బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొత్త బైక్


బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ తమ ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను BI C -12 మాడల్ ను విడుదల చేసింది..D-15,B -8,A2 ల బైకులతోపాటు C-12 బైకుని విడుదల చేయడం జరిగింది. ఇది అత్యంత శక్తివంతంగా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. అత్యంత తక్కువ ధరకే అందుబాటులో లభ్యం కాబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా 100% మేడిన్ ఇండియా అయిన విద్యుత్ స్కూటర్ C-12 భద్రత సౌకర్యం వంటి కీలక ప్రాధాన్యతలు కూడా కలిగి ఉంటాయని, అలాగే 20 కి పైగా ఫీచర్లతో రాబోతోందని తెలిపారు. C-12 విడుదల సందర్భంగా బికాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా మాట్లాడుతూ..C-12 ఐ మ్యాక్స్ పరిశ్రమలో మొదటిసారిగా ఈ తరహా ఫీచర్లు అయినటువంటి బైకు రావడం ఇదే మొదటిసారి అలాగే బూట్ స్పేస్ ను కలిగి ఉంటుందని తెలిపారు. ఇందులో ఫుల్ ఫేస్ హెల్మెట్ భద్రపరచుకోవచ్చు కుటుంబానికి అనుభవంగా పొడవు ఉంటుంది. అత్యంత సౌకర్యమైన ఫీలింగ్ కలుగుతుంది వీటితో పాటుగా ARAI సర్టిఫికెట్ తో సంబంధం లేకుండా 140 కిలోమీటర్ల కు పైగా ప్రయాణిస్తోంది ..వాటర్ ప్రూఫ్..IP-67 రేటెడ్ విద్యుత్ మోటారు బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్లు..3.2 కిలో వాట్ హౌర్ క్యాన్ ఎనేబుల్ లిథియం బ్యాటరీ కలిగి ఉంటుందని తెలియజేశారు. వినియోగదారులు తాజాగా ఈ బైక్ ని బుక్ చేసుకోవాలి అంటే వెబ్సైట్ ద్వారా దగ్గరలో ఉండే డీలర్ షిప్ వద్ద మాత్రమే బుక్ చేసుకుని సదుపాయం కలదు.. అయితే దీని ధర ప్రారంభం నుంచే రూ.97,999 రూపాయలు మాత్రమే .. అయితే వీటి మీద పలు ఆఫర్లు కూడా ఉన్నట్లు సమాచారం

Post a Comment

0 Comments