Ad Code

ట్వీట్ లిమిట్ 208 నుంచి 10,000లకు పెంపు ?


ట్విట్టర్ ట్వీటులో ఇప్పటి వరకు ఉన్న క్యారెక్టర్ పరిమితిని పెంచనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. నెట్టింట్లో ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఒక ట్వీటులో క్యారెక్టర్ల సంఖ్య 10,000లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అది 280గా ఉంది. అయితే ఈ పెంపు అందరు యూజర్లకు కాదట. కేవలం ట్విట్టర్ బ్లూ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని మస్క్ స్పష్టం చేశారు. సాధారణ ప్రొఫైల్ ఉన్న వారి కంటే వెరిఫికేషన్ ఉన్నవారికి ఇప్పటికే కొన్ని ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. ఇక తాజా నిర్ణయం కూడా వారికే ఉపయోగంగా ఉండనుంది. ట్వీట్ క్యారెక్టర్స్ లిమిట్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే 10,000 క్యారెక్టర్లు కాదు కానీ, ఒక మోస్తాదు వరకు అయితే పెంచాలనే డిమాండ్ ఉంది. గతంలో ఈ క్యారెక్టర్ సంఖ్య కేవలం 140 మాత్రమే ఉండేది. అయితే 2017లో మొదటిసారి దీన్ని డబుల్ చేస్తూ 280కి పెంచారు. ట్విట్టర్‭ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్.. క్యారెక్టర్స్ పెంచడంపై కూడా నిర్ణయం తీసుకుంటారని ముందు నుంచే ఊహాగాణాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే మస్క్ తాజా ప్రకటన చేశారు. కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్ల నుంచి మాత్రమే ఏమైనా ఆదాయం ఆర్జించగలమని మస్క్ మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకే వారికి అనుకూలమైన విధంగా మార్పులు చేస్తున్నారు. అంతే కాకుండా బ్లూ టిక్ కోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. దీని ద్వారా బ్లూ టిక్ యూజర్లను పెంచడమే కాకుండా, దాన్నుంచి కూడా ఆదాయం పొందుతున్నారు. అయితే మస్క్ ఊహించినంతగా బ్లూ టిక్ సబ్‭స్క్రిప్షన్ విజయం సాధించలేదు. మస్క్ ప్లాట్‌ఫారమ్‌ల మోడరేషన్ మార్గదర్శకాలను సడలించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సహా అనేక నిషేధిత ఖాతాలను పునరుద్ధరించారు. దీని ద్వారా యూజర్లు పెద్ద ఎత్తున ట్విట్టర్‭ను వదిలేశారు.

Post a Comment

0 Comments

Close Menu