Ad Code

ఐట్రిపుల్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అంతర్జాతీయ సదస్సు


విఐటీ-ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఐట్రిపుల్ ఈ సంయుక్త నిర్వహణలో మూడవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ మూడురోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మార్చి 18, 19, 20 తేదీల్లో విఐటీ ఏపి విశ్వవిద్యాలయంలో జరిగింది. వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతికత, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల పాత్రలపై ఈ సదస్సులో చర్చించారు. ఆధునిక సమకాలీన ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ వినియోగం ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగాలలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలను, అధ్యయనాలను పరిశ్రమల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించటానికి విస్తృతమైన వేదికను నెలకొల్పటమే ఈ సదస్సు యొక్క లక్ష్యం . ఈ సదస్సు యొక్క ఫలితాలు సామాజిక మరియు పారిశ్రామిక రంగాలలో ఏర్పడే సమస్యలను అధిగమించటానికి పరిష్కారాలు చూపుతోంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200 మంది ఔత్సాహిక పరిశోధకులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన ముఖ్య అతిథి, గౌరవ అతిథి, ప్రతినిధులకు AISP'23 జనరల్ చైర్ డాక్టర్ బప్పదిత్య రాయ్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ప్రత్యేక అతిధులు డా ||ఈ శ్రీనివాస రెడ్డి (ప్రొఫెసర్ & డీన్ (CSE), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వైస్ చైర్ IEEE, గుంటూరు సబ్ సెక్షన్) మరియు డా|| అతుల్ నేగి (IEEE చైర్, హైదరాబాద్ సెక్షన్) ప్రసంగిస్తూ IEEE నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ ప్రాముఖ్యతను తెలియచేసారు. గౌరవ అతిథి డా || యు. చంద్రశేఖర్ (GMSIR సైంటిఫిక్ ఇన్నోవేషన్ & రీసెర్చ్ సెంటర్) మరియు ముఖ్య అతిధి శ్రీధర్ కొసరాజు (ప్రెసిడెంట్, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ అసోసియేషన్) మాట్లాడుతూ వివిధ రంగాలలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ ల ఉపయోగాలను, భవిష్యత్తులో ఈ రంగాలలో ఏర్పడే ఉద్యోగ అవకాశాల గురించి తెలియచేసారు. విఐటీ - ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో సాధిస్తున్న ప్రగతిని గణాంకాలతో వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి అనేక సదస్సులను నిర్వహిస్తామని తెలియచేసారు. ఈ సదస్సులో విఐటీ - ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి, డా|| రవీంద్ర ధూలి (డీన్, అకడమిక్ రీసెర్చ్), డా|| ఉమాకాంత్ నందా (కన్వీనర్, AISP'23 మరియు డీన్, స్కూల్ అఫ్ ఎలక్ట్రానిక్స్), వివిధ విభాగాల డీన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu