Ad Code

ఆరుగురితో కలిసి కొత్త కంపెనీ మొదలుపెట్టిన హెన్రీ కిర్క్


ఇటీవల గూగుల్ తీసేసిన సీనియర్ మేనేజర్‌, మరో ఆరుగురు ఎక్స్-గూగులర్స్‌తో కలిసి సొంత కంపెనీ ప్రారంభించాడు.ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయట పడేందుకు సెర్చింజన్ గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అలా లే-ఆఫ్స్ నోటీసు అందుకున్న వారిలో వర్కింగ్ సీనియర్ మేనేజర్ కూడా ఉన్నాడు. ఉద్యోగం వదులుకోవడం సంగతి పక్కనబెట్టి మాజీ గూగుల్ ఉద్యోగులతో కలిసి సొంత కంపెనీ ప్రారంభించాడు. అతడి పేరు హెన్రీ కిర్క్‌. కిర్క్‌కు బాసటగా నిలిచిన ఆరుగురు ఎక్స్‌-గూగులర్స్ కూడా అలా లే-ఆఫ్ నోటీసులు అందుకున్న వారే. హెన్రీ కిర్క్ గత ఎనిమిదేండ్లుగా గూగుల్‌లో పని చేస్తున్నాడు. సీనియర్ మేనేజర్‌గా పని చేసిన కిర్క్‌, అతడి స్నేహితులు.. తమ భవిష్యత్‌పై ఆరు వారాల పాటు స్టడీ చేశాక.. సొంతంగా న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో `డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ స్టూడియో` ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. కిర్క్ తన సొంత కంపెనీ గాధను లింక్డ్ ఇన్‌లో షేర్ చేసుకున్నాడు. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులు ఉద్యోగం కోల్పోతే.. లే-ఆఫ్ నోటిఫికేషన్ ప్రకారం 60 రోజుల్లోపు కొత్త కొలువు సంపాదించుకోవాలి. దాని ప్రకారం వచ్చే మార్చి నెలాఖరుతో గడువు పూర్తవుతుంది. ఆ గడువు పూర్తయ్యేలోపు తమ కంపెనీని సెటప్ చేయాలని కిర్క్ భావిస్తున్నాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లో ఉంది.`నాకు మరో 52 రోజుల గడువు మాత్రమే ఉంది. నాకు మీ సాయం అవసరం. కష్టపడి పనిచేసిన వారి జీవితంలో సత్ఫలితాలు వస్తాయని ఎల్లవేళలా నమ్మే వారిలో నేనొక్కడిని. స్టూడియో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నా నమ్మకంలో సందేహం కలిగించవచ్చు. ప్రస్తుత విశ్వజనీనమైన అవకాశాల మధ్య జీవితం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక ప్రయోగం అవుతుంది` అని కిర్క్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన వెంచర్‌లో కలిసి పని చేయడానికి ఆరుగురు ఎక్స్ గూగుల్ ఉద్యోగులు ముందుకొచ్చాడని కిర్క్ తెలిపాడు. `ఈ విపత్కర పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకుని ముందడుగు వేయాలని భావిస్తున్నా. నేను ఆరుగురు ఎక్స్‌-గూగులర్స్ #xooglersతో కలిసి మా సొంత భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు టీంగా ఏర్పడ్డాం. అందుకోసం న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో `డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ స్టూడియో` ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇది మా జీవితంలో అద్వాన్నమైన సమయం కావచ్చు. కానీ, ఉత్తేజకరమైన, సవాళ్లతో కూడిన టైం` అని పేర్కొన్నారు కిర్క్‌. కిర్క్ ప్రారంభించిన స్టార్టప్.. ఇతర కంపెనీల యాప్‌లు, వెబ్‌సైట్లకు వివిధ సంస్థల ఇంజినీరింగ్ ప్రాజెక్టులకు డిజైనింగ్ అండ్ రీసెర్చ్ టూల్స్ ఆఫర్ చేస్తోంది. ఆయా రంగాల పట్ల ఎటువంటి పరిజ్ఞానం లేకున్నా.. ఆయా రంగాల స్టార్టప్ కంపెనీలు ఎదిగేందుకు, డబ్బు సంపాదించేందుకు సహాయం అందిస్తాం అంటున్నది. `ఉద్వాసనకు గురైన ఏడుగురు ఎక్స్‌-గూగులర్స్.. ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్‌వేర్ సంస్థల డెవలప్‌మెంట్‌కు రీసెర్చ్‌, డిజైనింగ్ చేయాలని ఆతృత పడుతున్నారు` అని కిర్క్ పేర్కొన్నాడు.

Post a Comment

0 Comments

Close Menu