Ad Code

వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలి !


అమెజాన్‌, గూగుల్‌, ట్విట్టర్‌, మెటా వంటి పలు టెక్ దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే ఆందోళన నెలకొంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. వారానికి మూడు రోజులైనా ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరించింది. ఉద్యోగుల అటెండెన్స్‌ను ట్రాక్ చేస్తున్న యాపిల్ ఇటీవల ఉద్యోగులను హెచ్చరించినట్టు సమాచారం. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని, ఇలా చేయని ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. పని విధానాలను అతిక్రమించే వారిని తొలగిస్తామని కంపెనీ పేర్కొందని ప్లాట్‌పామర్ మేనేజింగ్ ఎడిటర్ జో షిఫర్ ట్వీట్ చేశారు. అయితే ఇది కంపెనీ అంతటికీ వర్తించదని పేర్కొన్నారు. యాపిల్ మేనేజర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులు మంగళ, బుధ, గురువారాల్లో ఆఫీసుకు రావాలని కోరినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ఇటీవల వెల్లడించింది. కంపెనీ ఆదేశాలను బేఖాతరు చేస్తే తమ ఉద్యోగాలు ఊడతాయని యాపిల్ ఉద్యోగులు పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక చాలా పొజిషన్స్‌కు యాపిల్ నియామకాలను పూర్తిగా నిలిపివేసిందని, మరికొన్ని పొజిషన్స్ నియామకాలను పరిమితంగా చేపడుతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu