Ad Code

వన్‌ప్లస్ E24, X27 మానిటర్ల విక్రయాలు ప్రారంభం !


వన్‌ప్లస్‌ రెండు కొత్త మానిటర్లను బడ్జెట్, మిండ్ రేంజ్‌లో లాంచ్ చేసింది.  వన్‌ప్లస్ మానిటర్ E24, మానిటర్ X27 పేరుతో వీటిని తీసుకొచ్చింది. నేటి నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. E24 మానిటర్ ను కంపెనీ బడ్జెట్ రేంజ్‌లో తీసుకొచ్చింది. దీని ధర రూ.11,999. ఇక వన్‌ప్లస్ మానిటర్ X27 మిడ్ రేంజ్‌లో లాంచ్ అయింది. దీని ధర రూ.27,999. ఈ రెండు మానిటర్స్ OnePlus.in, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ మేజర్ బ్యాంక్ లావాదేవీల్లో నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంది. ఫుల్ HD డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇందులో 16.7 మిలియన్ లైఫ్- లైక్ కలర్స్, విస్తృతమైన 178-డిగ్రీ IPS ప్యానెల్‌ ఉంటుంది. లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ విజువల్స్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ ఫీచర్ కూడా ఈ మానిటర్‌లో ఉంటుంది. వన్‌ప్లస్ మానిటర్ E24 స్లీక్ 8mm మినిమలిస్ట్ డిజైన్‌తో లభిస్తుంది. దీనికి మెటల్ స్టాండ్‌ ఉంటుంది. మూడు-వైపుల బేజల్-లెస్ డిజైన్, అడ్జస్ట్ చేయడానికి స్టాండ్ యాంగిల్‌ ఉంటుంది. డెస్క్‌ వద్ద గందరగోళంగా ఉండకుండా ఈ మానిటర్‌లో బిల్ట్- ఇన్ కేబుల్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను కూడా ఉంటుంది. ఈ మానిటర్‌కు USB టైప్-సి కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మల్టిపుల్ మోడ్‌లతో కస్టమైజ్డ్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్, సీమ్‌లెస్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. X27 మానిటర్ 68.5cms స్క్రీన్ సైజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫాస్ట్, స్మూత్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. వేగంగా 1ms రెస్‌పాన్స్ అందిస్తుంది. మినిమల్ లాగ్స్, బ్లర్స్‌తో అల్ట్రా-క్లియర్ ఇమేజ్‌లను అందిస్తోంది. AMD ఫ్రీసింక్ ప్రీమియంతో OnePlus Monitor X27 గేమ్‌కు తగినట్లుగా స్క్రీన్ మారుతుంది. స్మూత్ విజువల్స్‌తో ప్రొఫెషనల్-స్థాయి గేమింగ్‌ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఇష్టమైన గేమ్‌లను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి షార్ప్ 2K QHD విజువల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ మానిటర్ బ్రైట్ 178-డిగ్రీ IPS ప్యానెల్‌తో అన్ని కోణాల్లో అత్యుత్తమ వ్యూవింగ్ అందిస్తుంది. బ్రైట్ డిస్‌ప్లే HDR 400 కలర్‌తో అద్భుతమైన వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ మానిటర్ స్ట్రీమ్‌లైన్డ్ త్రీ-సైడ్ బెజెల్-లెస్ డిజైన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu