Ad Code

వాట్సప్‌లో ఉబర్ క్యాబ్ బుకింగ్ !


వాట్సప్ ఒకప్పుడు కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ మాత్రమే. కానీ ఇప్పుడు అనేక సేవలకు కేంద్రంగా మారుతోంది. బ్యాంకింగ్ సర్వీస్ నుంచి షాపింగ్ వరకు అన్ని రకాల సేవల్ని వాట్సప్‌లోనే పొందొచ్చు. తాజాగా వాట్సప్‌లోనే క్యాబ్ బుక్  చేసుకునే సర్వీస్ ప్రారంభమైంది. ఉబర్ యాప్ యూజర్లు వాట్సప్‌లోనే ఈజీగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ అందించడానికి వాట్సప్‌తో చాలా కాలం క్రితమే ఉబర్ ఒప్పందం చేసుకుంది. మొదట ఢిల్లీ-ఎన్‌సీఆర్, లక్నోలో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.  వాట్సప్‌లో ఉబర్ క్యాబ్ బుక్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో +91 7292000002 నెంబర్ సేవ్ చేయాలి. ఆ తర్వాత వాట్సప్‌లో ఈ నెంబర్ ఓపెన్ చేసి Hi అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత పికప్ అండ్ డ్రాప్ వివరాలు ఎంటర్ చేయాలి. అందుబాటులో ఉన్న ఉబర్ క్యాబ్స్, ఫేర్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. మీరు కన్ఫామ్ చేస్తే క్యాబ్ బుక్ అవుతుంది. బుకింగ్ కన్ఫర్మేషన్ వివరాలు వాట్సప్‌లోనే వస్తాయి. బుకింగ్ చేసిన తర్వాత ఏవైనా మార్పులు ఉంటే వాట్సప్‌లోనే చేయొచ్చు. ట్రిప్ రిసిప్ట్ కూడా వాట్సప్ ద్వారా పొందొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాట్సప్ సేవల్ని అందిస్తోంది ఉబర్. త్వరలోనే మరిన్ని భాషల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. 

Post a Comment

0 Comments

Close Menu