Header Ads Widget

కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు గూగుల్ ఆహ్వానం !


కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు గూగుల్ వెల్లడించింది. ముంబై కేంద్రంగా మెట్రో నెట్‌వర్క్ డెప్లాయ్‌మెంట్ ఇంజినీర్ పోస్టులకు కంపెనీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభ ఆధారంగా వేతనం అందుతుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొంది ఉండాలి. లేదా ఇందుకు సమానమైన ప్రాక్టికల్ అనుభవం ఉండాలి. నెట్‌వర్కింగ్ టెక్నాలజీస్‌పై కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలి. అదే విధంగా స్టేట్, లోకల్ రెగ్యులేటరీపై అవగాహన తప్పనిసరి. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌ గురించి తెలియాలి. నిర్మాణం, ప్రొసీజర్స్, అనుమతికి కావాల్సిన ప్రమాణాలపై కనీస అవగాహన అవసరం. వీటితో పాటు లోకల్ ఎక్స్ఛేంజ్ క్యారియర్తో కలిసి పనిచేసిన అనుభవం ఉండాలి. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు, భూ యజమానులు, ఎలక్ట్రిషియన్లు, కన్‌స్ట్రక్షన్ ఆపరేటర్లతో కలిసి పనిచేసిన వారు ఈ పోస్టుకు అర్హులు. అభ్యర్థులకు కనీస అర్హతలతో పాటు కోడింగ్ లేదా స్క్రిప్టింగ్‌లో కనీస అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌లో స్పష్టంగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. దీంతో పాటు స్థానిక మెట్రో నగరాల్లోని భాషపై కూడా పట్టు ఉండాలి. అవసరమైతే డ్యూటీలో 50శాతం సమయాన్ని ప్రయాణాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధంగా ఉన్నవారికి ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తారు. మెట్రో నెట్‌వర్క్ డెప్లాయ్‌మెంట్ ఇంజినీర్‌గా ఇన్‌స్టాల్లేషన్ టెక్నిషియన్ల పనితీరును పర్యవేక్షించాల్సి ఉంటుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్ వ్యాప్తంగా ప్రస్తుత, కొత్త నెట్‌వర్క్ నోడ్స్‌లలో నెట్‌వర్క్ డివైజ్‌లను పరీక్షించాలి. ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ సామగ్రి, రూటర్లను టెస్ట్ చేయాలి. డెప్లాయ్‌మెంట్ సమయంలో తగిన గైడెన్స్, టెక్నికల్ లీడర్‌షిప్‌ని అందించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణమైన ప్రణాళికలను అమలు చేయాలి. ముఖ్యంగా కంపెనీలోని సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్ ఇంజినీరింగ్, మిగిలిన టీమ్స్‌తో కలిసి వర్క్ చేయాలి. వీరితో కలిసి వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. ర్యాక్ లే అవుట్, కేబుల్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, యాక్సెస్, కూలింగ్, పవర్ ఫెసిలిటీ ఏరియాల ఎంపిక సహా నెట్‌వర్క్ ఇన్‌స్టాల్లేషన్‌లో ఎదురయ్యే సమస్యలను గుర్తించాలి. నెట్‌వర్క్‌పై సొంతంగా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. నెట్‌వర్క్ డ్రాయింగ్స్, ప్రణాళికలను నిర్వహించుకోవాలి. నెట్‌వర్క్ డెప్లాయ్‌మెంట్ ఇంజినీర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ డేటా నెట్‌వర్క్‌లను మెయింటేన్ చేయాలి. కంపెనీలోని నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్స్, నెట్‌వర్క్ ఇంజినీర్స్, డిజైన్ ఇంజినీర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్స్, ఫీల్డ్ ఇంజినీర్స్, స్ట్రాటజిక్ నెగోషియేటర్స్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్స్‌, నిర్మాణ, టెలికమ్యూనికేషన్స్ శ్రామిక సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు సపోర్ట్ చేయడానికి రిలయబుల్, కాస్ట్ ఎఫెక్టివ్, స్కేలెబుల్ ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేయడమే మీ బృందం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్, డేటా సెంటర్స్, కొ-లొకేషన్‌లో ఉన్న అనుభవాన్ని ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు.

Post a Comment

0 Comments