Ad Code

చైనా మార్కెట్ లోఎంఐ సివీ 25న విడుదల !


దేశంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ ఫోన్ తీసుకున్నా వెనక వైపు కెమెరాలు ఒకే రకంగా ఉంటున్నాయి. ఫోన్ ధరకు అనుగుణంగా డ్యుయల్, ట్రిపుల్ కెమెరాల సెటప్‌తో వస్తున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా మాత్రం ధరను బట్టి ఒకే కెమెరాతో వస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ మే 25న లాంచ్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ కోనోమట్‌ గ్రే, మింట్ గ్రీన్, ఎడ్వంచర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ ఎంఐ కంపెనీ ఈ ఫోన్ రిలీజ్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.  6.5 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 12 జీబీ+256 జీబీ వేరియంట్ లో లభిస్తుంది.  ఎంఐయూఐ 14 ద్వారా ఆండ్రాయిడ్ 13తో వర్కింగ్, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 20 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో రౌండ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ+32 ఎంపీ కెమెరాలతో డ్యుయల్ ఫ్రంట్ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అయితే ఈ తాజా ఫోన్ చైనా మార్కెట్ 25న లాంచ్ చేస్తుండగా.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారో? అనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.

Post a Comment

0 Comments

Close Menu