Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, April 30, 2023

మొబైల్ పౌచ్ లు వాడకపోవడం ఉత్తమం !


స్మార్ట్ మొబైల్ కొనడమే కాదు దానికి కచ్చితంగా పౌచ్ వంటివి కొంటూ ఉంటాము. చాలా కంపెనీలు మొబైల్ తో పాటుగా పౌచ్ ను కూడా ఉచితంగా ఇస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. బయట మార్కెట్లో మనకి చాలా రకాల పౌచులు దొరుకుతూ ఉంటాయి. అయితే అందరికీ పౌచ్ ఉండడంవల్ల మొబైల్ కింద పడితే డ్యామేజ్ కాకుండా ఉంటుందనే విషయం మాత్రమే తెలుసు. కానీ ఇలా పౌచ్ వేసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని విషయం ఎవరు గ్రహించడం లేదు. ఫోన్ కి పౌచులు వాడడం వల్ల కలిగే ప్రధాన సమస్య స్మార్ట్ మొబైల్ వేడెక్కుతుంది. మొబైల్ వాడకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో ఎక్కువగా యాప్స్ వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మొబైల్ త్వరగా హీట్ ఎక్కుతుంది. ఇదే పౌచ్ కి ఫోన్ కి ఉంటే ఫోన్లు మరింత హీట్ అవుతాయట !. ఇలా మొబైల్ వేడెక్కడం మొబైల్ కే కాకుండా వాడే వారికి కూడా చాలా ప్రమాదము అందుకే కొద్దిసేపు అయినా మొబైల్ పౌచ్ ని తీసేస్తూ ఉండాలి ముఖ్యంగా గేమ్స్ ఆడే సమయంలో మొబైల్ కు పౌచ్ లేకుండా చూసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా మొబైల్ బ్యాక్ పౌచ్ వాడడం వల్ల ప్యానెల్ డిజైన్లు మార్పుతోపాటు కలర్ కూడా పోవడం వంటివి జరుగుతుంది. మొబైల్ బ్యాక్ పౌచ్ లో ఎక్కువగా బ్యాక్టీరియా కూడా చేరుతుందట. అందుకే స్మార్ట్ ఫోన్స్ వాడకం విషయంలో వైద్యులు వీటిని వాడకూడదని హెచ్చరిస్తూ ఉంటారు.

రేపటి నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు !


భారత టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కస్టమర్లకు స్పామ్, నకిలీ ఎస్ఎంఎస్, ప్రచార కాల్‌ల కోసం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త నియమాలు రేపటి నుండి అమలు చేయబడతాయి. ఈ రకమైన కాల్‌లు, ఎస్ఎంఎస్ లను బ్లాక్ చేయడానికి ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్‌ను సెట్ చేస్తుంది. వినియోగదారుల కాల్‌లు మరియు SMS సేవలలో కృత్రిమ మేధస్సు స్పామ్ ఫిల్టర్ కారణంగా టెలికాం కస్టమర్‌లు రోజువారీ అవాంఛిత స్పామ్ కాల్‌లు మరియు వినియోగదారులకు అవసరం లేని ప్రమాదకరమైన SMS ల నుండి ఉపశమనం పొందుతారు. ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ టెలికాం కంపెనీల కాల్స్ మరియు SMS సేవలపై కృత్రిమ మేధస్సు స్పామ్ ఫిల్టర్‌ను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. నకిలీ కాల్‌లు మరియు ప్రచార కాల్‌లను నివారించడంలో AI ఫిల్టర్ వినియోగదారులకు సహాయపడుతుంది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో టెలికాం కంపెనీలు త్వరలో AI ఫిల్టర్ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. భారతీ ఎయిర్‌టెల్ టెలికాం తన సేవల కోసం AI ఫిల్టర్‌ను ఇప్పటికే ప్రకటించింది. అలాగే, జియో టెలికాం కూడా త్వరలో తన సేవల్లో AI ఫిల్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మోసగాళ్లు మరియు స్కామర్ ల నుండి వినియోగదారులకు పెద్ద సమస్యగా ఉన్న ఫేక్ కాల్స్ మరియు SMSలను నిరోధించడానికి ట్రాయ్ చాలా కాలంగా కృషి చేస్తోంది. స్కామర్లు అమాయక కస్టమర్లను మోసం చేయడానికి మరియు ఖాతాల నుండి వారి డబ్బును లాక్కోవడానికి ప్రయత్నించే మార్గాలలో ఇది కూడా ఒకటి. అందువల్ల, 10 అంకెల మొబైల్ నంబర్‌లకు ప్రమోషనల్ కాల్‌లను నిలిపివేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను కోరుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మొబైల్ ఫోన్‌లలో కాలర్ ఫోటో మరియు పేరును ప్రదర్శించే కాల్ ఐడి ఫీచర్‌ను తీసుకురావడానికి ఎంపికను కూడా అన్వేషిస్తోంది.


యూట్యూబ్ లో 18+ కంటెంట్ ని నిరోధించే విధానం !


ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది వినియోగదారులు యూట్యూబ్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల కోసం ఈ సంస్థ అనేక కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ నిత్యం తమ కస్టమర్స్ ని ఎంగేజ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా వినియోగదారుల కోసం కంపెనీ నియంత్రిత మోడ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో 18 ప్లస్ కంటెంట్ ని నిరోధించవచ్చు. యూట్యూబ్ ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా సార్లు 18 ప్లస్ కంటెంట్ ఎదురవుతుంది. అటువంటి పరిస్థితిలో 18+ కంటెంట్‌ని ఆకస్మికంగా ప్లే చేయడం అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ సందర్భంలో యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చిన మోడ్ ఫీచర్ సహాయంతో 18+ కంటెంట్ ని నిరోధించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్‌ని ఓపెన్ చేసి హోమ్ పేజీలో కుడివైపు మూడు బటన్స్ మీద క్లిక్ చేయాలి, తరువాత ఇక్కడ సెట్టింగ్స్ ని ఎంచుకొని జనరల్ అనే ఆప్షన్‌ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూట్యూబ్ తీసుకొచ్చిన మోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. తర్వాత మీరు టోగుల్ ఆప్షన్ ఆన్ చేయాలి.

క్యూఆర్ కోడ్ అంటే ఏంటి ?


క్విక్ రెస్పాన్స్ కోడ్ ఇదో రకమైన 2D  బార్ కోడ్. ఇందులో సమాచారం.. నలుపు, తెలుపు చదరంగాల రూపంలో ఉంటుంది. ఆ చదరంగాల్లో సమాచారం టెక్స్ట్ రూపంలో లేదా URL రూపంలో లేదా కాంటాక్ట్ సమాచారం రూపంలో లేదా క్యాలెండర్ ఈవెంట్ రూపంలో లేదా ఇతర ఏ విధంగానైనా ఉంటుంది. సంప్రదాయ బార్ కోడ్‌ల కంటే QR కోడ్‌లలో ఎక్కువ సమాచారం ఉంటుంది. ఎందుకంటే వాటిని ఏ దిక్కు నుంచైనా స్కానర్లు చదివేందుకు వీలు ఉంటుంది. అందువల్ల తక్కువ ప్రదేశంలో ఎక్కువ సమాచారాన్ని ఉంచవచ్చు. అందుకే QR కోడ్ లను యాడ్స్, ప్యాకేజింగ్, మొబైల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలుగా వాడుతున్నారు. QR కోడ్‌ని మన కళ్లు చదవలేవు. మొబైల్ కెమెరాలు కూడా చదవలేవు. వాటిని చదవాలంటే  కోడ్ రీడర్ తప్పనిసరి. ఈ రీడర్ చాలా యాప్స్‌లో ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్స్ కూడా ప్రత్యేకంగా లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఏ క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చెయ్యవచ్చు. క్యూఆర్ కోడ్‌ని చదివేందుకు కోడ్ రీడర్ మొబైల్ కెమెరాను ఉపయోగించుకుంటుంది. ముందుగా కోడ్ మొత్తాన్నీ స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత అందులోని సమాచారాన్ని డీకోడ్ చేసి చూపిస్తుంది. అది డేటా కావచ్చు, యూఆర్ఎల్ కావచ్చు, మరో వెబ్‌సైట్ కావచ్చు లేదా పేమెంట్ కావచ్చు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో మనీ మాయం అయ్యే ఛాన్స్ ఉంటుందా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అలాంటి అవకాశం ఉంటుంది. మనం ఏ కోడ్ రీడర్ వాడుతున్నామన్నది ఒక అంశం. వాడే కోడ్ రీడర్ ప్రమాదకరమైనది అయితే ఆ కోడ్ రీడర్ ద్వారా హ్యాకర్లు మనీ కొల్లగొట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే స్కాన్ చేసే క్యూఆర్ కోడ్‌లో హ్యాకర్ యూఆర్ఎల్ లింక్ ఉంటే  స్కాన్ చేసిన తర్వాత ఆ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. దాని ద్వారా ఓ బగ్.. మొబైల్‌లో చేరి.. బ్యాంక్ అకౌంట్‌లో మనీ మాయం చేసే ప్రమాదం ఉంటుంది. తెలియని, అధికారికం కాని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయకపోవడమే మంచిది. ఈ రోజుల్లో ప్రజల డబ్బు కొట్టేసేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారు ఇలాంటి టెక్నాలజీని అడ్డదారి పట్టిస్తున్నారు. అందువల్ల క్యూఆర్ కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటం మేలు.

డేంజర్ యాప్ లను వెంటనే డిలీట్ చేయండి !


సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్‌ డేటాను యాక్సెస్‌ చేసుకోనేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు మాల్వేర్ ఫాక్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లోని కొన్ని ప్రమాదకర యాప్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్ ప్రోగ్రాం కావడంతో మాల్‌వేర్‌ ప్రోగ్రాం అయిన ట్రోజన్‌, యాడ్వేర్, స్పైవేర్‌, కీలాగ్గర్‌ లాంటివి వినియోగించి వారి యాజర్ల డేటాను యాక్సెస్‌ చేసేస్తున్నట్లు వివరించింది. సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ ప్లే స్టోర్‌లోని కొన్ని ఓరిజినల్ యాప్‌లకు కొన్ని హానికరమైన కోడింగ్‌ చేసి, కొత్త వెర్షన్‌, కొత్త పేర్లతో ప్రవేశపెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురి ఫోన్లలో ఈ యాప్ లు ఉండే అవకాశం కూడా ఉంది. వాటిని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రీ గేమ్‌హబ్‌ అండ్‌ బాక్స్‌, హోప్‌ కెమెరా- పిక్సర్‌ రికార్డ్, సేమ్‌ లాంచర్‌ అండ్‌ లైవ్‌ వాల్‌పేపర్‌, అమెజింగ్‌ వాల్‌పేపర్‌, కూల్‌ ఎమోజీ అండ్‌ స్టిక్కర్‌లు హార్లీ ట్రోజన్‌ కలిగి ఉన్న యాప్‌లు.సింపిల్‌ నోట్‌ స్కానర్‌, యూనివర్సల్‌ పీడీఎఫ్‌ స్కానర్‌, ప్రైవేట్‌ మెసెంజర్‌, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్‌ ప్రెజర్‌ చెక్కర్, కూల్‌ కీబోర్డ్‌, పెయింట్‌ ఆర్ట్‌, కూలర్‌ మెసేజ్‌లు జోకర్‌ స్పైవేర్ కలిగి ఉన్న యాప్‌లు. వ్లాగ్‌ స్టార్‌ వీడియో ఎడిటర్‌, క్రియేటివ్‌ 3డీ లాంచర్‌, వావ్‌ బ్యూటీ కెమెరా, గిఫ్ ఎమోజీ కీబోర్డ్‌, ఇన్‌స్టంట్‌ హార్ట్‌రేట్‌ ఎనీటైం, డెలికేట్‌ మెసేంజర్‌లు ఆటోలికోస్ మాల్వేర్‌ కలిగి ఉన్న యాప్‌లు. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినప్పుడు, దానికి సంబంధించిన కామెంట్స్‌ను చదివితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌, యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మేలు. ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నప్పుడు ఓసారి రేటింగ్‌ను చూడడం కూడా మంచిది. థర్డ్‌ పార్టీ యాప్‌లు కాకుండా నేరుగా గూగుల్‌ ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నప్పుడు డెవలపర్‌ ఎవరో చెక్‌ చేయడం వల్ల మాల్‌వేర్‌ బారిన పడకుండా ఉంటాం. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత అనవసరమైన పర్మిషన్లు అడుగుతోందంటే., ఉదాహరణకు ఏదైనా ఫోటో ఎడిటింగ్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే దానికి సంబందించిన పర్మిషన్లే కాకుండా ఫోన్‌, ఎస్ఎంఎస్ పరిషన్లు కూడా అడుగుతోందంటే ఆ యాప్‌పై కొంచెం అనుమానం వ్యక్తం చేయాల్సిందే. ఫోన్‌కు వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయకూడదు. తనిఖీ చేసుకొని ఓపెన్ చేయడం మంచిది.

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ !


వాట్సాప్ లో ఫార్వార్డ్ చేయబడిన మీడియాకు మరింత సందర్భం, స్పష్టతను జోడించడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రత్యేకించి, ఎవరైనా ఒక చిత్రాన్ని లేదా వీడియోను చాట్‌కి ఫార్వార్డ్ చేసినప్పుడు, వారు ఇప్పుడు దాన్ని తీసివేసి, వారి స్వంత వివరణను జోడించవచ్చు. ఈ ఫీచర్ అపార్థాలు మరియు తప్పుడు వ్యాఖ్యానాలను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇతరులకు మీడియా కంటెంట్‌ను అర్థం చేసుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఫార్వార్డ్ చేయబడిన చిత్రం, వీడియో, GIF మరియు డాక్యుమెంట్ నుండి క్యాప్షన్‌ను తీసివేసిన తర్వాత కొత్త సందేశాన్ని జోడించడానికి వినియోగదారులను అనుమతించే ఫీచర్ యాప్ మునుపటి బీటా వెర్షన్‌లలో ప్రవేశపెట్టిన ఇన్‌స్టాల్ చేసే iOS వినియోగదారులకు చివరకు అందుబాటులో ఉంది.ఈ ఫీచర్ లేకుంటే, అధికారిక చేంజ్‌లాగ్‌లో పేర్కొన్నట్లుగా, కొన్ని ఖాతాలు రాబోయే వారాల్లో దీనిని పొందవచ్చు. ఈ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఫీచర్‌ని పొందకుంటే యాప్ స్టోర్ మరియు టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుండి వాట్సాప్ ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. మరోవైపు వాట్సాప్ టెస్ట్ ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ క్రింద వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ వాయిస్ నోట్‌ను వినడం సాధ్యం కానటువంటి సందర్భాల్లో వాయిస్ సందేశం కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది,

Saturday, April 29, 2023

లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ విడుదల !


లావా మొబైల్స్ నుంచి మరో 5జీ ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ పేరిట దీనిని కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతేడాది విడుదలైన బ్లేజ్ 5జీ ఫోన్ కి ఇది అప్ గ్రేడెడ్ వెర్షన్. దీనిలో మరిన్నిఅధునాతన ఫీచర్లు ఉన్నాయి. గత మోడల్ లాగానే వెనుకవైపు ప్రీమియం గ్లాస్ బ్యాక్ ప్యానల్ ను దీనిలో కూడా అందించింది. ఫ్లాట్ ఫ్రేమ్, రియర్ ప్యానల్ ఉంది. ఇది సింగిల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఆక్టా కోర్ చిప్ సెట్ ను కలిగి ఉంది. 5జీబీ వరకూ ర్యామ్ ని వర్చువల్ గా పెంచుకోవచ్చు. 1టీబీ వరకూ ఎక్స్ టర్నల్ మెమరీ సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13కి అప్ గ్రేడ్ చేసుకొనే వెసులుబాటు ఉంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, 1600*720 పిక్సల్స్ హెడ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. 90Hzరిఫ్రెష్ మెంట్ రేట్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వద్ద వాటర్ ట్రాప్ నాట్చ్ ఉంటుంది. ఇది వైడ్ వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 2ఎంపీ మైక్రో సెన్సార్, వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్స్ సామర్థ్యంతో ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూ టూత్ 5.1, జీపీఎస్ ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్లలో ఫోన్ లభిస్తోంది. 6జీబీ వేరియంట్ ధర రూ.12,000 గా ఉంది.

ప్లే స్టోర్ నుంచి 3,500 పైగా లోన్ యాప్స్‌ తొలగింపు !


భారత ప్రభుత్వం, ఆర్బీఐ సూచనలతో టెక్ దిగ్గజం గూగుల్‌ స్పందించి తమ యాప్ స్టోర్‌లో అక్రమ రుణాల ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గురువారం తెలిపింది. 2022లోనే 1.73 లక్షల 'బ్యాడ్‌ అకౌంట్స్‌'ను నిషేధించినట్లు గూగుల్ వెల్లడించింది. గత ఏడాది 14.3 లక్షల పాలసీ-ఉల్లంఘించే యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో లిస్ట్‌ కాకుండా నిరోధించింది. దీంతో 2 బిలియన్ల డాలర్ల విలువైన మోసపూరిత, దుర్వినియోగ లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించింది. ప్లే స్టోర్ గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘించినందుకు గూగుల్ 2022లోనే ఇండియన్ యాప్ మార్కెట్ ప్లేస్ నుంచి 3,500కి పైగా డిజిటల్ లెండింగ్ యాప్‌లను తొలగించింది. ఇటీవల గూగుల్‌ తన ప్లే స్టోర్ పాలసీని పునరుద్ధరించింది. కాంటాక్ట్‌లు, ఫోటోలు, కాల్ లాగ్స్, లొకేషన్ వంటి వినియోగదారుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా రుణాలు ఇచ్చే యాప్‌లను నిషేధించే కఠినమైన గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు ప్లే స్టోర్‌లో లిస్టింగ్ కోసం ఆమోదం పొందడానికి ఈ కఠినమైన గైడ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలి. సేవలు ప్రారంభించడానికి తప్పనిసరిగా RBI లైసెన్స్‌ను అందించాలి. ఈ విధానాలు 2023 మే 31 నుంచి అమల్లోకి వస్తాయి. గత కొన్నేళ్లుగా డిజిటల్ లెండింగ్ మార్కెట్ భారీ వృద్ధిని సాధించింది. 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.18,537 కోట్ల విలువైన 1.8 కోట్ల పంపిణీలు జరిగాయి. అయినప్పటికీ లెండింగ్‌టెక్ స్టార్టప్‌లు భారీగా పుట్టుకొచ్చాయి, మోసపూరిత పద్ధతులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం, ఆర్బీఐ జోక్యం అనివార్యమైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద రుణం ఇచ్చే యాప్ ఆపరేటర్ల నుంచి రూ.106 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్రమ రుణాలు ఇచ్చే ప్లాట్‌ఫామ్‌లు, వాటి అనైతిక పద్ధతులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌ చర్యలు మేలు చేస్తాయని భావిస్తున్నారు. లోన్ యాప్‌లకు సంబంధించి ఆత్మహత్యలు, వేధింపుల గురించి అనేక నివేదికలు వచ్చాయి. మహిళలను కూడా కలెక్షన్ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, బంధువులకు ఫార్వార్డ్‌ చేయడం వంటివి చేస్తున్నారు. డబ్బు రికవరీ కోసం లోన్‌ యాప్‌ ఏజెంట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు.

అమెజాన్‌లో ఫైర్ బోల్డ్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ !


అమెజాన్‌లో ఫైర్ బోల్డ్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని ఎంఆర్‌పీ రూ. 19,999గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 1799కే కొనొచ్చు. అంటే మీకు నేరుగానే 91 శాతం డిస్కౌంట్ వస్తోంది. అలాగే ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 150 తగ్గింపు ఉంది. అంటే మీరు కేవలం రూ. 1650కే ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయొచ్చు. ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు నెలకు రూ. 300 పడుతుంది. లేదంటే 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 600 చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకా 9 నెలలు అయితే నెలకు రూ. 214 కట్టాలి. ఏడాది టెన్యూర్‌పై అయితే నెలకు రూ. 163 చెల్లించాలి. ఇక 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 113 పడుతుంది. ఇంకా 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 88 చెల్లిస్తే చాలు. కొన్ని కార్డులపై టెన్యూర్ 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. కొన్ని కార్డులపై అయితే టెన్యూర్ తక్కువగానే పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల మీరు స్మార్ట్ వాచ్ కోసం చూస్తూ ఉంటే.. ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. లేదంటే ధర ఎక్కువ అయినా పర్లేదు అనుకుంటే ఇంకా ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ వాచ్‌లను పరిశీలించొచ్చు. ధర ప్రాతిపదికన మీకు లభించే స్మార్ట్ వాచ్‌లో ఫీచర్లు కూడా మారుతూ ఉంటాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో గలాంజ్ 10 కేజీ వాషింగ్ మెషీన్‌పై భారీ డీల్ !


ఫ్లిప్‌కార్ట్‌లో గలాంజ్ 10 కేజీ వాషింగ్ మెషీన్‌పై భారీ డీల్ అందుబాటులో ఉంది. ఇది క్విక్ వాష్, ఇన్వర్టర్ ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్. అలాగే ఇందులో బిల్ట్ ఇన్ హీటర్ కూడా ఉంటుంది. ఈ వాషింగ్ మెషీన్ ఎంఆర్‌పీ రూ. 50,990గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 18,990కే కొనుగోలు చేయొచ్చు. 62 శాతం డిస్కౌంట్ తో వస్తోంది. అంతేకాకుండా దీనిపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ రూ. 750 లభిస్తోంది. ఈ ఆఫర్ కలుపుకుంటే మీరు రూ. 18,240కే వాషింగ్ మెషీన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ వాషింగ్ మెషీన్ ఆర్‌పీఎం 1400. ఏకంగా 15 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కెపాసిటీ 10 కేజీలు. 10 రోజులు రిప్లేస్‌మెంట్ పాలసీ ఉంది. అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్ కింద కూడా ఈ వాషింగ్ మెషీన్ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 912 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఈ ఈఎంఐ రేటు వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1176 పడుతుంది. ఇంకా 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1706 కట్టాల్సి వస్తుంది. 9 నెలల ఈఎంఐ అయితే రూ. 2235 చెల్లించుకోవాలి. 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3296 పడుతుంది. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 6479 చెల్లించుకోవాలి. ఇలా మీరు క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ ఈఎంఐ పెట్టుకోవచ్చు. దాదాపు చాలా బ్యాంకుల క్రెడిట్ కార్డులకు ఈ డీల్ వర్తిస్తుంది. కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450


రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్‌ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది. గత జనవరిలో విడుదలైన సూపర్ మీటోర్ 650 వాటిలో ఒకటి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ హంటర్ 450 బైక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి కంపెనీ కొత్త అప్ డేట్ ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 450 సరికొత్త బైక్ వచ్చే ఏడాది భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో సూపర్ మీటోర్ 650 విడుదలైన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ సింగిల్-సీటర్ క్లాసిక్ 350-ఆధారిత బాబర్, కొత్త-జెన్ బుల్లెట్ 350 మరియు హిమాలయన్ 450లను తీసుకురావాలని భావిస్తున్నారు. డ్యూయల్-పర్పస్ అడ్వెంచర్ టూరర్ వచ్చే మొదటి 450 cc మోటార్‌సైకిల్ అవుతుంది. 2024లో ఈ బైక్ అందుబాటులోకి వస్తుందని అంచనా. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఇతర రెండు 650సీసీ బైక్‌లు కూడా ఓవర్సీస్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త బైక్‌లను ఎక్కువ సిసితో నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి, హిమాలయన్ అడ్వెంచర్ బైక్ యొక్క 450 సిసి వెర్షన్ పనిలో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా నివేదికలు ఉన్నాయి. హిమాలయన్ 450తో పోలిస్తే నేక్డ్ రోడ్‌స్టర్ తక్కువ సీటు ఎత్తును కలిగి ఉంటుంది. వివిధ ట్రిమ్‌లలో అల్లాయ్ వీల్స్, వైర్-స్పోక్డ్ వీల్స్ మరియు అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం హంటర్ 350 బైక్ యొక్క 450సీసీ వెర్షన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆగస్ట్ 2022లో లాంచ్ అయిన హంటర్ 350 బైక్‌కి భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి మంచి ఆదరణ లభించింది. అటువంటి బైక్ కోసం 450cc వెర్షన్ నిజంగా మంచి ప్లాన్. హంటర్ 450 బైక్ వచ్చే ఏడాది 2024లో విడుదల కానుంది. లుక్స్ పరంగా, కొత్త హంటర్ 450 ప్రస్తుత హంటర్ 350 బైక్ కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. కానీ హిమాలయన్ 450 సైజులో కొంచెం చిన్నది. ప్రత్యేకంగా, హంటర్ 450లో రైడర్ సీటు ఎత్తు హిమాలయన్ 450 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. స్పై చిత్రాలు ఆధునిక/రెట్రో స్టైలింగ్, మినిమలిస్టిక్ బాడీ ప్యానెల్‌లు, స్లిమ్ ఫ్యూయల్ ట్యాంక్, వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్, LED టర్న్ ఇండికేటర్‌లు, ఆఫ్‌సెట్ వెనుక మోనోషాక్ సస్పెన్షన్, తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్‌లు మొదలైన ఉన్నాయి. రాబోయే 450 cc మోటార్‌సైకిల్ సరికొత్త 450 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో గరిష్టంగా 40 bhp పవర్ అవుట్‌పుట్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడుతుంది. అయితే స్లిప్పర్, అసిస్ట్ క్లచ్ ప్రామాణికంగా ఉంటుంది. 

బజాజ్ రీఛార్జబుల్ బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ !


మార్కెట్లో చాలా రీచార్జిబుల్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. కరెంట్‌ లేకపోయినా గంటల తరబడి పనిచేసే సామర్థ్యం ఈ ఫ్యాన్‌కు ఉండడం ప్రధాన విశేషం. వాటిలో ఫిప్పీ MR-2912 రీఛార్జబుల్ బ్యాటరీ టేబుల్ ఫ్యాన్, బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్లు ఉన్నాయి. ఫిప్పి MR-2912 రీఛార్జబుల్  బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ మూడు బ్లేడ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇది గోడపై సులభంగా అమర్చవచ్చు. అవసరమైతే టేబుల్‌పై కూడా ఉపయోగించవచ్చు. ఈ టేబుల్ ఫ్యాన్ USB, AC DC మోడ్‌లలో కనెక్షన్‌ని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయబడితే, ఈ రీఛార్జ్ చేయగల బ్యాటరీ టేబుల్ ఫ్యాన్ పూర్తి వేగంతో 3.5 గంటలు, మీడియం వేగంతో 5.5 గంటలు, తక్కువ వేగంతో సుమారు 9 గంటలు పని చేస్తుంది.దీని ధర రూ. 3,299. బజాజ్ PYGMY మినీ 110MM 10W ఫ్యాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాన్. అద్భుతమైన డిజైన్‌తో లభించే ఈ ఫ్యాన్ యూఎస్‌బీ ఛార్జింగ్‌తో అందుబాటులోకి రానుంది. Li-Ion బ్యాటరీతో నడిచే ఈ ఫ్యాన్ ఫుల్ ఛార్జ్‌తో దాదాపు నాలుగు గంటల పాటు పని చేస్తుందని తెలిసింది. కాంపాక్ట్ సైజులో లభించే ఈ ఫ్యాన్‌ని ఎక్కడైనా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 

Friday, April 28, 2023

మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !


మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్  బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఈ సేల్ మే 5 నుంచి ఈ సేల్ ప్రారంభమై మే 10న ముగుస్తుందని టీజర్ పేజీ వెల్లడించింది. మొత్తం 6 రోజుల పాటు సేల్ కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఆపిల్ iPhone 13, Samsung Galaxy F14 5G, Realme C55, Pixel 6a వంటి ఇతర ఫోన్‌లపై  భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ సమయంలో పిక్సెల్ 6a  ధర రూ. 25,999కు సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి GT Neo 3T ధర రూ. 19,999గా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అలాగే, Poco X5 Pro ఫోన్ కొన్ని ఆఫర్‌లతో సహా రూ. 20,999కి అందుబాటులో ఉంటుంది. Realme 10 Pro+ 5G ఫోన్ రూ. 22,999కి కొనుగోలు చేయొచ్చు. ఇక, బడ్జెట్ ఫోన్ మోడల్ ధర రూ.7,999లకు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13 ధరను ఇంకా వెల్లడించలేదు. ఈ డివైజ్ కూడా అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో రానుంది. ప్రస్తుతానికి అదే 5G iPhone మోడల్ ధర రూ. 61,999కు అందుబాటులో ఉంది. సేల్ సమయంలో Moto e13 ధర రూ.7,499కి తగ్గుతుంది. పిక్సెల్ 7 ఫోన్ ధర రూ. 44,999కు అందుబాటులో ఉంటుంది. ఇదే పిక్సెల్ 7 మోడల్ అమెజాన్ (Amazon)లో ఇప్పటికి ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 43,900 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. శాంసంగ్ Galaxy S21 FE 5G, Samsung Galaxy Z Flip 3 వంటి ఇతర ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో కర్టెన్ రైజర్ డీల్‌లను అందించనుంది. మే 1 నుంచి సేల్ సంబంధిత డీల్స్ రివీల్ చేయనుంది. గత సేల్ ఈవెంట్‌ల మాదిరిగానే.. ఈ ప్లాట్‌ఫాం కర్టెన్-రైజర్ డీల్‌లలో ఒకదానిలో iPhone 13 ధరను వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రొడక్టులపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

10 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోయిన నెట్‌ఫ్లిక్స్ !


నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ పాస్‌వర్డ్స్ షేర్ చేసుకోవడం అనేది ఒకప్పుడు కామన్ విషయం. చాలామంది ఈ టెక్నిక్‌తో ఫ్రీగా కంటెంట్ స్ట్రీమింగ్‌ సేవలు పొందేవారు. క్రమంగా ఇది కంపెనీ లాభాలకు గండి కొట్టింది. దీంతో యూజర్లకు పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఛార్జీలు విధించాలని నెట్‌ఫ్లిక్స్ ఇటీవల నిర్ణయించింది. అయితే బిజినెస్‌ డెవలప్‌ చేసేందుకు తీసుకున్న నిర్ణయం నెగెటివ్‌ రిజల్ట్‌ ఇచ్చింది. కొన్ని దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించగా, భారీగా సబ్‌స్కైబర్స్ ఈ పోర్టల్‌ను వీడుతున్నారు. 2023 మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ 10 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ కాంతర్ హౌస్‌హోల్డ్స్‌ స్ట్రీమింగ్ హ్యాబిట్స్‌పై చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. నెట్‌ఫ్లిక్స్ కోల్పోయిన వినియోగదారులలో మూడింట రెండు వంతుల మంది ఇతర కుటుంబాలతో పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకునే వారని తేలింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై ఛార్జీలు విధించడంతో వీరిలో చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌కు దూరమయ్యారని పేర్కొంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు నెట్‌ఫ్లిక్స్‌ 2023 ఫిబ్రవరిలో స్పానిష్ వినియోగదారుల కోసం దాదాపు రూ.500తో కొత్త మంత్లీ ప్లాన్‌ తీసుకొచ్చింది. షేరింగ్‌ని డిటెక్ట్‌ చేయడానికి, నిరోధించడానికి టెక్నాలజీని ఇంప్లిమెంట్‌ చేసింది. అయితే నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. మిలియన్ మంది వినియోగదారులను కోల్పోవడం, నెట్‌ఫ్లిక్స్‌ షోస్‌, సర్వీసెస్‌పై వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ రికమండేషన్స్‌పై నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపనుంది. స్పెయిన్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో నెట్‌ఫ్లిక్స్‌ ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. ఇదే విధమైన సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుతో పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్ వంటి ఇతర మార్కెట్‌లలో ప్లాన్‌ అమలు చేయనుంది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడం ద్వారా ఆదాయ నష్టాన్ని నిరోధించే ప్రయత్నాలు కొనసాగించే యోచనలో ఉంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ లేకపోవడంతో, ఇంతకుముందు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించని వారు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారని కంపెనీ భావిస్తోంది. భారత్‌లో ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే, యూజర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. కాంతర్ వరల్డ్‌ప్యానెల్ డివిజన్‌లో గ్లోబల్ ఇన్‌సైట్ డైరెక్టర్ డొమినిక్ సున్నెబో మాట్లాడుతూ.. పాస్‌వర్డ్-షేరింగ్‌పై కంపెనీ తీసుకున్న నిర్ణయాలతోనే వినియోగదారుల సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. అయితే ఇది డేటాలో కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే అని, దీర్ఘకాలికంగా ఇదే ట్రెండ్‌ ఉండకపోవచ్చని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ రెవెన్యూ లాస్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోందనే అంశం స్పష్టమవుతోంది. కానీ భవిష్యత్తులో మరింత మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోకుండా ఉండటానికి పాజిటివ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం ద్వారా బ్యాలెన్స్ చేయడం కీలకం. నెట్‌ఫ్లిక్స్ ఈ బ్యాలెన్స్‌ను ఎంతవరకు సాధించగలదనే దానిపై పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడానికి తీసుకునే ప్రయత్నాల విజయం ఆధారపడి ఉంటుంది.

ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ !


ఓటీటీ సంస్థలు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెడుతున్నాయి. ఈ మూడు ఓటీటీ దిగ్గజాలు ఒకే విధమైన కంటెంట్‌ను అందిస్తున్నట్లు అనిపించినప్పటికీ అవి వేర్వేరు ధరలు, ప్రయోజనాలతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు ఏ ప్లాన్ ఉత్తమమో? నిర్ణయించుకోవడం కష్టతరంగా మారింది. నెట్ ఫ్లిక్స్ రూ.149 నుంచి రూ.649 వరకూ నెలవారీ వివిధ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.149 ప్లాన్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్‌ను కేవలం ఒక్క స్క్రీన్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. దీని వ్యాలిడిటీ నెలరోజులు. అయితే వార్షిక ప్లాన్ ధర మాత్రం రూ.1788గా ఉంది. అయితే రూ.199 ప్లాన్‌లో టీవీలో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంది. కానీ ఒకేసారి టీవీ, ఫోన్‌లో వీక్షించే అవకాశం ఉండదని గమనించాలి. ఈ ప్లాన్ వార్షిక వ్యాలిడిటీతో కావాలనుకుంటే మాత్రం రూ.2388 చెల్లించాల్సి ఉంటుంది. రూ.499ను స్టాండర్డ్ ప్లాన్ అని కంపెనీ ప్రకటించింది. ఒకేసారి ఫోన్, టీవీల్లో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.5988గా ఉంది. అలాగే రూ.649 ప్లాన్‌లో ఒకేసారి ఆరు డివైజ్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.7788గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. అలాగే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటే అమెజాన్‌లో ఆర్డర్లకు సంబంధించి ప్రత్యేక రాయితీలను కూడా పొందవచ్చు. వీటి ధరలు రూ.299 నుంచి రూ.1499గా ఉంది. రూ.299తో నెల రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో ప్రైమ్ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. రూ.599ను మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో పొందవచ్చు. అయితే ఈ ధరలో కేవలం మొబైల్‌లో మాత్రమే కంటెంట్ వీక్షించేలా మరో ప్లాన్ అమెజాన్ అందిస్తుంది. కాబట్టి సబ్‌స్క్రైబ్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1499ను చెల్లించాలి. అయితే అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999గా కంపెనీ నిర్ణయించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కూడా ఉంది. ఉచిత యాక్సెస్‌లో వినియోగదారులు ఎంపిక చేసిన లు, టీవీ షోలను యాడ్స్‌తో చూడాల్సి ఉంటుంది. అలాగే ఓ ఐదు నిమిషాల పాటు లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్‌ను ఆశ్వాదించవచ్చు. అయితే హాట్ స్టార్‌ను రూ.299తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ మొత్తం యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు. గరిష్టంగా నాలుగు పరికరాల్లో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. రూ.899 ప్లాన్‌తో సంవత్సరం పాటు కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇది కేవలం క్రికెట్ అభిమానులను ఉద్దేశించిన ప్లాన్. అయితే అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను సంవత్సరం పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించాలంటే రూ.1499గా చెల్లించాల్సి ఉంటుంది. 

ఛార్ ధామ్ లో జియో 5జీ సర్వీసులు ప్రారంభం !


ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ ఆలయాల్లోనూ 5 జీ సేవలను ప్రారంభించింది. బద్రీనాధ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయ ప్రాంగణాల్లో జియో ట్రూ 5 జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలో 3,089 నగరాలు, పట్టణాలకు తమ 5 జీ సేవలను విస్తరించామిన సంస్థ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తమ నెట్ వర్క్ సేవలను తీసుకురానున్నట్టు జియో తెలిపింది. జియో ట్రూ 5 జీ వెల్ కమ్ ఆఫర్లో భాగంగా యూజర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1 GBPS వేగంతో అన్ లిమిటెడ్ టేటాను పొందొచ్చని పేర్కొంది. మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్‌ జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్‌ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరింప చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 3 వేల నగరాలు, పట్టణాల్లో 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. 2023 సెప్టెంబరులోగా ప్రతి ఎయిర్‌టెల్‌ యూజర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అందులో భాగంగానే రోజుకు 30 నుంచి 40 నగరాలు/పట్టణాలకు తన 5జీ సేవలను విస్తరిస్తున్నట్టు పేర్కొంది.

షియోమీ నుంచి కొత్త ఫోన్‌ మిక్స్ 5 !


షియోమీ ఈ సంవత్సరం మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. షియోమీ  మిక్స్ 5  పేరిట ఈ ఫోన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ 2021 ఆగస్టులో వచ్చిన షియోమీ Mix 4కు తర్వాత వెర్షన్‌గా తెలుస్తోంది. ఈ ఫోన్‌ డిజైన్‌, స్పెసిఫికేషన్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. గత సంవత్సరమే షియోమీ మిక్స్‌5 ఫోన్‌పై కొన్ని కథనాలు వచ్చాయి. 2022లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. కానీ లాంచ్‌ చేయలేదు. ఇన్నాళ్లుకు మరోసారి ఈ ఫోన్‌ వార్తల్లోకి వచ్చింది. డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ టిప్‌స్టర్ Weibo.. మిక్స్‌5 స్మార్ట్‌ఫోన్‌ ఫోటోను షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ సహా పలు స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. షియోమీ మిక్స్‌5 ఫోన్‌ అన్ని వైపులా స్లిమ్‌ బెజిల్‌ మోడల్‌ను కలిగి ఉంది. మరియు 6.73 అంగుళాల అమోలెడ్‌ డ్లిస్ప్లే 120 Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుందని తెలుస్తోంది. 3200*1440 పిక్సల్స్‌ రిజల్యూషన్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌2 చిప్‌సెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరియు 12GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుందని సమాచారం. ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేసే MIUI 14తో షియోమీ మిక్స్‌5 ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. షియోమీ మిక్స్‌5 స్మార్ట్‌ఫోన్‌ 4820mAh బ్యాటరీతో రానుందని, 200W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేయనుందని సమాచారం. షియోమీ మిక్స్‌5 ఫోన్‌లో ప్రత్యేకంగా సెల్ఫీ కెమెరా డిస్ల్పే కిందనే అమర్చినట్లు తెలుస్తోంది. వెనుక కెమెరా విషయానికి వస్తే మూడు కెమెరాలతోనే లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. 50MP OIS లెన్స్‌తో ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌తో రెండో కెమెరా, 48MP టెలీఫోటో లెన్స్‌ సహా 2x ఆప్టికల్‌ జూమ్‌తో మూడో కెమెరా ఉంటాయని తెలుస్తోంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్ డీ స్మార్ట్ ఫోన్ విడుదల


దేశీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్ డీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 సిరీస్ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పూర్తి HD+ IPS డిస్‌ప్లేతో వస్తుంది మరియు AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల ఆప్షన్ లలో అందించబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధానంగా 5,000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 HD యూనిసోక్ SC9863A1 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, 2GB RAM మరియు 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఇది జతచేయబడుతుంది. ఇది వచ్చే వారం నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒకే ఒక 2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. దీని ధర రూ. 5,999 గా లాంచ్ అయింది. ఇది ఇంక్ బ్లాక్, జేడ్ వైట్ మరియు సిల్క్ బ్లాక్ కలర్ లలో వస్తుంది. మే 4 మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు మొదలుకానున్నాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 HD ఫోన్ పై సేల్ ఆఫర్‌ల విషయానికి వస్తే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసే కస్టమర్లకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. సాధారణ EMI ప్లాన్లు రూ.211 నుండి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 (Go ఎడిషన్) XOS 12పై పనిచేస్తుంది. మరియు ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6 అంగుళాల పూర్తి HD+ (720 x 1,612 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ కటౌట్‌ను కలిగి ఉంది మరియు అత్యధిక బ్రైట్నెస్ 500 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 2GB RAM తో పాటు ఆక్టా కోర్ యూనిసోక్ SC9863A1 SoC ద్వారా అందించబడింది. మీరు ఉపయోగించని స్టోరేజీ ద్వారా వాస్తవంగా 4GB వరకు RAM ని పొడిగించవచ్చు. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీ 1TB వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజీ 64GB గా ఉంటుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 HD ఫోన్ AI మద్దతు గల డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ మరియు డ్యూయల్ LED ఫ్లాష్ ఉన్నాయి. ముందు భాగంలో, LED ఫ్లాష్‌తో పాటు సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 4.2, OTG మరియు Wi-Fi ఉన్నాయి.ఇంకా, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ కంపాస్, గైరోస్కోప్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్‌తో వస్తుంది. ఇంకా, బయోమెట్రిక్ వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 39 గంటల కాలింగ్ సమయాన్ని, 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని మరియు 30 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని క్లెయిమ్ చేయబడింది. అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ బ్యాటరీ 5 శాతానికి తగ్గినప్పుడు కూడా 2 గంటల వరకు కాలింగ్ సమయాన్ని అందిస్తుంది. 

Thursday, April 27, 2023

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో మరిన్ని ఆవిష్కరణ అందుబాటులోకి వస్తాయి !


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తి సామర్థ్యాన్ని సెర్చ్‌ ఇంజిన్‌కు అనుసంధానం చేయనున్నామని ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌కు కొత్త హంగులను మరియు వినియోగదారులు మరింత సులభంగా సమాచారం పొందగలుగుతారని చెప్పారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ మరింత కచ్చితత్వంతో పనిచేసేందుకు గత చాలా సంవత్సరాల నుంచి ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే గూగుల్ లెన్స్‌ నుంచి మ్యాప్స్‌, గూగుల్ ట్రాన్సిలేట్‌ సహా ఎన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. సెర్చ్‌ ఇంజిన్‌ మరింత పటిష్టం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. గూగుల్‌ సంస్థ మార్చి త్రైమాసికానికి సంబంధించిన సమావేశంలో సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని తన వద్దనున్న డేటా, అనుభవం నేర్పిందన్నారు. గూగుల్‌ సరైన సమాచారం అందిస్తుందని కోట్లాది ప్రజలు నమ్ముతారని సీఈవో సుందర్ పిచాయ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ఈ సంవత్సరం మార్చిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సాంకేతికత AI బార్డ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. బార్డ్‌ను మరింత శక్తివంతంగా మార్చేందుకు PaLM (పాత్‌వేస్‌ లాంగ్వేజ్‌) మోడల్‌ను జతచేసినట్లు తెలిపారు. గూగుల్‌ తీసుకొచ్చిన AI బార్డ్‌ ప్రోగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ సహా కోడింగ్‌ రాయడంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు సాయం చేయగలదని సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. మరియు మరిన్ని సౌకర్యాలు భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు కోసం PaLM API మేకర్‌షూట్‌ టూల్‌ను గూగుల్‌ సంస్థ విడుదలచేసింది. ప్రపంచస్థాయి పరిశోధన వ్యవస్థ తమ వద్ద ఉందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో మరిన్ని ఆవిష్కరణ అందుబాటులోకి వస్తాయన్నారు. గూగుల్‌ రీసెర్చ్‌ టీమ్‌ మరియు డీప్‌ మైండ్‌ను ఒకే యూనిట్‌గా తీసుకొస్తున్నట్లు చెప్పారు. గూగుల్ యాడ్స్‌, యూట్యూబ్‌, గూగుల్‌ క్లౌడ్‌ సహా ఇతర సేవలు మరింత ప్రభావితంగా పనిచేసేలా ఏఐని ఓ సాధనంగా వినియోగించుకుంటామని సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను వేగంగా అందుబాటులోకి తీసుకురావడంతో కాస్త వెనుకబడినా.. AI సాంకేతికతలో వేగంగా దూసుకెళ్లేలా గూగుల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక దిగ్గజం తీసుకొచ్చిన AI బార్డ్‌ 20 ప్రోగ్రామింగ్‌ భాషల్లో కోడింగ్‌ రాయడంలో సాంకేతిక నిపుణులకు సాయం చేయనుందని తెలిపింది. ఇందులో Java, C++, Python సహా మరిన్ని భాషలు ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది మైక్రోసాఫ్ట్‌ సారధ్యంలోని స్టార్టప్‌ ఓపెన్‌ AI తీసుకొచ్చిన ChatGPT వినియోగదారులకు అత్యంత వేగంగా ఆకర్షిస్తోంది. దీంతో గూగుల్‌ AI బార్డ్‌ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ AI బార్డ్‌ కొద్ది మందికే అందుబాటులో ఉన్న నేపధ్యంలో పూర్తిస్థాయి వివరాలతో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ChatGPT 2021 వరకే ఉన్న సమాచారాన్ని విశ్లేషించి సమాధానాలిస్తుంది. అదే గూగుల్‌ బార్డ్‌ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా వినియోగదారులకు సమాధానం ఇస్తుంది.

ఐఫోన్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ 'ఫోన్ లింక్' ఫీచర్‌ !


ఐఫోన్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ 'ఫోన్ లింక్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎట్టకేలకు ఐఫోన్ యూజర్లకు కూడా ఫోన్ లింక్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఐఓఎస్ యూజర్లు కూడా విండోస్ నుంచి మెసేజ్‌లను పంపించవచ్చు. ఫోన్ కాల్స్ చేయవచ్చు. ఇన్‌కమింగ్ కాల్స్‌ రిసీవ్ చేసుకోవచ్చు. విండోస్ 11 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న ఐఫోన్ యూజర్లకు 'ఫోన్ లింక్' ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఐఓఎస్ 14 (iOS 14), ఆపై వెర్షన్ ఓఎస్ కలిగిన యూజర్లు తమ ఫోన్‌ను విండోస్‌తో లింక్ చేసుకోవచ్చని తెలిపింది. ఒకసారి విండోస్‌లో ఎనేబుల్ చేశాక.. కాల్స్ చేయడం, స్వీకరించడం; ఐమెసేజ్ యాప్‌ ఉపయోగించి మెసేజ్‌లు పంపించడం, రిసీవ్ చేసుకోవడం; ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్లను మేనేజ్ చేయడం వంటి యాక్టివిటీస్‌ చేయొచ్చు. అలాగే యూజర్లు కాంటాక్ట్స్‌ను సిస్టమ్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. బేసిక్ అప్‌డేట్‌గా మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఐపాడ్ఓస్ లేదా మ్యాక్ఓఎస్‌లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. దీన్ని ఉపయోగించి ఫొటోలు, వీడియోలను పంపలేరు. గ్రూప్ మెస్సేజింగ్ సైతం సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ మాదిరిగా ఫోన్ యాప్స్‌ను ఇందులో ఉపయోగించలేరు. ఫోన్ లింక్ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ ఇప్పటికే రోల్ అవుట్ చేసింది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజర్లకు ఇది ఇంకా తమ కంప్యూటర్లలో అందుబాటులోకి రాలేదు. మే రెండో వారం నాటికి అందరికీ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఐఫోన్లకు లాంచ్ చేసే ముందు సుధీర్ఘంగా టెస్టింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. బీటా యూజర్ల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పొందాకే మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు వెల్లడించింది. వరల్డ్‌వైడ్‌గా 39 భాషల్లో 85 మార్కెట్లలో ఈ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసింది. బ్లూటూత్‌ ద్వారా ఐఫోన్‌ను కనెక్ట్ చేసుకుంటేనే మెసేజ్‌లు వస్తాయని కంపెనీ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ !


గూగుల్ పిక్సెల్ 7a గత సంవత్సరం మే 2022లో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ కు కొనసాగింపు గా వస్తుంది. ఈ ఫోన్, రాబోయే నెల మే 10న జరగబోయే Google I/O ఈవెంట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే గూగుల్ స్మార్ట్‌ఫోన్ దాని ముందు మోడళ్ల ఫోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. విశ్వసనీయమైన టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (@heyitsyogesh) సమాచారం ప్రకారం 91మొబైల్స్ నివేదికలో తెలిపినట్లు, పిక్సెల్ 7a స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉన్న ఫోన్, ఆండ్రాయిడ్ 13 తో వస్తుందని భావిస్తున్నారు. ఈ పిక్సెల్ 7a ఫోన్, గత అక్టోబర్ 2022లో లాంచ్ చేయబడిన టెన్సర్ G2 చిప్‌సెట్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది. పిక్సెల్ 7 మరియు పిక్సెల్ 7 ప్రో ఫోన్లు కూడా ఇదే టెన్సర్ G2 చిప్‌సెట్ తో వస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR5 RAMతో జత చేయబడుతుందని మరియు 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తుందని తెలుస్తోంది. కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, పిక్సెల్ 7a యొక్క డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు అల్ట్రా వైడ్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీల కోసం 10.8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే పంచ్-హోల్ స్లాట్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ 20W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 72 గంటల వరకు బ్యాకప్ అందించడానికి తయారు చేయబడిన 4,400mAh బ్యాటరీ యూనిట్ ని ప్యాక్ చేయబడుతుందని భావిస్తున్నారు, ఈ పిక్సెల్ 7a వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని చెప్పబడింది. ఇక భద్రత కోసం, ఈ ఫోన్లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

వాట్సాప్‌ లో రిప్లై విత్ ఏ మెసేజ్ ?


వాట్సాప్‌లో కాల్స్ వస్తుంటే వాటిని సింపుల్‌గా కట్ చేసి, కట్ చేయడానికి గల కారణాన్ని మెసేజ్ రూపంలో పంపించేందుకు వీలుగా సరికొత్త స్పెసిఫికేషన్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఈ వివరాలను వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా వెల్లడించింది. బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్టు ప్రకారం, ఆండ్రాయిడ్ వెర్షన్‌లోని లేటెస్ట్ వాట్సాప్ బీటా 2.23.9.16 అప్‌డేట్‌లో "రిప్లై విత్ ఏ మెసేజ్" ఫీచర్ రిలీజ్ అవుతోంది. ఇప్పుడు కాల్ నోటిఫికేషన్లలో కొత్తగా ఒక రిప్లై బటన్ కనిపిస్తోంది. ఈ బటన్ పైన నొక్కి, యూజర్లు ఇన్‌కమింగ్ కాల్‌ను రిజెక్ట్ చేయవచ్చు. అదే సమయంలో కాలర్‌కు ఒక మెసేజ్‌ను చాలా ఫాస్ట్‌గా పంపవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా వాట్సాప్ బీటా ఇన్ఫో పంచుకుంది. దాని ప్రకారం, ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ స్క్రీన్‌లో డిక్లైన్, ఆన్సర్ బటన్స్‌తో పాటు రిప్లై బటన్ కూడా కనిపించింది. కొత్త కాల్ నోటిఫికేషన్స్‌లో కనిపించే మూడు ఆప్షన్స్‌లో యూజర్ రిప్లై బటన్‌పై నొక్కితే, ఇన్‌కమింగ్ కాల్ క్షణాల్లోనే కట్ అవుతుంది. తర్వాత మెసేజ్ బాక్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఇది కాలర్‌కు త్వరగా మెసేజ్ పంపడానికి వీలు కల్పిస్తుంది. ఈ మెసేజ్ బాక్స్‌లో వినియోగదారు కాల్‌కు సమాధానం ఇవ్వలేకపోవడానికి కారణాన్ని వివరించవచ్చు. లేదా తర్వాత కాల్ చేస్తానని చెప్పవచ్చు. యూజర్లు అన్ని సందర్భాలలో అన్ని వాట్సాప్ కాల్స్ ఆన్సర్ చేయలేరు. అలాగే కాలర్స్‌కు మెసేజ్ పంపించేంత సమయాన్ని కూడా కేటాయించలేరు. ముఖ్యంగా మీటింగ్స్‌, జర్నీలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వడం కుదరదు. దీనివల్ల అవతలి వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులన్నీ రాకుండా, పెద్దగా శ్రమ లేకుండా రిప్లై ఇస్తూ కాలర్‌తో కమ్యూనికేట్ అయ్యే అవకాశాన్ని కొత్త ఫీచర్ కల్పిస్తుంది. కాల్ నోటిఫికేషన్‌లో రిప్లై బటన్ అనేది కేవలం లేటెస్ట్ బీటా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న టెస్టర్లకు మాత్రమే రిలీజ్ అవుతోంది. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ సరికొత్త ఫీచర్‌ను టెస్ట్ చేయవచ్చు. ఇక స్టేబుల్‌ వెర్షన్‌ యూజర్లకు కూడా ఇది మరికొద్ది వారాల్లో విడుదల కావచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.

పోర్షే సంస్థకు రూ. 18 లక్షలు జరిమానా !


ఉత్తర ప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ మిట్టల్ అనే వినియోగదారుడు.. గురుగ్రామ్‌లోని పోర్షే నుండి కారును కొనుగోలు చేశాడు. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, మోసం చేశారంటూ వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు పేర్కొన్నాడు. తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్‌ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య, డాక్టర్ ఇందర్ జిత్ సింగ్‌లతో కూడిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సంస్థ సేవలో లోపాలున్నాయని, అన్యాయమైన వాణిజ్య పద్ధతిని అనుసరించిందని గుర్తించింది కోర్టు. అతనికి రూ.18 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని పోర్షే సంస్థను ఆదేశించింది.

మరో 9 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్


అమెజాన్ కంపెనీ కష్టాల్లో ఉందని, ఆర్థిక స్థిరత్వం కోసం, కంపెనీ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. రెండవ రౌండ్ తొలగింపుల్లో భాగంగా 9000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 22 నవంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ స్టోర్స్ లో 18 వేల మందిని తొలగించింది. అమెజాన్ తన 29 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే అడ్వర్టైజింగ్ యూనిట్‌లోని కొంతమందిని పీకేసింది. దీంతో పాటు వీడియో గేమ్, ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ యూనిట్లలోని ఉద్యోగులను తొలగించింది. తాజాగా సెకండ్ రౌండ్ కింద 2023, మార్చి 20వ తేదీన 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. మొత్తంగా అమెజాన్ లో 4 నెలల్లోనే 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక గందరగోళ పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల తగ్గింపు కోసం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం కంపెనీ కష్టమైన రోజులను చూస్తోందంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ CEO ఆడమ్ సెలిప్‌స్కీ, హెచ్ఆర్ హెడ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు సందేశం పంపారు.

Wednesday, April 26, 2023

6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా


చైనా పరిశోధకుల బృందం మొట్ట మొదటి రియల్ టైమ్ వైర్లెస్ ట్రాన్స్ మిషన్ తో అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్ను సాధించించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సెకండ్ ఇన్స్టిట్యూట్ నుంచి పరిశోధన బృందం టెరాహెర్ట్జ్ ఆర్బిటల్ యాంగ్యులర్ మొమెంటం కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇందుకోసం 110 GHz ఫ్రీక్వెన్సీలో నాలుగు వేర్వేరు బీమ్ నమూనాలను రూపొందించడానికి ప్రత్యేక యాంటెన్నాను ఉపయోగించినట్లు తెలిపింది. ఆ నమూనాలతో, 10 GHz బ్యాండ్విడ్త్పై సెకనుకు 100 గిగాబిట్ల వేగంతో రియల్టైమ్ వైర్లెస్ ప్రసారాన్ని సాధించారు. అంతేకాదు, బ్యాండ్విడ్త్ వినియోగ సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు వెల్లడించింది. "భవిష్యత్తులో, ఈ సాంకేతికతను స్వల్ప-శ్రేణి బ్రాడ్బ్యాండ్ ట్రాన్స్మిషన్ ఫీల్డ్లకు కూడా వర్తింపజేయవచ్చు, మూన్, మార్స్ ల్యాండర్ల మధ్య హై-స్పీడ్ కమ్యూనికేషన్కు సైతం సపోర్టు చేస్తుంది. స్పేస్క్రాఫ్ట్, అంతరిక్ష నౌకకు ఎంతగానో ఉపయోగపడుతుంది” అని తాజా నివేదిక పేర్కొంది. హై ఫ్రీక్వెన్సీ కారణంగా, టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్ మరింత సమాచారాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ భారీ మొత్తంలో ఉంటుంది. 6G కమ్యూనికేషన్, హై-స్పీడ్ ఇంటర్నెట్, సంక్లిష్టమైన వాతావరణాలలో సైనికుల కమ్యూనికేషన్లలో ఉపయోగపడనుంది. వాస్తవానికి 6G మొబైల్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ 5Gతో పోల్చితే 10 నుంచి 20 రెట్లు వేగంగా ఉంటుంది. భవిష్యత్తులో, 6Gని ఉపయోగించి పీక్ కమ్యూనికేషన్ వేగం సెకనుకు ఒక టెరాబిట్కు చేరుకుంటుంది. 6G నెట్ వర్క్ విషయంలో చైనాతో పోల్చితే అమెరికా వెనుకబడినట్లే చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పుడిప్పుడే 6G నెట్క్ వర్క్ రూపకల్పనపై ప్రయోగాలు మొదలయ్యాయి. 6G నెట్వర్క్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ మధ్యే అమెరికా అధికారులు, నిఫుణులు వైట్ హౌస్ లో చర్చించారు. “5G అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, దాని పనితీరు, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీని ఆప్టిమైజ్ చేసి 6G నెట్వర్క్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం” అని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. “6G సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సాధారణ ప్రజలకు ఉపయోగంలోకి రావడానికి చాలా టైమ్​ పడుతుంది. ఇది ప్రస్తుత 5G నెట్వర్క్ కంటే చాలా వేగంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించవచ్చు” అని వివరించారు. నిజానికి 2020 చివరలోనే అంతరిక్షంలో 6G ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పని తీరును ధ్రువీకరించాలనే ఆశతో, 6G సాంకేతికత కోసం ఉపయోగపడే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. కాగా, Huawei 6G టెక్నాలజీకి సంబంధించి సొంత రోల్ అవుట్ కోసం సిద్ధమవుతోంది. అటు 2030 నాటికి 6G అల్ట్రా-ఫాస్ట్ నెట్వర్క్ ని ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చైనీస్ అధికారులు వెల్లడించారు. భారత్ 2023 నాటికి 6G కమ్యూనికేషన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఓ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. దేశంలో 6G మిషన్లో భాగంగా, పరిశోధన కోసం ప్రాధాన్యత గల ప్రాంతాలను గుర్తిస్తుంది. త్వరలోనే 6G పరిశోధన మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ట్విటర్ అకౌంట్‎ తో కోట్లు సంపాదిస్తున్న ఎలాన్ మస్క్ !


ట్విటర్ ‎లో బ్లూ టిక్‎కు ఛార్జీలను సేకరించడం ప్రారంభించిన మస్క్ రీసెంట్‏గా యూజర్లు కంటెంట్ ‎తో డబ్బు సంపాదించుకునే వీలుగా మానిటైజేషన్ ఆప్షన్ ‎ను ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టారు. క్రియేటివ్ కంటెంట్ ‎తో తీసే చిన్న చిన్న వీడియోలతో పాటు ఎక్కువ నిడివి కలిగిన వీడియోలను పోస్ట్ చేసి సబ్‎స్క్రిప్షన్స్ ఆధారంగా డబ్బులు సంపాదించే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్ గురించి మస్క్ తెలుపుతూ తాజాగా ఓ స్క్రీన్ షాట్ ‎ను షేర్ చేశారు. తన అకౌంట్ ద్వారా యూజర్లు మానిటైజేషన్ పీచర్‏ను ఎలా వినియోగించాలో చెప్పారు. ఆ క్రమంలో ఎలాన్ తన అకౌంట్‌ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యను రివీల్‌ చేశారు. మస్క్‌ ట్విటర్‌ ఖాతాకు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అమెరికాలో ట్విటర్ సబ్‎స్క్రిప్షన్ ధర నెలకు 5 డాలర్లుగా ఉంది. ట్విటర్ రెవెన్యూ, యాపిల్ ఇన్ యాప్‌ పర్చేజ్‌ పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి 3.39 డాలర్లు చొప్పున కంటెంట్‌ క్రియేటర్‌కు ట్విటర్‌ చెల్లిస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే మస్క్‌ తన అకౌంట్ ద్వారా ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ ట్విటర్ అకౌంట్‎లో 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి నెలకు రూ.277 మస్క్‌కు వస్తుంది. అంటే నెలకు రూ.68,42,000 వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి మస్క్ తన ఖాతా ద్వారా రూ.8.2 కోట్లు సంపాదిస్తున్నాడన్నమాట.

భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలు


అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. ఈ ధరల పెంపు కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్లాన్లను పరిశీలిస్తే కంపెనీ తన వార్షిక ప్రణాళికను కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోందని గ్రహించవచ్చు. అందుకే ఈ ధరల పెంపులో కూడా నెలవారీ మరియు త్రైమాసిక సభ్యత్వాల ధరను మాత్రమే పెంచింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆడిబుల్, ప్రైమ్ మ్యూజిక్ వంటి అనేక సేవలు యాప్‌లకు ఈ సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్‌ను ఇస్తుంది. కాబట్టి ఇది ప్రజాదరణ పొందింది. దీనితో పాటు, అమెజాన్ ప్రైమ్ కస్టమర్‌లు కూడా తమ అమెజాన్ షాపింగ్ ఆర్డర్‌లను కూడా వేగంగా పొందవచ్చు.  ప్రైమ్ సభ్యులు కాని వారి కంటే ముందుగానే ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ ఆఫర్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ లేదా త్రైమాసిక టారిఫ్‌లతో రీఛార్జ్ చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు మరింత ఖరీదైనదిగా మారింది. ఇంతకు ముందు నెలవారీ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర ఒక నెలకు రూ. 179 గా ఉండేది అయితే ఇప్పుడు పెరిగిన కొత్త ధర ప్రకారం ఒక నెలకు మీరు రూ. 299 చెల్లించవలసి ఉంటుంది. అలాగే త్రైమాసిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధర మూడు నెలలకు రూ. 459 నుండి రూ. 599 కి పెరిగింది. అయితే, వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధర లో ఎలాంటి పెరుగుదల, మార్పు లేదు.అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సంవత్సర కాలానికి గతం లో చెల్లించినట్లుగానే రూ. 1499 చెలించవలసి ఉంటుంది. ప్రస్తుతం, పెరిగిన ధరల ప్రకారం, అమెజాన్ ప్రైమ్ యొక్క నెలవారీ సబ్‌స్క్రిప్షన్ గతంలో కంటే ఖరీదైనదిగా మారింది. అదేవిధంగా త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ ను ఒక సంవత్సరం పాటు ధర రూ. 999 కి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. 

ఎంజీ మోటార్స్ నుంచి కమెట్ కారు !


ఎంజీ మోటార్స్ ఇండియా సరికొత్త ఫీచర్స్‎ తో కమెట్ కారును విడుదల చేసింది. గత వారమే ఈ కారు ఫీచర్స్‎ ను ప్రకటించిన సంస్థ తాజాగా ప్రైస్, బుకింగ్స్ వివరాలను తెలిపింది. కమెట్ కారు ధర రూ.7.98 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇది బేసిక్ ధర. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండే వెహికల్స్ కోసం చేసే కస్టమర్లను లక్ష్యం చేసుకుని ఈ కారును ఎంజీ ప్రవేశపెట్టింది. కమెట్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభం అవుతాయి. కమెట్ ఇదే కంపెనీ నుంచి వచ్చిన రెండో కారు. గతంలో ZS EVని లాంచ్‌ చేసింది. కమెట్‌ ఎలక్ట్రిక్ కారు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే వాటి ధరలను కంపెనీ ఇంకా తెలపలేదు. ఈ కారులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు నాన్ స్టాప్‎గా ప్రయాణించవచ్చు. 3.3 kW ఛార్జర్‌తో 100 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే సుమారు 7 గంటల సమయం పడుతుంది. అదే బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేస్తే 5 గంటలు సమయం పడుతుందని . కమెట్ కారు ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ ఇస్తున్నారు. కమెట్‎లో రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. కానీ నాలుగు సీట్లు ఏర్పాటు చేశారు. కెమెరా, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, ఎల్‌ఈడీ రియర్‌ ఫాగ్‌ ల్యాంప్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. సిటీల్లో నివసించే కస్టమర్లే టార్గెట్ ‎గా కమెట్ కారును మార్కెట్‎లోకి తీసుకువచ్చింది ఎంజీ సంస్థ. రూ.10 లక్షల్లోపు ఎలక్ట్రిక్ కార్ కోసం చూసే వారికి కమెట్‌ ఈవీ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ కార్ అన్ని రకాల సదుపాయాలతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2 శాతం ఉంది. భవిష్యత్తులో 10 శాతానికి ఈ సంఖ్య చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

చాట్‌బాట్స్‌తో విద్యారంగంలో ఊహించని మార్పులు !


గత సంవత్సరం ఓపెన్‌ఎఐ, మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంలో చాట్‌జిపిటి లాంచ్‌ అయినప్పటి నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లు పాపులర్‌ అయ్యాయి. దీని తర్వాత కొన్ని కంపెనీలు వివిధ ఏఐ ప్రొడక్టులను అనౌన్స్‌ చేశాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్స్‌ ఇంటెలిజెన్స్‌తో సమాజానికి నష్టమని, మోసపూరితంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ, AI అంతిమంగా మానవాళికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. విద్యా రంగాన్ని చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ మెరుగుపరుస్తాయని తెలిపారు.ఈ విషయంపై బిల్‌ గేట్స్‌ బ్లాగ్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచ అసమానతలను తగ్గించడానికి, హెల్త్‌కేర్‌ మెరుగుపరచడానికి, వర్క్‌ప్లేస్‌ ప్రొడక్టివిటీ మెరుగుపరచడానికి AI సహాయపడే కొన్ని మార్గాలను పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పొటెన్షియల్ రిస్క్‌ని, పొటెన్షియల్ బెనిఫిట్స్‌తో ఫియర్స్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన హైలెట్ చేశారు. ఎడ్యుకేషన్‌ రంగంలో ఏఐ చాలా మార్పులు తీసుకొస్తుందని బిల్‌గేట్స్‌ ప్రధానంగా పేర్కొన్నారు. స్టూడెంట్స్‌కి టీచ్‌ చేయడంలో హ్యూమన్‌ ట్యూటర్స్‌ని రీప్లేస్‌ చేయగలవని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు తమ రీడింగ్, రైటింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకునేలా చేయడంలో AI చాట్‌బాట్‌ల సామర్థ్యాన్ని గేట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. AI చాట్‌బాట్స్‌తో పిల్లలు ఎలా చదవాలో నేర్చుకునే సమయాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్స్‌గా, రైటింగ్‌పై ఫీడ్‌బ్యాక్‌ విషయంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. AI చాట్‌బాట్‌లు విద్యార్థుల మ్యాథ్స్ స్కిల్స్‌ మెరుగుపరచడంలో, ఉపాధ్యాయులకు సహాయంగా, విద్యార్థులకు సరైన ఫీడ్‌బ్యాక్‌ అందించడంలో కీలకంగా పని చేస్తాయని తెలిపారు. 'AI చాట్‌బాట్‌ల అభివృద్ధి, వాటి సామర్థ్యాలను విస్తరించడం కొనసాగుతుంది. రానున్న కాలంలో చాట్‌బాట్‌లు మరింత అధునాతనంగా, సమర్ధవంతంగా తయారవుతాయి. దీంతో లెర్నింగ్‌ ప్రాసెస్‌ మరింత ప్రభావవంతంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్‌ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తీసుకొచ్చే మార్పులపై పాజిటివ్‌గా ఉన్నాం. లెర్నింగ్‌ ప్రాసెస్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.' అని బిల్‌గేట్స్ ధీమా వ్యక్తం చేశారు. AI చాట్‌బాట్‌ల పొటెన్షియల్‌ బెనిఫిట్స్‌ ఉన్నప్పటికీ, AIకి సంబంధించిన రిస్క్‌ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని గేట్స్‌ చెప్పారు. రానురాను మరింత అడ్వాన్స్‌గా AI మారుతున్నప్పుడు, ఎథికల్‌గా డెవలప్‌ చేస్తున్నారా? మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటున్నారా? లేదా అనే అంశాలు నిర్ధారించుకోవాలని అభిప్రాయపడ్డారు. AI టెక్నాలజీ అభివృద్ధిలో సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయాణానికి AI చాట్‌బాట్‌లు ప్రారంభం మాత్రమే అన్నారు. సరైన విధానంతో, ఏఐ ప్రపంచాన్ని, మనం ఎన్నడూ ఊహించని విధంగా మారుస్తుందని స్పష్టం చేశారు.

నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ !


వాట్సాప్ ఇప్పటికే మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే అకౌంట్‌ను ప్రైమరీ ఫోన్‌లో కాకుండా నాలుగు ఇతర డివైజ్‌ల్లోనూ లాగిన్ చేసి వాడటం కుదిరింది. ప్రైమరీ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఇతర డివైజెస్‌లో అకౌంట్‌ను యాక్సెస్ చేయడం సాధ్యమైంది. అయితే ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఒకటికంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లలో ఏక కాలంలో యాక్సెస్ చేయడం మాత్రం కుదరలేదు. దీనికోసం యూజర్లు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు ఎట్టకేలకు వాట్సాప్ ఇప్పుడు ఆ సదుపాయాన్ని కూడా పరిచయం చేసింది. ఆ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఒకే అకౌంట్‌ను నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఏకకాలంలో వాడవచ్చు. మల్టీ డివైజ్‌ ఫీచర్‌లో కొత్త ఇంప్రూవ్‌మెంట్ : ఇంతకుముందు వాట్సాప్‌లో మల్టీ-డివైజ్‌ లింక్ అప్ ఫీచర్‌తో, ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌తో సహా వాట్సాప్ అకౌంట్‌కు గరిష్ఠంగా నాలుగు డివైజ్‌లను లింక్ చేయడం సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఆ నాలుగు డివైజ్‌ల్లో అన్నీ స్మార్ట్‌ఫోన్‌లే అయి ఉండొచ్చు. అంటే మీ ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో 4 స్మార్ట్‌ఫోన్లలో సేమ్ అకౌంట్‌ను ఉపయోగించవచ్చు. నాలుగు అదనపు పరికరాలలో నాలుగు స్మార్ట్‌ఫోన్లు అయినా ఉండొచ్చు. లేదంటే పీసీలు, స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ఉండవచ్చు. మొబైల్స్ కాకుండా వెబ్ బ్రౌజర్లు, డెస్క్‌టాప్ యాప్‌లలో కూడా ఒకే అకౌంట్‌లో లాగిన్ అయ్యి చాట్ చేయవచ్చు. సెకండరీ ఫోన్‌లో 'లింక్ ఏ డివైజ్‌' ఫీచర్ ద్వారా వాట్సాప్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై ప్రైమరీ ఫోన్‌లో అందుకున్న OTPని ఎంటర్ చేసి రెండు ఫోన్లలో ఒకేసారి వాట్సాప్ వినియోగించవచ్చు. ప్రైమరీ ఫోన్‌లో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా కంపానియన్ డివైజ్‌ను జోడించవచ్చు. ఈ ఫీచర్‌ను పొందడానికి ఆండ్రాయిడ్ , iOS డివైజ్‌ల్లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే ప్రైమరీ, కంపానియన్ స్మార్ట్‌ఫోన్లు రెండింట్లో లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌ ఉండాలి. ఈ ఫీచర్ అందరికీ లాంచ్ అవుతోంది. ఇది మీకు ఇంకా రాకపోతే మరికొన్ని వారాలపాటు వేచి చూడాలి. వాట్సాప్ అకౌంట్‌ను కొత్త మొబైల్ ఫోన్‌కు లింక్ చేసినప్పుడు, ఆ అకౌంట్ చాట్ హిస్టరీ లింక్ అయిన అన్ని డివైజ్‌లలో సింక్ అవుతుంది. ఫోన్లను కంపానియన్ డివైజ్‌లుగా లింక్ చేయడం వల్ల ఒక డివైస్ నుంచి మరో డివైజ్‌కి మారడం ఈజీగా ఉంటుంది. అలానే యూజర్లు తమ చాట్లను ఎక్కడ వదిలేశారో మళ్లీ అక్కడ నుంచే సెకండరీ మొబైల్‌లో కూడా ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్‌తో చిన్నపాటి వ్యాపారుల పని మరింత సులభతరం అవుతుంది. ఎందుకంటే అదనపు ఉద్యోగులు ఇప్పుడు ఒకే వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ను నేరుగా వారి ఫోన్‌ల నుంచి వాడుతూ కస్టమర్లకు సమాధానాలు ఇవ్వవచ్చు. యూజర్లు QR కోడ్‌ని స్కాన్ చేయడానికి బదులుగా డివైజ్‌ లింక్‌ను ఎనేబుల్ మరో కొత్త మార్గాన్ని కూడా వాట్సాప్ పరిశీలిస్తుంది. ఫోన్‌లోని వన్-టైమ్ కోడ్‌తో వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

Tuesday, April 25, 2023

మలి దశలో డిస్నీ భారీగా ఉద్యోగుల తొలగింపు


డిస్నీ రెండో విడత తొలగింపుల్లో భాగంగా 4 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసింది. అలాగే ఈ వేసవిలోనే మూడవ రౌండ్ కూడా ప్రారంభమవుతుందని చెబుతూ ఉండడంతో ఉద్యోగులు హడళెత్తిపోతున్నారు. ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఉద్యోగులను తొలగించి.. దీని ద్వారా సుమారు 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు డిస్నీ సంస్థ భావిస్తోంది. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్‌పీఎన్‌, డిస్నీ పార్క్స్ లోని ఉద్యోగులపై రెండో విడత కోతల ప్రభావం పడనుంది. అమెరికా వ్యాప్తంగా ఉద్యోగులను డిస్నీ తొలగించనుంది. Burbank, క్యాలీఫోర్నియా, న్యూయార్క్‌, కనెక్టికట్ ప్రాంతాల్లో పనిచేసే వారిపై ఈ ప్రభావం ఉండనుంది. 'నేను ఈ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోను. ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రస్తుతం చేపడుతున్న మార్పులు అంతిమంగా కంపెనీ ఆర్థికస్థితిని ద`ష్టిలో ఉంచుకుని చేపడుతున్నవే. ఈ నిర్ణయం ఉద్యోగులపై వ్యక్తిగతంగా ప్రభావం చూపుతుంది. కానీ, తప్పట్లేదు" అని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. 

వొడాఫోన్‌ ఐడియా 180 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ !


వొడాఫోన్‌ ఐడియా రూ. 549 లతో 180 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను కస్టమర్ల కోసం ప్రారంభించింది. అంటే ఒకసారి రీఛార్జ్‌ చేస్తే దాదాపు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. డేటా అవసరం లేకుండా కేవలం పరిమిత కాల్స్‌ మాత్రమే ఉపయోగించే వారికి ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడనుంది. అయితే, ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్ లో డేటాతో పాటు కాల్స్‌ను కూడా అందిస్తున్నాయి. కానీ , వొడాఫోన్ ఐడియా మాత్రం అందుకు భిన్నంగా ఈ సరికొత్త ప్లాన్‌ను డిజైన్‌ చేసింది. రూ. 549 తో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే రూ. 549 టాక్‌టైమ్‌ లభిస్తుంది. 6 నెలల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. అది కూడా లోకల్‌/ ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి రూ. 2.5 చొప్పున ఛార్జ్‌ చేస్తారు. ఈ ఆఫర్ కింద కేవలం 1 జీబీ డేటా వస్తుంది. ఒకవేళ ఆ డేటా అయిపోతే డేటా వోచర్స్ తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అపరిమిత కాల్స్‌, మెసేజ్ ల సదుపాయం లేదు. సెకండరీ సిమ్‌గా వొడాఫోన్‌ ఐడియా వాడే వారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. సెకండ్‌ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకున్నపుడు ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తోంది. దీంతో చాలా మంది రెండో సిమ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్‌ ఐడియా ఈ లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది.

త్వరలో జియో ఎయిర్ ఫైబర్ ?


5జీ నెట్‌ వర్క్‌లో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి జియో 5జీ సేవలను అందిస్తామని ఇప్పటికే రిలయన్స్ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సంస్థ త్వరలోనే అనగా మరికొన్ని నెలల్లో జియో ఎయిర్ ఫైబర్ అనే ఉత్పత్తిని విడుదల చేయనుంది. ఎయిర్ ఫైబర్ ఇంట్లో ఉంటే చాలు. ఎలాంటి అంతరాయాలు లేకుండా వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలను ఈజీగా పొందవచ్చు. కాగా ఇది ఫిక్స్ డ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్, యాక్ట్, బీఎస్ఎన్ఎల్ కు గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు. జియో ఎయిర్ ఫైబర్ కు ఎలాంటి వైర్లూ అవసరం లేదు. చిన్నపాటి ఎయిర్ ప్యూరిఫయర్ గా కనిపించే జియో ఎయిర్ ఫైబర్ 5జీ హాట్ స్పాట్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం పోర్టబుల్ రూటర్ల సహాయంతో వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందుతున్నాము. అయితే వీటితో పోలిస్తే జియో ఎయిర్ ఫైబర్ ద్వారా నెట్ వర్క్ సామర్థ్యం మరింత బలంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా 2022 అక్టోబర్ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం లోనే జియో ఎయిర్ ఫైబర్ ను ఆవిష్కరించింది. కానీ అప్పటికి 5జీ సేవలు ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత క్రమంగా దీని తయారీ పై సంస్థ దృష్టి పెట్టింది. రూటర్లను సెటప్ చేసేందుకు టెక్నీషియన్ల అవసరం జియో ఎయిర్ ఫైబర్ తో తప్పనుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా 1.5 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను ఇస్తానని జియో చెబుతోంది.

రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ టీవీ

రెడ్‌మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ టీవీలో ఎన్నో అధునాతన ఫీచర్లను కంపెనీ అందిస్తుంది. ఫైర్ ఓస్ ఆధారితంగా పని చేసే 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.13,999కు వినియోగదారులకు అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు గణనీయంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ టీవీని లాంచ్ చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5, సోనిలైవ్, యూట్యూబ్ వంటి యాప్స్ సపోర్ట్ చేసేలా ఫైర్ ఓఎస్ 7 ఉంది. అలాగే ఈ టీవీలో దాదాపు 70 కంటే అధికంగా చానెల్స్‌ను లైవ్ ద్వారా ఎంజాయ్ చేయవచ్చు. ఈ టీవీ మూడు వైపులా సన్నని బెజెల్‌లతో కూడిన సాధారణ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. ఇది టీవీకి సొగసైన రూపాన్ని ఇస్తుంది. అలాగే టీవీ స్టాండ్ కూడా ఆకర్షణీయంగా ఉటుంది. అయితే ఈ టీవీని గోడపై మౌంట్ చేయాలనుకుంటే విడిగా వాల్ మౌంట్‌ను కొనుగోలు చేయాలి. అయితే మార్కెట్‌లో దొరికే ఇతర టీవీలతో పోలిస్తే ఈ టీవీ బరువు కాస్త ఎక్కువగా ఉంది. రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్‌లు, 3.5 ఎఎం ఆక్స్ పోర్ట్, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్‌తో సహా మనకు అవసరమైన ప్రతిదాన్ని టీవీ అందిస్తుంది. టీవీ దిగువన తెల్లటి ఎల్ఈడీ సూచిక, ఫిజికల్ పవర్ బటన్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిమోట్ కంట్రోల్‌లో ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం క్విక్ యాక్సెస్ బటన్‌లతో పాటు అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ బటన్ ఉన్నాయి. అదనంగా గైడ్, మ్యూట్, వాల్యూమ్ సర్దుబాటు, నావిగేషన్, ప్లేబ్యాక్ నియంత్రణ బటన్, పవర్ బటన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అలెక్సా బటన్‌తో మీ ఇంటిలో స్మార్ట్ పరికరాలను నియంత్రించే అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. డిస్ ప్లే విషయానికి వస్తే రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే టీవీల్లో వచ్చే రంగు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వీక్షకులు చిత్ర నాణ్యతను రాజీ పడకుండా గదిలోని దాదాపు ఏ స్థానం నుంచి అయినా వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చిన్న కుటుంబ గదులు లేదా బెడ్‌రూమ్‌లకు ఈ టీవీ మంచి ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20 వాట్స్ స్టీరియో స్పీకర్‌తో వినియోగదారులకు మంచి ఆడియో అనుభూతిని ఇస్తుంది. 

బెంగళూరులో 'జీరో షాడో డే'


'జీరో షాడో డే' అని పిలిచే ఓ ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయాన్ని బెంగళూరు ప్రజలు చూశారు. మంగళవారం బెంగళూరులో స్వల్పకాలానికి నిలువు వస్తువులు నీడ లేకుండా మారాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12.17 గంటలకు జరిగినట్లు సమాచారం. ఈ దృగ్విషయం చాలా అరుదు, సంవత్సరాల తర్వాత ఎంచుకున్న ప్రదేశాలలో జరుగుతుంది. బెంగళూరులోని కోరమంగళలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ) మంగళవారం తన క్యాంపస్‌లో దీనికి సంబంధించిన ఈవెంట్‌లను నిర్వహించింది. 'జీరో షాడో డే #ZSDని మన కోరమంగళ క్యాంపస్‌లో 25 ఏప్రిల్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరుపుకోండి. సూర్యుడు నేరుగా మధ్యాహ్నం 12.17 గంటలకు నిటారుగా నెత్తిపైకి వస్తాడు' అని ఐఐఎ మంగళవారం ట్వీట్ చేసింది. ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడడంతో పాటు, చాలామంది ట్విట్టర్ ద్వారా వస్తువుల నీడ మాయమవుతున్న దృశ్యాల వీడియోలను పంచుకున్నారు. 'నగరంలోని అన్ని నిలువు వస్తువులు మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ లేకుండా ఉన్నాయి ! సూర్యుడు నడినెత్తిమీదకు రావడం అన్నది సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. #zeroshadowday#Bengaluru'అని ఒకరు ట్వీట్ చేశారు. 'జీరో షాడో డే అనేది +23.5 నుంచి –23.5 డిగ్రీల అక్షాంశల మధ్య ఉన్న ప్రదేశాలలో సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఖగోళ సంఘటన. ఈ సందర్భంగా సూర్యుని క్రింద ఉన్న ఏదైనా వస్తువు దాని నీడను కోల్పోతుంది. సూర్యుని ఉత్తరాయనం, దక్షిణాయనం సమయాల్లో ఇది సంభవిస్తుంటుంది. ఈ రెండు రోజుల్లో సూర్యుడు నడి నెత్తి మీదకు వస్తాడు. వస్తువుల నీడలు లుప్తమవుతాయి' అని ఎఎస్‌ఐ తన వెబ్‌సైట్‌లో రాసింది. అయితే ఈ దృశ్య ఘట్టం కేవలం ఓ సెకండ్ మాత్రమే ఉంటుంది. కానీ దాని ప్రభావాన్ని రెండు నిమిషాల వరకు చూడొచ్చు.

ఏప్రిల్ 26న వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో లాంచ్ !


ఏప్రిల్ 26న ఇండియాలో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో లాంచ్ కానున్నాయి. చైనాలో గతంలో ఈ సిరీస్ లో మొత్తం మూడు మొబైల్స్ విడుదలయ్యాయి. అయితే ఎక్స్90 అల్ట్రా మోడల్ ఇండియాకు రాకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియమ్ లెన్స్ కెమెరాలతోపాటు ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైళ్లు కలిగి ఉంటాయి.  8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో ఎక్స్90 బేస్ వేరియంట్ ధర రూ.59,999, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.63,999గా నిర్ణయించారు. వో ఎక్స్90 ప్రో 12జీబీ + 256 జీబీ స్టోరేజ్‍తో ఒకే వేరియంట్‍గా రాబోతోంది. ఇది రూ.84,999గా ఉండబోతోంది. గత సంవత్సరం విడుదలైన ఎక్స్ 80 సిరీస్ కంటే ఎక్స్ 90 ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వివో మాత్రం అధికారికంగా 26వ తేదీన ప్రకటించబోతోంది. మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్రాసెసర్‌తో కూడా ఇవి వస్తున్నాయి. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్ ఎడ్జెస్ డిస్‍ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి. వివో ఎక్స్90 ప్రోకు వైర్లెస్ చార్జింగ్‍ సపోర్టు కూడా ఉంటుంది. కెమెరాలు హైలైట్ గా నిలవబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX989 ప్రైమరీ కెమెరాను ఎక్స్90 ప్రో కలిగివుంటుంది. 50 మెగాపిక్సెల్ పోట్రయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు వెనుక ఉంటాయి వివో ఎక్స్90 ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్లు విడుదల కాబోతున్నాయి.

Monday, April 24, 2023

ఫ్లిప్ కార్ట్ లో మార్క్యూ ఏసీపై భారీ డిస్కౌంట్ !


ఫ్లిప్ కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.  ఈ సేల్ లో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు తదితర సమ్మర్ స్పెషల్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. MarQ by Flipkart 2023 Range 0.8 Ton 3 Star Split Inverter 4-in-1 Convertible with Turbo Cool Technology ఏసీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ.45,499 కాగా, 43 శాతం డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా రూ.20,009 తగ్గింపుతో కేవలం రూ.25,490కే ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు.  HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఏసీని కొనుగోలు చేస్తే రూ.1,750 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా ఈ ఏసీపై భారీ ఎక్సేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత ఏసీని ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.8 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా ఈ ఏసీ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది 0.8 టన్ ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  3 స్టార్ బీఈఈ రేటింగ్ 2023ను కలిగి ఉంటుంది. ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్ తదితర ప్రత్యేకతలు ఈ ఏసీలో ఉన్నాయి. ఇంకా కేవలం రూ.897 ప్రారంభ ఈఎంఐ ఆప్షన్లతో ఈ ఏసీని కొనే అవకాశాన్ని కల్పించింది.

రూ.107 కే 35 రోజుల వ్యాలిడిటీ !


బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక వ్యాలిడిటీతో అనేక ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ల ద్వారా అనేక బెస్ట్ బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 107 ప్లాన్‌లో, కస్టమర్‌లకు లోకల్ మరియు నేషనల్ కాలింగ్ కోసం 200 నిమిషాలు ఇవ్వబడుతుంది. దీనితో పాటు, 3GB హై స్పీడ్ డేటా కూడా ఇందులో ఇవ్వబడింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 35 రోజుల వాలిడిటీ కూడా అందుబాటులో ఉంది. ఒక నెల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు లభిస్తుంది. దీనితో పాటు, పరిమిత వాయిస్ ప్రయోజనాలతో హై స్పీడ్ డేటా కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, కస్టమర్లకు ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ప్రయోజనం కూడా పొందుతారు.  సెకండరీ సిమ్‌ని ఆన్‌లో ఉంచుకోవడానికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే, ఇందులో ప్రాథమిక ప్రయోజనాలు ఉంటాయి. దీనితో పాటు, వ్యాలిడిటీ కూడా ఎక్కువగా ఉంది. 

అంతరిక్షం నుంచి అద్భుతంగా కనిపిస్తున్న భూమి !


అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా స్పేస్ ఏజెన్సీ 'నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్' ఎల్లప్పుడూ ముందుంటుంది. ఖగోళ విశేషాలు, వాటి చిత్రాలకు సంబంధించి అప్‌డేట్‌లను ఇస్తుంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో చురుగ్గా ఉంటూ అరుదైన చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా మరో వీడియోను నెటిజన్లతో పంచుకుని సర్‌ప్రైజ్ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ నుంచి తీసిన భూమి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 2022 మార్చి, 2023 మార్చి మధ్య ఎక్స్‌పెడిషన్స్ 67, 68 సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ఈ దృశ్యాలను రికార్డ్ చేసింది. 409 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ISS, భూబ్రమణాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. భూమిపై నుంచి ప్రపంచాన్ని దాటుతున్న అనుభూతిని మీరు కూడా పొందండి అంటూ నాసా ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'సాధారణంగా భూమిని ఇలా చూసే అవకాశం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. పూర్తి విభిన్న కోణంలో ఈ నీలి గ్రహం మినుకు మినుకు మంటోంది. 250 మైళ్ల ఎత్తు నుంచి చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఇక ఇప్పుడు మీ వంతు. కాసేపు మిమ్మల్ని మీరు స్పేస్ స్టేషన్ సిబ్బందిగా ఊహించుకోండి. ఓ గంట పాటు ఖాళీ దొరికిందని అనుకోండి. ఈ విశ్రాంత సమయంలో మన సొంత గ్రహాన్ని చూడటానికి మించి పెద్ద పనేముంటుంది. ప్రపంచం ఇలా కదిలిపోతుంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి' అంటూ పోస్టులో తెలిపింది. నాసా షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. 'ఆహా.. ఇంత అతి సుందరమైన వీడియోను చూడటానికి రెండు కళ్లు చాలవు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్పేస్ లవర్స్ ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు. 'మెస్మరైజింగ్.. ఫొటోలు, వీడియోల్లో కాకుండా ఏదో ఒక రోజు నేను కూడా భూమిని ఇలా చూడాలని అనుకుంటున్నా' అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఉరుములు, మెరుపులను ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు' అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. 

నోకియా 40 అంగుళాల స్మార్ట్ టీవీ పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ !


నోకియా 40 అంగుళాల స్మార్ట్ టీవీ పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందించబడుతుంది. అసలు ధర రూ.29,000. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీపై 34 శాతం తగ్గింపు ఇవ్వబడింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే, అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ 40 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీ మోడల్‌లో 1920 x 1080 పిక్సెల్‌లు, ఫుల్ హెచ్‌డి సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ అత్యుత్తమ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో మాలి G31 గ్రాఫిక్స్ ప్రాసెసర్ కూడా ఉంది. ప్రత్యేకంగా, ఈ నోకియా స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీని ఉపయోగించడానికి చాల అనువుగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ సపోర్ట్‌తో 40 అంగుళాల నోకియా ఫుల్ హెచ్‌డి స్మార్ట్ టీవీ మోడల్ లాంచ్ చేయబడింది. ఈ అద్భుతమైన నోకియా స్మార్ట్ టీవీ మోడల్ 1GB RAM మరియు 8GB స్టోరేజీ తో వస్తుంది. సంక్షిప్తంగా, ఈ అద్భుతమైన నోకియా స్మార్ట్ టీవీ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో వస్తుంది. అదేవిధంగా డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24 వాట్ స్పీకర్‌లు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి ఆడియో అనుభూతిని అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్ సహా అనేక యాప్‌లను ఈ స్మార్ట్ టీవీలో ఉపయోగించవచ్చు.  HDMI పోర్ట్, USB పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi సహా అనేక కనెక్టివిటీ మద్దతులను కలిగి ఉంది. ముఖ్యంగా షియోమీ మరియు వన్‌ప్లస్ స్మార్ట్ టీవీల మాదిరిగానే ఈ నోకియా 40 అంగుళాల స్మార్ట్ టీవీ ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది.

గూగుల్ ఏ ఐ 20 ప్రోగ్రామింగ్ భాషలలో కోడింగ్ చేస్తుంది !


జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ bard AI కోడింగ్ రాయడంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు సాయం చేయగలదని ఆల్ఫాబెట్ నేతృత్వంలోని గూగుల్ తెలిపింది. జనరేటివ్ AI, టెక్నాలజీ సాయంతో గత డేటాను గుర్తించడానికి బదులుగా కొత్త డేటాను క్రియేట్ చేసేందుకు బార్డ్ AI సాయం చేయనుందని గూగుల్ వెల్లడించింది. దీంతోపాటు మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. Google bard AI, 20 ప్రోగ్రామింగ్ భాషల్లో కోడింగ్ రాయగలదని గూగుల్ తెలిపింది. ఇందులో Java, C++, Python సహా మరిన్ని సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నట్లు వెల్లడించింది. AIతో పనిచేసే గూగుల్ బార్డ్ కోడింగ్‌ రాయడం సహా వాటి గురించి స్పష్టంగా వివరించగలదని స్పష్టంచేసింది. దీనితో పాటు కోడ్ ను ఆప్టిమైజ్ చేయగలదని, మరియు మరింత కచ్చితత్వంతో పనిచేయగలదని గూగుల్ వివరించింది. ప్రస్తుతం గూగుల్‌ బార్డ్‌ AI  ను గూగుల్ సెర్చ్ టూల్‌కు బదులుగా బోట్‌తో చాట్‌ చేయగలిగిన వారు మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గూగుల్ బార్డ్ మూడు వెర్షన్లు లేదా డ్రాఫ్ట్‌ లను మాత్రమే చూపిస్తోంది. ఇందులో యాజర్లు దేనికోసమైన సెర్చ్ చేస్తుంటే "గూగుల్ ఇట్" అనే బటన్ మాత్రమే చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్ సాయంతో ఓపెన్ ఏఐ స్టార్టప్‌ రూపొందించిన ChatGPT 2021 సంవత్సరం వరకు ఉన్న డేటాను మాత్రమే విశ్లేషించి వినియోగదారులకు సమాధానాలు ఇస్తోంది. అదే గూగుల్ అభివృద్ధి చేసిన బార్డ్ మాత్రం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని వినియోగించుకొని యూజర్లకు సమాధానం ఇస్తుంది. ఇది గూగుల్‌ బార్డ్‌కు కొంత మేలు చేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ సంస్థ ఆశించినంతగా, ఈ బార్డ్‌ AI వినియోగదారులకు చేరువ కాలేదు. కారణం, గూగుల్ బార్డ్ AI లాంచింగ్‌ సమయంలో జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ గురించి బార్డ్‌ తప్పుగా సమాధానం ఇచ్చింది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు భారీగా పతనం అయిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలోనూ భారీగా ట్రోల్ లను కూడా ఎదుర్కొంది. మైక్రోసాఫ్ట్‌ సాయంతో వచ్చిన ChatGPT కంటే Google Bard AIను ముందుగా లాంచ్ కావాలనే లక్ష్యంతోనే ఈ పనిచేశారని, ఫలితంగానే తప్పలు వస్తున్నాయంటూ విమర్శలు చేశారు. స్వల్పకాలిక లక్ష్యాలను వదిలి దీర్ఘకాలిక లక్ష్యాలతో కోసం పనిచేయాలని పలువురు గూగుల్‌ను అప్పట్లోనే సూచించారు. లాంచ్‌ అయినప్పటి నుంచి ChatGPT అధిక సంఖ్యలో వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుకుంటుండగా.. టెక్‌ దిగ్గజం గూగుల్‌ తీసుకొచ్చిన Bard మాత్రంగా అంతగా ప్రభావం చూపడం లేదు.

ఇంట్లోనే సోడా తయారుచేసుకోవచ్చు !


మిస్టర్ బట్లర్ కంపెనీ ఇటాలియా సోడా మేకర్ పేరుతో విడుదల చేసింది. ఇది సింగిల్ డబుల్, సిలిండర్‌తో లభిస్తోంది. దీని ద్వారా ఇంట్లోనే గ్యాస్‌తో కూడిన సోడాను తయారుచేసుకోవచ్చు. బయట లీటర్ సోడా బాటిల్ కొంటే కొంత తాగిన తర్వాత మిగతా సోడాలో గ్యాస్ ఆటోమేటిక్‌గా పోతుంది. దాంతో మనీ వేస్ట్ అవుతుంది. అదీ కాక ఆ ప్లాస్టిక్ బాటిల్  యూజ్ అండ్ త్రో కాబట్టి కాలుష్యం పెరుగుతుంది. ఈ సోడా మేకర్ ద్వారా  ఎంత సోడా కావాలో అంతే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ ప్రొడక్టుతో.. సోడా మేకర్, CO2 సిలిండర్, పెట్ బాటిల్, గ్లాస్ ఇస్తున్నారు. మొత్తం బరువు 3.08 కేజీలు ఉంది. సోడా మేకర్‌లో సిలిండర్ ఎలా సెట్ చెయ్యాలో వీడియోలో చూపించారు. దీని వాడకానికి కరెంటు, బ్యాటరీతో పనిలేదు. సోడాలో ఎంత గ్యాస్ కావాలో అంత గ్యాస్ నింపుకోవచ్చు. ఒక సిలిండర్ ద్వారా 25 లీటర్ల సోడా తయారవుతుందని తెలిపారు. సిలిండర్ అయిపోతే.. కొత్త సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో కొనుక్కునే వీలు ఉంది. లేదా.. దగ్గర్లోని స్టాక్‌లిస్ట్ దగ్గర... సిలిండర్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏపీలో చిత్తూరు , తూర్పు గోదావరి , కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు , విజయవాడలో రీఫిల్లింగ్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌లో రీఫిల్ సెంటర్ ఉందని తెలిపారు.

Sunday, April 23, 2023

కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ ఆఫర్ !


కాంపాక్యూ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ  సైజ్ 24 ఇంచులు. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 10,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 4,999కే కొనుగోలు చేయొచ్చు. 54 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది సాధారణ ఎల్ఈడీ టీవీ. స్మార్ట్ టీవీ కాదు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే ఇంట్లో వైఫై ఉంటేనే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే సాధారణ ఎల్ఈడీ టీవీ ఉత్తమం. అందుబాటు ధరలోనే టీవీ చూడొచ్చు. ఈ టీవీలో 16 వాట్ సౌండ్ ఔట్‌పుట్ ఉంటుంది. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. టీవీ కొన్న వారికి పది రోజుల రిప్లేస్‌మెంట్ పాలసీ వర్తిస్తుంది. టీవీ బాగులేకపోతే మళ్లీ వెనక్కి ఇవ్వొచ్చు. కొత్త టీవీ రిప్లేస్‌మెంట్ పొందొచ్చు. ఈ టీవీలో 2 హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. అలాగే 2 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. హెచ్‌డీ రెడీ టీవీ. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఫీచర్ ఉంది. ఈ టీవీపై ఏడాది వరకు వారంటీ లభిస్తుంది. అందువల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే ఈ టీవీపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 241 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 310 కట్టాలి. అదే ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 449 చెల్లించాలి. 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 589 చెల్లించాలి. ఆరు నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 868 పడుతుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీరు పాత టీవీ ఇచ్చి ఈ టీవీని కొంటే మీకు రూ. 4464 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు దాదాపు రూ. 500 పెట్టుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్‌లో టీవీ పొందొచ్చు.

Popular Posts