నాలుగు ఫోన్లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ !


వాట్సాప్ ఇప్పటికే మల్టీ డివైజ్‌ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే అకౌంట్‌ను ప్రైమరీ ఫోన్‌లో కాకుండా నాలుగు ఇతర డివైజ్‌ల్లోనూ లాగిన్ చేసి వాడటం కుదిరింది. ప్రైమరీ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఇతర డివైజెస్‌లో అకౌంట్‌ను యాక్సెస్ చేయడం సాధ్యమైంది. అయితే ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఒకటికంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లలో ఏక కాలంలో యాక్సెస్ చేయడం మాత్రం కుదరలేదు. దీనికోసం యూజర్లు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు ఎట్టకేలకు వాట్సాప్ ఇప్పుడు ఆ సదుపాయాన్ని కూడా పరిచయం చేసింది. ఆ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ఒకే అకౌంట్‌ను నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఏకకాలంలో వాడవచ్చు. మల్టీ డివైజ్‌ ఫీచర్‌లో కొత్త ఇంప్రూవ్‌మెంట్ : ఇంతకుముందు వాట్సాప్‌లో మల్టీ-డివైజ్‌ లింక్ అప్ ఫీచర్‌తో, ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌తో సహా వాట్సాప్ అకౌంట్‌కు గరిష్ఠంగా నాలుగు డివైజ్‌లను లింక్ చేయడం సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఆ నాలుగు డివైజ్‌ల్లో అన్నీ స్మార్ట్‌ఫోన్‌లే అయి ఉండొచ్చు. అంటే మీ ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో 4 స్మార్ట్‌ఫోన్లలో సేమ్ అకౌంట్‌ను ఉపయోగించవచ్చు. నాలుగు అదనపు పరికరాలలో నాలుగు స్మార్ట్‌ఫోన్లు అయినా ఉండొచ్చు. లేదంటే పీసీలు, స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ఉండవచ్చు. మొబైల్స్ కాకుండా వెబ్ బ్రౌజర్లు, డెస్క్‌టాప్ యాప్‌లలో కూడా ఒకే అకౌంట్‌లో లాగిన్ అయ్యి చాట్ చేయవచ్చు. సెకండరీ ఫోన్‌లో 'లింక్ ఏ డివైజ్‌' ఫీచర్ ద్వారా వాట్సాప్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై ప్రైమరీ ఫోన్‌లో అందుకున్న OTPని ఎంటర్ చేసి రెండు ఫోన్లలో ఒకేసారి వాట్సాప్ వినియోగించవచ్చు. ప్రైమరీ ఫోన్‌లో కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా కంపానియన్ డివైజ్‌ను జోడించవచ్చు. ఈ ఫీచర్‌ను పొందడానికి ఆండ్రాయిడ్ , iOS డివైజ్‌ల్లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే ప్రైమరీ, కంపానియన్ స్మార్ట్‌ఫోన్లు రెండింట్లో లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌ ఉండాలి. ఈ ఫీచర్ అందరికీ లాంచ్ అవుతోంది. ఇది మీకు ఇంకా రాకపోతే మరికొన్ని వారాలపాటు వేచి చూడాలి. వాట్సాప్ అకౌంట్‌ను కొత్త మొబైల్ ఫోన్‌కు లింక్ చేసినప్పుడు, ఆ అకౌంట్ చాట్ హిస్టరీ లింక్ అయిన అన్ని డివైజ్‌లలో సింక్ అవుతుంది. ఫోన్లను కంపానియన్ డివైజ్‌లుగా లింక్ చేయడం వల్ల ఒక డివైస్ నుంచి మరో డివైజ్‌కి మారడం ఈజీగా ఉంటుంది. అలానే యూజర్లు తమ చాట్లను ఎక్కడ వదిలేశారో మళ్లీ అక్కడ నుంచే సెకండరీ మొబైల్‌లో కూడా ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్‌తో చిన్నపాటి వ్యాపారుల పని మరింత సులభతరం అవుతుంది. ఎందుకంటే అదనపు ఉద్యోగులు ఇప్పుడు ఒకే వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ను నేరుగా వారి ఫోన్‌ల నుంచి వాడుతూ కస్టమర్లకు సమాధానాలు ఇవ్వవచ్చు. యూజర్లు QR కోడ్‌ని స్కాన్ చేయడానికి బదులుగా డివైజ్‌ లింక్‌ను ఎనేబుల్ మరో కొత్త మార్గాన్ని కూడా వాట్సాప్ పరిశీలిస్తుంది. ఫోన్‌లోని వన్-టైమ్ కోడ్‌తో వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

Post a Comment

0 Comments