Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, June 17, 2023

జీమెయిల్‌లో 'హెల్ప్ మీ రైట్' !

                                   

గూగుల్ ఏఐ ఆధారిత ఫీచర్లను తన ఇతర యాప్ లలో ఆవిష్కరించింది. వాటిల్లో గూగుల్ డాక్స్, జీమెయిల్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్ ఫారంలు ఉన్నాయి. ముఖ్యంగా జీమెయిల్ లో మెయిల్స్ ఆటోమేటిక్ గా రాయడానికి కృత్రిమ మేధను తీసుకొచ్చింది. దానికి 'హెల్ప్ మీ రైట్' అనే పేరు పెట్టింది.  జీమెయిల్ లో మీరు ఏదైనా మెయిల్ చేయాలనుకోండి, మీరు మెయిల్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే ఇన్ పుట్స్ ఆధారంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తనే ఈ మెయిల్ డ్రాఫ్ట్ లను తయారు చేసి అందిస్తుంది. దీని వల్ల వినియోగదారుల సమయం ఆదా అవడంతో పాటు పని సులభతరం అవుతుంది. జీ మెయిల్ లోకి వెళ్లి కంపోస్ అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. మీకు ఓపెన్ అయిన కంపోస్ విండలో కింద హెల్ప్ మీ రైట్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పడు ఓపెన్ అయిన ప్రాప్ట్ బాక్స్ లో మీరు పంపాలనుకుంటున్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ని టైప్ చేయాలి. ఉదాహరణకు లీవ్ అప్లికేషన్ కావాలనుకోండి.. 'రైట్ యాన్ ఈమెయిల్ ఫర్ లీవ్ అప్లికేషన్' అని టైప్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్ అని ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు జీమెయిల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీకు కావాల్సిన లెటర్ ని డ్రాఫ్ట్ చేసి అందిస్తుంది. దానిని మీరు కావాలంటే రీ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన డ్రాఫ్ట్ ఓకే అనుకుంటే ఇనసర్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెండ్ బటన్ పై క్లిక్ చేస్తే మెసేజ్ వెళ్లపోతుంది. మీరు జీమెయిల్ లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని సక్రమంగా వినియోగించాలంటే మీరు ఇచ్చే మోడల్ సజెషన్ కరెక్ట్ గా ఉండాలి. ఉదాహరణకు మీరు మీ సహోద్యోగికి ఈమెయిల్ చేయాలనుకుంటే, 'ఈ మెయిల్ టు ఎ కొలీగ్' అని మాత్రమే టైప్ చేయకుండా కాస్త వివరంగా ఇవ్వాలి. అదెలా అంటే 'ఈమెయిల్ టు మై కొలీగ్ రాజు అబౌట్ ఎ ప్రజెంటేషన్' అని ఇవ్వాలి. దీనిలో మీరు ఫార్మలైజ్, ఎలాబోరేట్, షార్టెన్ బటన్స్ ని వినియోగించి డ్రాఫ్ట్ ని మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. అలాగే మీరు రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయడం ద్వారా కొత్త డ్రాఫ్ట్ ని పొందవచ్చు. అయితే ఈ టూల్ కాన్ఫిడెన్షియల్, సెన్సిటివ్ విషయాలు ఏఐ టూల్ రాయదు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts