Ad Code

ప్రజాదరణ పొందిన కార్లు !


కరోనా సమయంలోనూ కార్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఇప్పటికీ కార్ల విక్రయాల జోరు తగ్గలేదు.  మారుతీ సుజుకి ఈకో కారు అత్యంత చౌకైన 7-సీటర్ కారు. ఇది పెట్రోల్, CNG ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 81 బిహెచ్‌పి పవర్, 104 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.25 లక్షల నుంచి రూ.6.51 లక్షల మధ్య ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ MPV. ఇది 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.33 లక్షల నుండి రూ. 8.97 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న MPV. ఇది 99 bhp పవర్, 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.35 లక్షల నుంచి రూ.12.79 లక్షల మధ్య ఉంటుంది. Kia Carens 113 bhp పవర్‌తో 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 158 bhp పవర్‌తో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 114 bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.45 లక్షల నుంచి రూ.18.95 లక్షల మధ్య ఉంటుంది. మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌తో ఉంది. ఇది 98 bhp పవర్‌, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.63 లక్షల నుండి రూ.12.14 లక్షల మధ్య ఉంది.

Post a Comment

0 Comments

Close Menu