భారత్‌లో రెండో యాపిల్ స్టోర్‌ ప్రారంభం !


ఢిల్లీలోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో 'యాపిల్‌ సాకేత్‌' స్టోర్‌ను కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రారంభించారు. ముంబై స్టోర్‌తో పోలిస్తే ఇది దాదాపు సగం ఉంటుంది. స్టోర్‌ విక్రయాల్లో నిర్దిష్ట భాగాన్ని లేదా నెలకు రూ.40 లక్షలు (ఏది ఎక్కువైతే అది) అద్దె కింద కంపెనీ చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాకేత్‌ స్టోర్‌లో 18 రాష్ట్రాల నుంచి 70 మంది పైగా సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు. వీరు 15 భాషల్లో సేవలు అందిస్తారు. భారత్‌లో తొలిసారిగా తమ స్టోర్స్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా దేశీయంగా పర్యటిస్తున్న టిమ్‌ కుక్‌ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కూడా కలిశారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments