసే చాలా మంది ఉద్యోగులు డిజిటల్ అలసట గురించి ఫిర్యాదు చేశారని, దీంతో ఉద్యోగులకు ఫ్రీ అప్ టైమ్ ఎక్కువగా కల్పించడానికి సమావేశాలు రద్దు చేసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అనవసరమైన సమావేశాలను తిరస్కరించమని ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా Shopify డిజిటల్ అలసటను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది. సమావేశాల షెడ్యూల్ విషయంలో ఉద్యోగులు 'బీ రియలీ క్రిటికల్'గా ఉండాలని నెజాటియన్ అన్నారు. ఈ ఇ-కామర్స్ సంస్థ తన కమ్యూనికేషన్ టూల్స్‌ను రివ్యూ చేసినప్పుడు లార్జ్ ఇంటర్నల్ చాట్ గ్రూప్స్ నుంచి రిమూవ్ కావచ్చు అని కూడా సిబ్బందికి సూచించింది. నెజాటియన్ ఫైనాన్షియల్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. 'సంవత్సరాలుగా అదనపు సమావేశాలు నిత్యం తిరిగి రావడాన్ని మేం చూశాం. మీటింగ్‌లలో కూర్చోవడానికి ఎవరూ Shopifyలో చేరలేదని మాకు తెలుసు' అని అన్నారు.

Post a Comment

0 Comments