దేశీయ మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కోమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కోమాకి ఈవీ స్కూటర్ధర రూ. 1,31,035 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ బైకులో మోడల్ యాంటీ-స్కిడ్ టెక్నాలజీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాప్-ఆధారిత స్మార్ట్ బ్యాటరీలతో వస్తుంది. ఇందులోని బ్యాటరీలు అగ్ని-నిరోధకతను కలిగి ఉంటాయి. డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ కంట్రోల్ కొత్త కీ ఫోబ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట స్పీడ్ గంటకు 85కిమీ దూసుకెళ్తుంది. ఇందులో 18-లీటర్ బూట్ కూడా ఉంది. 2023 Komaki TN 95 ప్రత్యేక ఫీచర్లలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్, LED DRL, LED ఫ్రంట్ వింకర్‌లు, TFT స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, ఆన్-రైడ్ కాలింగ్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. కొమాకి బైకులో మెటల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. 5kW హబ్ మోటార్ ద్వారా పవర్ అందిస్తుంది. 50amp కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 3 గేర్ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్బో రీజెన్‌తో వచ్చాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. 2023 Komaki TN 95 స్కూటర్130-150km, 150-180km పరిధిని బట్టి రెండు వేరియంట్‌లలో అందిస్తోంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment