వాట్సాప్‌లో తాజాగా గుర్తించిన ఒక బగ్, యూజర్ల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ సమస్య కారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి. నిర్దిష్ట టెక్స్ట్ మెసేజ్ అందుకున్నప్పుడు యాప్ క్రాష్ అవుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు 'wa.me/settings.' అని టైప్ చేసి ఇతర యూజర్లకు పంపినప్పుడు ఈ సమస్య ఎదురవుతోంది. ఈ టెక్స్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారితో పాటు పంపిన వారు కూడా యాప్ క్రాష్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు ఒక యూజర్ ఒక చాట్‌కు wa.me/settings అని టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే, వారి యాప్ క్రాష్ అవుతుంది. ఆ తర్వాత రిసీవర్ ఈ మెసేజ్ ఓపెన్ చేయగానే వారి వాట్సాప్ యాప్ కూడా క్రాష్ అవుతుంది. ఈ మెసేజ్‌ను డిలీట్ చేయడం కూడా సాధ్యం కాట్లేదు. దీనివల్ల పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు ఇద్దరూ వారి చాట్స్ ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఈ టెక్నికల్ ఇష్యూ లేదా బగ్‌పై వాట్సాప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా కంపెనీ స్పందించాల్సి ఉంది. అయితే ఈ బగ్‌ను యూజర్లు సొంతంగా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. web.whatsapp.com వెబ్‌సైట్‌కి వెళ్లి వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అవ్వాలి. సమస్యకు కారణమైన 'wa.me/settings' అనే టెక్స్ట్ మెసేజ్‌ను చాట్ నుంచి డిలీట్ చేయాలి. తర్వాత డివైజ్‌లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తే.. అది మునుపటి లాగే సాధారణంగా పనిచేస్తుంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment