Header Ads Widget

బాత్రూంకెళ్ళినా బాడీగార్డులు !


ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ఇటీవలి పరిస్థితులు దారుణంగా మారాయని సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ ఆఫీసుకు వచ్చిన సమయంలో భారీ భద్రత ఉంటుందని, చివరకు ఆయన బాత్రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు వెంట ఉంటున్నారనీ అంటున్నారు. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల్లో వస్తువుల అమ్మకం వంటి పలు మార్పులు తెచ్చిన ఎలాన్‌ మస్క్‌ వాటిని కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కేంద్ర కార్యాలయంతోపాటు చాలా దేశాల్లో ఉన్న ఉద్యోగులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారు. మస్క్‌ అనూహ్య నిర్ణయాలతో ఆ సంస్థ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనకు ఉద్యోగుల పట్ల విశ్వాసం తక్కువని.. అందుకే ఆఫీసులో తిరిగే సమయంలోనూ భయంతో బాడీగార్డులను వెంటపెట్టుకొని ఉంటారని ఆ సంస్థలో పనిచేసే ఓ ఇంజినీరు వెల్లడించారు.

Post a Comment

0 Comments