అడవిలోనూ 'డిఫై శాటిలైట్‌ లింక్‌’ సిగ్నల్స్‌


పనిమీద ఊరెళ్లినప్పుడు, సాహసయాత్రల్లో భాగంగా కొండలూ కోనలూ తిరుగుతున్నప్పుడు మొబైల్‌ సిగ్నల్స్‌ దొరకడం గగనం. బయటి ప్రపంచంతో ఏదైనా అవసరం వచ్చినా, అత్యవసర సమయంలో మనం ఎక్కడున్నామో చెప్పాలనుకున్నా, ఓ పట్టాన సాధ్యం కాదు. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ మోటరోలా సంస్థ 'డిఫై శాటిలైట్‌ లింక్‌’ అనే పరికరాన్ని తీసుకువచ్చింది. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కు కనెక్ట్‌ అవుతుందీ ఎక్విప్‌మెంట్‌. మనం భూమ్మీద ఏ ప్రాంతంలో ఉన్నా హాట్‌స్పాట్‌ ద్వారా శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అందిస్తుంది. ప్రత్యేక యాప్‌లో సందేశాలూ పంపుకోవచ్చు. ప్రత్యేకించి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. motorolarugged.com వెబ్‌సైట్‌ ద్వారా ప్రీఆర్డర్‌ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈ వాటర్‌ ప్రూఫ్‌ పరికరాన్ని కీచెయిన్‌గానూ వాడుకోవచ్చు. ధర సుమారు రూ.12,300.

Post a Comment

0 Comments