Ad Code

పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.12 లక్షలకు పైనే !


ప్రపంచంలో లగ్జరీ కార్లకు జర్మనీ ఆటోమేకర్ పోర్ష్ పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఆ కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్ అలాగే ఉంది. ఈ కంపెనీ కాస్ట్‌లీ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా తయారుచేస్తోంది. పోర్షే కంపెనీ తన జాయింట్ వెంచర్, ఈ-బైక్స్ తయారుచేసే రాట్‌వైల్డ్‌ కంపెనీతో కలిసి ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారుచేయించి మార్కెట్లోకి తెస్తోంది. ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా... పోర్షే-రాట్ వైల్డ్ కలిసి తయారుచేశాయి. ఐతే.. వీటి ఫాన్సీ కలర్స్ వీటి ధరను ఆకాశంలో ఉంచాయి. పోర్షేకి చెందిన టేకాన్‌కి ఉండే స్లీక్ రూఫ్‌లైన్‌ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ బైక్స్ డిజైన్ రూపొందింటారు. ఈ డిజైన్‌ని మనం బైక్ .. స్లోపింగ్ బోన్‌లైన్‌లో హెడ్ నుంచి డ్రాపౌట్ వరకూ చూడగలం. ఈ బైక్స్ ఫ్రేమ్‌ని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. వీల్స్, కాక్ పిట్‌ కూడా అలాంటివే. ఇవి పర్వతాలపై నడిపేందుకు వీలుగా ఉంటాయి కాబట్టే వీటి ధర ఎక్కువగా ఉంటోంది. పెర్ఫార్మెన్స్ వైపు చూస్తే.. ఈ మౌంటేన్ ఎలక్ట్రిక్ సైకిళ్లకు షిమానో EP-801 మోటర్ ఉంది. 630 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. కానీ మైలేజ్ ఎంత అన్నది చెప్పలేదు. గొప్ప విషయం ఏంటంటే.. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మోటర్‌కి 12 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అవుతాయి. ఈ బైక్స్‌లో ఫ్రీ షిఫ్ట్ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా.. పెడలింగ్ చెయ్యకుండానే.. గేర్స్ మార్చుకోవచ్చు. అలాగే.. మగురా MT7 బ్రేక్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లకు ఫ్రంట్ వైపు Fox 34 ఫ్లోట్ ఫ్యాక్టరీ సస్పెన్షన్ ఉంది. వెనకవైపు ఫాక్స్ ఫ్లోట్ DPS ఫ్యాక్టరీ షాక్ సస్పెషన్ ఉంది. స్టాండర్డ్ క్రాస్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.11,74,250 ఉంది. అలాగే.. క్రాస్ పెర్ఫార్మెన్స్ EXC ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.12,64,893 ఉంది.

Post a Comment

0 Comments

Close Menu