Ad Code

కూ లైఫ్‌ టైమ్ ఫ్రీ వెరిఫికేషన్ ఆఫర్ !


ట్విట్టర్ తమ యూజర్ల కోసం పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను ప్రారంభించగా, ఇప్పుడు ట్విట్టర్‌కు పోటీగా కూ యాప్ ఉచితంగా వెరిఫికేషన్ అందించనుంది. ప్రముఖ వ్యక్తులందరికి ఉచితంగా లైఫ్ టైమ్ వెరిఫికేషన్ అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కూ వెబ్‌సైట్‌లో పేర్కొంది. తమ కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కూ యాప్ అకౌంట్లకు ఎల్లో టిక్‌ తో వినియోగదారు ప్రొఫైల్‌ను అందించనుంది. కూ యూజర్ల కోసం సమాన అవకాశాలను అందించే సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఫ్రీ లైమ్‌టైమ్ వెరిఫికేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తులు, క్రియేటర్లందరికి అందుబాటులో ఉంటుంది, కూ అకౌంట్లను ఫాలో అయ్యే ఫాలోవర్లలో మరింత విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి వారి ప్రతిష్టను కాపాడుకోవడానికి, ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి మోసాలకు లేకుండా వీలు కల్పిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ 'కూ ప్లాట్‌ఫారంపై ఐడెంటిటీ ఐకాన్‌గా అర్హత పొందిన ప్రముఖ వ్యక్తులందరికీ ఉచితంగా జీవితకాల ధృవీకరణను అందిస్తాం. వారి ఫాలోవర్లతో సురక్షితంగా ఉండేలా రూపొందించాం. మెరిట్ ఆధారిత ప్లాట్‌ఫారమ్, ధర లేకుండానే ప్లాట్‌ఫారమ్ పారదర్శక పద్దతిలో అర్హత పొందినవారికి లైఫ్ టైమ్ ఫ్రీ వెరిఫికేషన్ అందించనున్నాం. కూ ఎమినెన్స్ టిక్ అనేది ప్రతిష్టాత్మకమైన ఐకాన్. ఈ ఐకాన్ కొనుగోలు చేయలేం. ప్రముఖ వ్యక్తులందరికీ ఈ డిజిటల్ హక్కును కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం' అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ 2.0 అనుభవాన్ని క్రియేట్ చేసేందుకు గత 3 ఏళ్లుగా ప్రయత్నాలను కేంద్రీకరించినట్టు తెలిపారు. 100+ దేశాల నుంచి 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో రెండవ అతిపెద్ద మైక్రోబ్లాగ్ అవతరించామన్నారు. ప్రతి వాటాదారు కూలో ఉండటం వల్ల లాభపడతారని తెలిపారు. ఉచితంగా అందించే ఫీచర్‌పై ఎప్పటికీ ఎలాంటి ఛార్జ్ విధించమని కంపెనీ స్పష్టం చేసింది. ఎల్లో టిక్‌తో కూ ఉచిత ఎడిట్ ఫంక్షనాలిటీ, 500-అక్షరాల పోస్ట్, లాంగ్ వీడియోలు, ఒకేసారి 20+ గ్లోబల్ భాషల్లో పోస్ట్ చేయడం, ​​ChatGPT ప్రాంప్ట్, పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం, డ్రాఫ్ట్‌లను క్రియేట్ చేయడం, మానిటైజేషన్ టూల్స్ వంటి అనేక ఫీచర్లను ఉచితంగా అందిస్తోంది. కూ క్రియేటర్ల కోసం.. ఇతర యూజర్లకు లాయల్టీ ప్రోగ్రామ్, అన్ని సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో బెస్ట్ ప్రోయాక్టివ్ కంటెంట్ మోడరేషన్ అందించనున్నట్టు తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu