Header Ads Widget

టిమ్ కుక్‌కి నచ్చిన లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ !


ఢిల్లీ, ముంబయిలలో యాపిల్ కంపెనీ తమ నూతన స్టోర్స్ ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఢిల్లీకి వచ్చారు. లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లోని సెయింట్ + ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ వేసిన చిత్రాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంలో చిత్రాలను వేసిన కళాకారులను ఆయన అభినందించారు. తాను చూసిన చిత్రాలను స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ  ఢిల్లీలోని లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ చాలా అద్భుతమైన ప్లేస్ అని, అలాంటి ప్రదేశాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని, సెయింట్ + ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ కు , అక్కడ ఆర్ట్ వేసిన కళాకారులకు అభినందనలు అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. తనకు ఐప్యాడ్ లో అక్కడ చిత్రాలు ఎలా గీస్తారో చూపించిన ఆర్టిస్త్ దత్తరాజ్ నాయక్‌కు కూడా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జనం కామెంట్లు పెడుతున్నారు. ప్రజల మనసు దోచుకోవడం ఎలానో కుక్‌కి తెలుసని కొందరు అక్కడి కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్‌లో గోడలపై ఇండియా, ఇరాన్, జర్మనీ,జపాన్ దేశాలకు చెందిన కళాకారులచే గీసిన కళాఖండాలు ఆకర్షిస్తాయి. ఇండియాలోనే మొదటి ఆర్ట్ డిస్ట్రిక్ట్ గా చెప్పబడే ఈ కాలనీని బ్రిటీష్ వారు ఏర్పాటు చేసిన చివరి కాలనీ అని కూడా చెబుతారు. మొత్తానికి యాపిల్ సీఈవోని ఈ డిస్ట్రిక్ట్ ఎంతగానో ఆకట్టుకుంది.

Post a Comment

0 Comments