Ad Code

టీసీఎల్ నుంచి మూడు కొత్త టీవీల విడుదల !


టీసీఎల్ బడ్జెట్ శ్రేణిలో మూడు కొత్త స్మార్ట్ టీవీలను TCL S5400, TCL S5400A మరియు TCL S5403A పేరిట విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు బెజెల్-లెస్ డిజైన్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24W స్పీకర్లను కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీల్లో 4K రిజల్యూషన్, క్వాంటం డాట్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ ఉన్నాయి. 144Hz యొక్క సూపర్ హై రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. ఈ టీవీలు గేమింగ్‌కు అనుకూలమైనవిగా ఉంటాయి. అంతేకాకుండా, ఈ స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీనితో పాటు, ఈ స్మార్ట్ టీవీలో ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఉంది.  TCL S5400 స్మార్ట్ టీవీ 32-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR 10ని సపోర్ట్ చేస్తుందని. సరికొత్త గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో ఈ స్మార్ట్ టీవీ వస్తుందని TCL కంపెనీ తెలిపింది. ఇది స్మార్ట్ టీవీ ల కోసం సెటప్ చేసిన అన్ని యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్ టీవీ గూగుల్ వాచ్‌లిస్ట్‌కు యాక్సెస్ ఇస్తుంది. అదనంగా, OTT అప్లికేషన్ల ద్వారా వీడియో స్ట్రీమింగ్ కు కూడా సాధ్యమవుతుంది. TCL S5400A మరియు S5403A స్మార్ట్ టీవీ లు 32-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11లో కూడా పనిచేతుంది. ఇది 7,000 యాప్‌లను మీకు అందించడానికి ఆప్షన్ ను కలిగి ఉంటుంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవీ లో ఒకే చోట 7,00,000 కంటే ఎక్కువ సినిమాలు మరియు షోలను పొందుతారు. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా టీవీ కంటెంట్ విశ్లేషణ ఆధారంగా స్క్రీన్ బ్రైట్‌నెస్ మరియు డార్క్‌నెస్ సెట్ చేసే మైక్రో-డిమ్మింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu