Ad Code

మలి దశలో డిస్నీ భారీగా ఉద్యోగుల తొలగింపు


డిస్నీ రెండో విడత తొలగింపుల్లో భాగంగా 4 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసింది. అలాగే ఈ వేసవిలోనే మూడవ రౌండ్ కూడా ప్రారంభమవుతుందని చెబుతూ ఉండడంతో ఉద్యోగులు హడళెత్తిపోతున్నారు. ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఉద్యోగులను తొలగించి.. దీని ద్వారా సుమారు 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు డిస్నీ సంస్థ భావిస్తోంది. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్‌పీఎన్‌, డిస్నీ పార్క్స్ లోని ఉద్యోగులపై రెండో విడత కోతల ప్రభావం పడనుంది. అమెరికా వ్యాప్తంగా ఉద్యోగులను డిస్నీ తొలగించనుంది. Burbank, క్యాలీఫోర్నియా, న్యూయార్క్‌, కనెక్టికట్ ప్రాంతాల్లో పనిచేసే వారిపై ఈ ప్రభావం ఉండనుంది. 'నేను ఈ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోను. ప్రపంచవ్యాప్తంగా మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రస్తుతం చేపడుతున్న మార్పులు అంతిమంగా కంపెనీ ఆర్థికస్థితిని ద`ష్టిలో ఉంచుకుని చేపడుతున్నవే. ఈ నిర్ణయం ఉద్యోగులపై వ్యక్తిగతంగా ప్రభావం చూపుతుంది. కానీ, తప్పట్లేదు" అని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu