Ad Code

ఎన్ని రెక్కల ఫ్యాన్ బెటర్ ?


మనం ఎక్కువగా మూడు రెక్కల ఫ్యాన్స్ వాడుతూ ఉంటాం.సింగిల్ రెక్క ఉన్న ఫ్యాన్‌ని చూడగానే... "దానికి గాలి రాదు" అని మనం మనసులో అనుకుంటాం. 4 రెక్కలది చూస్తే కరెంటు ఎక్కువ కాలుతుందేమ అని అనుకుంటాం. ఏ ఫ్యాన్ అయినా దానికి ఉన్న బ్లేడ్లు, దాని డిజైన్, దాని మోటర్, దాని నుంచి వచ్చే గాలి ప్రవాహ రేటు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి. సింగిల్ బ్లేడ్ ఫ్యాన్లు కామన్ కాదు. ఎక్కడో గానీ కనిపించవు. కానీ వాటి ప్రయోజనం వాటికి ఉంది. అవి ప్రత్యేకించి ఒకే ప్రదేశానికి గాలిని పంపిస్తాయి. అందువల్ల వీటిని పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం వాడుతారు. రెండు బ్లేడ్ల ఫ్యాన్లను ఇళ్లలో వాడుతుంటారు. ఇవి ఎక్కువ గాలి ఇస్తాయి. కాకపోతే చిన్న గదులకు మాత్రమే ఇవి సెట్ అవుతాయి. ఇవి ఎక్కువ దూరం గాలిని ఇవ్వవు. కాబట్టి చిన్న గది వారికి ఇవి బాగా సెట్ అవుతాయి. మూడు బ్లేడ్ల ఫ్యాన్లు ఇళ్లలో వాడుకోవడానికి బాగా సెట్ అవుతాయి. ఇవి గాలిని అన్ని వైపులకూ సమానంగా ఇస్తాయి. కరెంటు వాడకం కూడా తక్కువగానే ఉంటుంది. మరీ చిన్నగా లేని గదులకు ఈ ఫ్యాన్లు బెటర్. నాలుగు బ్లే్డ్ల ఫ్యాన్ల వాడకం ఇప్పుడిప్పుడే పెరిగింది. ఇవి పెద్ద గదులకు బాగా సెట్ అవుతాయి. విశాలమైన ప్రదేశాల్లో వీటిని వాడటం మేలు. ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి. అందుకు తగ్గట్టే కరెంటు వాడకం కూడా పెరుగుతుంది. మన అవసరాన్ని బట్టీ  ఎన్ని బ్లేడ్ల ఫ్యాన్ వాడాలి అనేది నిర్ణయించుకోవాలి. చాలా మంది పెద్ద రెక్కలు ఉంటే.. ఎక్కువ కరెంటు ఖర్చవుతుందనీ.. చిన్న రెక్కలు ఉంటే.. తక్కువ ఖర్చవుతుందని అనుకుంటారు. అది కొంతవరకే నిజం. ఫ్యాన్‌కి ఉన్న మోటర్‌ని బట్టీ.. కరెంటు ఎంత వాడుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఒకటైతే నిజం.. ఫ్యాన్ రెక్కలు.. చివర్లలో కాస్త వంపు ఉండాలి. వంపు లేకపోతే.. గాలి కిందకు రాదు. కాబట్టే.. ఫ్యాన్ రెక్కలు.. దెబ్బతినకుండా.. ఇష్టమొచ్చినట్లు వంగిపోకుండా చూసుకోవాలి. చిన్న మోటర్ ఉండి, తక్కువ ఆర్పీఎమ్ ఉండే ఫ్యాన్లు తక్కువ కరెంటు వాడుతాయి. ఎక్కువ ఎయిర్ ఫ్లో రేటు ఉన్న ఫ్యాన్.. త్వరగా గదిని చల్లబరచగలదు. చల్లబడినప్పుడు ఫ్యాన్ వాడకం తగ్గిస్తే.. కరెంటు ఆదా అవుతుంది. తక్కువ కరెంటును వాడే ఫ్యాన్లను కొనుక్కోండి. వాటిపై ఎనర్జీ స్టార్ రేటింగ్ ఉంటుంది కదా.. ఎక్కువ స్టార్స్ ఉన్నవి కొనండి. కనీసం 3 సార్లు ఉంటే బెటర్. 4 స్టార్స్ ఉంటే సూపర్. 5 ఉండటం కష్టం. అలాంటివి అంతగా దొరకవు. దొరికినా రేటు ఎక్కువ ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu