Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, March 19, 2023

గ్రీన్ టైగర్ మొబిలిటీ "హైబ్రిడ్ స్కూటర్"?


బెంగళూరుకు చెందిన గ్రీన్ టైగర్ మొబిలిటీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ తో నడిచే బైక్స్ ను ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలా రెండింటితో నడిచే హైబ్రిడ్ స్కూటర్ గా ఈ స్కూటర్స్ ఆటోమొబైల్ రంగంలో చరిత్ర సృష్టించనున్నాయి. 125ccలో వస్తున్న ఈ స్కూటర్స్ ఇప్పటికే ARAI & RTO ఆమోదం కూడా పొందడం జరిగింది. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కూటర్‌లకు, మోటార్ సైకిళ్లకు డ్యూయల్ పవర్‌ట్రెయిన్ ఇంజన్లను ఈ కంపెనీ ఫిక్స్ చేసింది. ఇక మార్చబడిన వాహనాలలో ICE పవర్‌ట్రెయిన్, ఎలక్ట్రిక్ కిట్ లు రెండూ కూడా ఉంటాయి. రైడర్ తమకు నచ్చినట్లు ఎలక్ట్రిక్ & పెట్రోల్ మోడ్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్, పెట్రోల్ మోడ్ లో మాక్సిమం 60 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. గ్రీన్ టైగర్ ద్వారా మార్చబడిన వాహనాలు సాధారణ హైబ్రిడ్ 2-వీలర్ల కంటే డిఫరెంట్ గా ఉండనున్నాయి. ICE, ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు ఒకదానికొకటి సెపెరేట్ గా ఉంటాయి. అయితే బండి ఏదైనా ఒక మోడ్‌లో ఉంచినట్లైతే అది ఆ ఇంజన్ లేదా మోటార్ పనిచేస్తుంది. రైడర్ చాలా సులభంగా ఇతర మోడ్‌కి మార్చుకుని తన ప్రయాణాన్ని కూడా ఈజీగా కొనసాగించవచ్చు. ఈ స్కూటర్ రైడర్ తనకు అనువైన విధంగా మార్చేలా ఉపయోగపడనుంది. ప్రతి రోజూ కూడా ఎక్కువసార్లు రైడ్ చేసే వ్యక్తులకు ఈ డ్యూయల్-మోడ్ ఫంక్షన్ స్కూటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాకప్‌గా పెట్రోల్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోడ్‌లో రైడింగ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలతో సవాలుగా ఉన్న రేంజ్ కూడా వస్తుంది. 

No comments:

Post a Comment

Popular Posts