ఏప్రిల్ 26న వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో లాంచ్ !


ఏప్రిల్ 26న ఇండియాలో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో లాంచ్ కానున్నాయి. చైనాలో గతంలో ఈ సిరీస్ లో మొత్తం మూడు మొబైల్స్ విడుదలయ్యాయి. అయితే ఎక్స్90 అల్ట్రా మోడల్ ఇండియాకు రాకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియమ్ లెన్స్ కెమెరాలతోపాటు ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లను ఈ మొబైళ్లు కలిగి ఉంటాయి.  8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉండే వివో ఎక్స్90 బేస్ వేరియంట్ ధర రూ.59,999, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉండే టాప్ వేరియంట్ ధర రూ.63,999గా నిర్ణయించారు. వో ఎక్స్90 ప్రో 12జీబీ + 256 జీబీ స్టోరేజ్‍తో ఒకే వేరియంట్‍గా రాబోతోంది. ఇది రూ.84,999గా ఉండబోతోంది. గత సంవత్సరం విడుదలైన ఎక్స్ 80 సిరీస్ కంటే ఎక్స్ 90 ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వివో మాత్రం అధికారికంగా 26వ తేదీన ప్రకటించబోతోంది. మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్రాసెసర్‌తో కూడా ఇవి వస్తున్నాయి. 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్ ఎడ్జెస్ డిస్‍ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి. వివో ఎక్స్90 ప్రోకు వైర్లెస్ చార్జింగ్‍ సపోర్టు కూడా ఉంటుంది. కెమెరాలు హైలైట్ గా నిలవబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ Sony IMX989 ప్రైమరీ కెమెరాను ఎక్స్90 ప్రో కలిగివుంటుంది. 50 మెగాపిక్సెల్ పోట్రయిట్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు వెనుక ఉంటాయి వివో ఎక్స్90 ఫోన్ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్లు విడుదల కాబోతున్నాయి.

Post a Comment

0 Comments