Ad Code

మోటో ఎడ్జ్ 30 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ !


మోటోరోలా ప్రీమియం సెగ్మెంట్‌లో మోటో ఎడ్జ్ 30 ప్రో  స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో రిలీజైన మోటో ఎడ్జ్ 30 ప్రో ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. కేవలం రూ.30 వేలకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇది 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. రిలీజ్ ధర రూ.49,999. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.29,999 ధరకే లిస్ట్ అయింది.  రూ.20,000 డిస్కౌంట్ లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్ లభించడం చాలా అరుదు. కాస్మో బ్లూ, స్టార్‌డస్ట్ వైట్ కలర్స్‌లో లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోనే కాకుండా మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రూ.29,999 ధరకే మోటో ఎడ్జ్ 30 ప్రో లభిస్తోంది. మోటో ఎడ్జ్ 30 ప్రో ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తున్న స్మార్ట్‌ఫోన్. ఇందులో క్వాల్కమ్‌కు చెందిన పవర్‌ఫుల్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఉంది. ఐకూ 9 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం.144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, వెనుకవైపు త్రీడీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్స్‌తో పాటు మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్, Wi-Fi 6e, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.2 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా విశేషాలు చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 50 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. మోటో ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,800ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 15వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5వాట్ వైర్‌లెస్ పవర్ షేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. థింక్‌షీల్డ్ మొబైల్ సెక్యూరిటీ కూడా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu