Ad Code

రూ.22కే 90 రోజుల పాటు సర్వీస్ వ్యాలిడిటీ !


గత కొన్ని సంవత్సరాలుగా రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారాయి. ప్రతి నెలా రీఛార్జ్ చేయకపోయినా, సిమ్ లో  ఇన్ కమింగ్  అవుట్ గోయింగ్ సౌకర్యం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు సిమ్ కార్డులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. బీఎస్ఎన్ఎల్ రూ. 22 రీఛార్జ్ ప్లాన్ 90 రోజులు అంటే మూడు నెలల సర్వీస్ వ్యాలిడిటీ వస్తుంది. దీంతో మీరు కాల్స్ చేసుకోవచ్చు. మీ సిమ్ మూడు నెలల పాటు యాక్టివ్ లో  ఉంటుంది. అయితే కాల్స్ ఫ్రీగా చేసుకోవటానికి ఉండదు. బ్యాలెన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్టీడీ, లోకల్ కాలింగ్కు నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తారు. అలాగే ఉచిత ఇంటర్నెట్, SMS సౌకర్యం అందుబాటులో ఉండదు. ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ లో  అందుబాటులో ఉంది. రెండు సిమ్లను ఉంచాలనుకుంటే బీఎస్ఎన్ఎల్  ప్లాన్ ని  ఎంచుకోవచ్చు.  దేశంలో బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అన్ని రాష్ట్రాల్లోని వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, రెండో ప్లాన్ ధర రూ.439గా బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ లో వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలి పోతే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది. రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ లో వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్ లిమిటెడ్  వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం కంపెనీ అందించడం లేదు.

Post a Comment

0 Comments

Close Menu