Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, June 8, 2023

ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్

టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని అన్ని రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇందులో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ సెక్టార్ ఒకటి. ఇటీవల కాలంలో ఈ విభాగంలోని నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఒకవైపు సైబర్ సెక్యూరిటీ రంగం దూసుకుపోతుంటే, మరోవైపు అదే స్థాయిలో సైబర్ థ్రెట్స్, అటాక్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ బిజినెస్ కార్యకలాపాలు ఏటా పెరిగిపోవడంతో, వివిధ మార్గాల్లో నేరగాళ్లు సైబర్ అటాక్స్‌కు పాల్పడుతున్నారు. కంపెనీలు, వ్యక్తులు, సంస్థల విలువైన సమాచారాన్ని దోచేస్తున్నారు. దీంతో సైబర్ థ్రెట్స్, హ్యాక్స్ నుంచి విలువైన సమాచారాన్ని రక్షించే వైట్-హ్యాట్ హ్యాకర్స్‌(సైబర్ ప్రొఫెషనల్స్)కు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు, ప్రభుత్వాలు, సంస్థలకు సమాచారం, డేటా సెక్యూరిటీ అనేవి విలువైన ఆస్తులు. అయితే సైబర్ అటాక్స్ పెరిగిపోతుండటంతో ఇటీవల కాలంలో డేటా సెక్యూరిటీపై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. సైబర్ థ్రెట్స్ నుంచి విలువైన డేటాను రక్షించుకోవడానికి ఎథికల్ హ్యాకర్స్‌ను భారీగా రిక్రూట్ చేసుకుంటూ పెనట్రేషన్టె స్టింగ్‌ నిర్వహిస్తున్నాయి. తద్వారా కంపెనీలు తమ అప్లికేషన్స్‌లో బగ్స్ గుర్తించి రిపోర్ట్ చేసిన వారికి రివార్డ్ సైతం అందజేస్తున్నాయి. ఈ చర్యలతో కంపెనీలు ఫిజికల్, ఫైర్ వాల్ సెక్యూరిటీని మరింత మెరుగుపర్చుకుంటున్నాయి. డిజిటల్ వరల్డ్‌లో కొత్త టెక్నాలజీ ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అదే సమయంలో టెక్నాలజీ సాయంతో సైబర్ హ్యాకర్స్ వివిధ మార్గాల్లో సైబర్ థ్రెట్స్‌కు పాల్పడటం సాధారణం అయిపోయింది. దీంతో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌కు కంపెనీల్లో డిమాండ్ పెరుగుతోంది. సైబర్ నిపుణుల ప్రకారం.. సిస్టమ్‌ నుంచి అనధికారిక యాక్సెస్ పొందడానికి ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక మార్గం. హ్యాకర్ కోణం నుంచి సిస్టమ్‌ను పరిశోధించి విశ్లేషణ చేయవచ్చు. భవిష్యత్తులో జరిగే సైబర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు. అందుకే డేటా, సమాచారాన్ని రక్షించడానికి ప్రతి సంస్థకు ఎథికల్ హ్యాకర్స్ అవసరం ఉంది. ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వానికి సంబంధించిన డేటా అయినా సరే.. ప్రొటెక్షన్ మాత్రం అవసరం. అందుకే సైబర్ సెక్యూరిటీ స్పేస్‌లో ఎథికల్ హ్యాకింగ్, సంబంధిత ఉద్యోగాల రేంజ్ విస్తృతమైందని నిపుణులు అంటున్నారు. సైబర్‌ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్‌లో ప్రొఫెషనల్‌గా స్థిరపడాలంటే కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి అంశాలపై మంచి పట్టుసాధించాలి. ఇందుకు అవసరమైన స్కిల్స్ పెంపొందించుకోవడానికి మార్కెట్‌లో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు భారీగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. అందుకే ఈ రంగంలో ఉద్యోగవకాశాల పరిధి పెరిగింది.offerbazar24/7

No comments:

Post a Comment

Popular Posts