Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, June 18, 2023

యూరప్ మార్కెట్లలో రెడ్ మీ 12 విడుదల


షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్ మీ శుక్రవారం సెలెక్టెడ్ మార్కెట్లలో తన రెడ్ మీ 12 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో, మూడు రామ్ అండ్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కల రెడ్ మీ 12 ఫోన్ మీడియా టెక్ జీ88 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది. రెడ్ మీ 12 ఫోన్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర యూరప్‌లో సుమారు రూ.17 వేలు (199 యూరోలు). థాయిలాండ్ లో 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర 5299 టీహెచ్బీ (సుమారు రూ.12,500) ఉంటుంది. మిడ్ నైట్ బ్లాక్, పొలార్ సిల్వర్, స్కై బ్లూ షేడ్స్ లో లభిస్తుంది. భారత్ సహా ఇతర మార్కెట్లలో రెడ్ మీ 12 ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు. రెడ్ మీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 6.79 -అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2460 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ 1500:1 కాంట్రాస్ట్ రేషియో, విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. మీడియా టెక్ హెలియో జీ 88 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్ తో వస్తున్నది. యూజర్లు వర్చువల్ రామ్ 16 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. ఏఐ సపోర్టెడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది. సింగిల్ చార్జింగ్ తో 37 గంటల పాటు టాక్ టైమ్ బ్యాకప్ కలిగి ఉంటుంది. 4జీ, వై-ఫై, బ్లూ టూత్ 5.3, గ్లోనాస్, గాలిలియో, బైదూ, ఎన్ఎఫ్సీ, ఎఫ్ ఎం రేడియో, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, జీపీఎస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts