Ad Code

8న రియల్‌మీ మరో ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లోకి రియల్‌మీ మరో ఫోన్ విడుదల చేయనుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ..సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను పరిచయం చేసే రియల్ మీ ఈ సారి రియల్‌మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లతో ముందుకొచ్చింది. ఈనెల ఎనిమిదో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో రియల్ మీ 11 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు భారత్ లో ఆవిష్కరించనుంది. ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి ఆఫర్లను సైతం ప్రకటించింది. గత నెలలోనే ఈ ఫోన్లు చైనా మార్కెట్లో విడదలయ్యాయి. రియల్‌మీ 11 ప్రో 5జీ.. 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్‌సెట్ విత్ 12జీబీ రామ్‌తో వస్తోంది. రియల్‌మీ 11 ప్రో 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా, రియల్‌మీ 11 ప్రో+ 5జీ ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సదుపాయాం కలదు. రియల్ మీ 11 ప్రో విత్ 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్, రియల్ మీ 11 ప్రో + 5జీ ఫోన్ 100 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + కర్వ్‌డ్ డిస్ ప్లేస్ విత్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ ఫోన్లు సొంతం. రియల్ మీ 11 ప్రో 5జీ ఫోన్ దాదాపు రూ.20 వేలు కాగా, రియల్‌మీ 11 ప్రో+ 5జీ ధర సుమారు రూ.24 వేలుగా ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్ బుక్ చేసుకున్న వారు రూ.4,499 విలువ గల రియల్‌మీ వాచ్2 ప్రో ఉచితం.

Post a Comment

0 Comments

Close Menu