Ad Code

సోలార్ ఛార్జ్ సైకిల్ !


రాజస్తాన్ లోని ఉదయపూర్‌లో మహారాణా ప్రతాప్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎలక్ట్రికల్ విభాగం ఈ-సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇ-సైకిల్ ఇద్దరు వ్యక్తుల బరువును అంటే 160 కిలోల బరువును తట్టుకోగలదు. ఈ-సైకిల్ కూడా సోలార్ ద్వారా ఛార్జ్ చేయబడి నడుస్తుంది. దేశంలో ఇ-వాహనాల విప్లవం వచ్చిందని ఎలక్ట్రికల్ విభాగం అధిపతి విక్రమాదిత్య దవే ​​అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించిన తర్వాత ప్రజలు కూడా ఈ-వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ-సైకిల్ ఆవిష్కరించబడింది. ఉదయం మీరు సైక్లింగ్ కోసం ఉపయోగించవచ్చు. అంతే కాకుండా.. మార్కెట్, ఆఫీసుకి వెళ్లడానికి ఈ బైక్ ఉపయోగించవచ్చు. ఈ-సైకిల్‌లో బ్యాటరీ, ఎల్‌ఈడీ సిస్టమ్‌, సోలార్‌ ప్యానెల్‌, మోటార్‌, లైట్‌, హారన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 3 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది అంటే రూ.30 చార్జీ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. మీరు ఈ-సైకిల్ ద్వారా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే.. ఇది సోలార్ నుండి ఛార్జింగ్ చేస్తే 5 కిలోమీటర్లు అదనంగా నడుస్తుంది. అవసరాన్ని బట్టి బ్యాటరీని పెంచుకోవచ్చు. ఈ-సైకిల్ చదునైన రహదారిపై 160 కిలోల బరువును మోయగలదు. వాలుపై 80 కిలోల బరువును మోయగలదు. ఈ-సైకిల్ ధర సామాన్యులకు సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. కొత్త సైకిల్‌ తయారు చేయడానికి 30-35 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. పాత సైకిల్‌ను ఈ సైకిల్ గా మార్చాలంటే.. దీనికి రూ. 18వేలు ఖర్చు అవుతుంది. దీని ద్వారా కూడా ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 40 కిలో మీటర్ల వరకు వెళ్లవచ్చు. సోలార్ ద్వారా కూడా దీనికి ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu