Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, June 17, 2023

మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తుందట !


టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను విప్లవం సృష్టించింది. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ మానవాళిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ టెక్నాలజీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే, అన్ని రకాల టెక్నాలజీల మాదిరిగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనూ దుష్ప్రభావాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ కారణంగా ఎంతో మంది మనుషులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. మనుషులు చేసే చాలా ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. కానీ, ఏఐ దుష్ఫలితాలు ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టాప్ కంపెనీల సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఏఐ ప్రొడక్టులు అయిన చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి చాట్‌బాట్‌లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా టెక్ రంగంలో ఇవి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. కానీ, ఇప్పుడు ప్రధాన సమస్యగా పరిణమించాయి. ఇటీవల 'ఏలె సీఈవో సమ్మిట్'కి హాజరైన కంపెనీల అధినేతలు, సీఈవోలను ఏఐ గురించి అడగ్గా విస్తుపోయే సమాధానాలు వెల్లడించారు. రానున్న 5-10 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవత్వానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దాదాపు 42 శాతం మంది సీఈవోలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సీఈవో సమ్మిట్‌లో పాల్గొన్న వ్యాపార వేత్తలు, సీఈవోలు, కంపెనీల అధినేతల వద్ద అభిప్రాయాలను సేకరించి 'సీఎన్ఎన్'  అధ్యయనం చేపట్టింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొని తమ ఒపీనియన్‌ని షేర్ చేశారు. వాల్‌మార్ట్, కోకాకోలా, జిరాక్స్, ట్విటర్ వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. ట్విటర్, టెస్లా సీఈవో అయిన ఎలన్ మస్క్‌తో పాటు వివిధ కంపెనీల అధినేతలు ఏఐ గురించి ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనుషులను ఇది తినేస్తుందని చెప్పుకొచ్చారు. సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే పదేళ్లలో మనుషులలో మానవత్వాన్ని ఏఐ హరిస్తుందని 34 శాతం మంది సీఈవోలు వెల్లడించారు. కానీ, ఏఐకి కేవలం ఐదేళ్లు చాలని మరో 8 శాతం మంది నొక్కి చెప్పారు. 58 శాతం మంది సీఈవోలు ఉద్యోగులకు ఉపశమనం కలిగించే విధంగా మాట్లాడారు. మనుషులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయలేదని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ సూచించారు. ఏదేమైనా కార్పొరేట్ ప్రపంచంలో ఏఐ ఒక అద్భుత సాధనమని కొంతమంది నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏఐతో రిస్క్ ఉందనే వాదనను కొట్టి పడేస్తున్నారు. వర్క్‌ప్లేస్‌లలో ఉత్పాదకతను పెంచేందుకు ఏఐ ఎంతో తోడ్పడుతుందని చెబుతున్నారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts